{"title":"Dwivedula Visalakshi","description":null,"products":[{"product_id":"bhaava-bandham-by-dwivedula-visalakshi","title":"Bhaava Bandham Dwivedula Visalakshi","description":"\u003cp\u003eBhaava Bandham by Dwivedula Visalakshi భావబంధం \u003c\/p\u003e\n\u003cp\u003eమాతృత్వం అనేది స్త్రీకి ఒక గొప్ప అనుభూతి. మరువరాని అనుభవం. ఆమె గర్భం ధరించింది లగాయతు పుట్టబోయే బిడ్డ గురించీ, ఆ బిడ్డను సాకవలసిన పద్ధతి గురించీ ఎన్నో ఆలోచించుకుంటుంది. నవ మాసములు నిండి బిడ్డ పుట్టేసరికి ఆమెకి, ఆ బిడ్డకి అవినాభావ అనురాగం ఏర్పడుతుంది. అంతవరకూ చిన్నపిల్లలా వున్న ఆ మాతృమూర్తి ఎంతో అనుభవం గల ప్రౌఢలా ఆ బిడ్డను లాలిస్తుంది. ఇదంతా ప్రకృతి సహజం. బిడ్డ గర్భస్తుడైంది లగాయతు స్త్రీకి శారీరకంగా, మానసికంగా అనేక మార్పులు వస్తాయి. ఆమె ప్రేమ ప్రకృతి సిద్ధంగా పరిణతి చెందుతుంది. తప్పక చదవండి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48194351464704,"sku":null,"price":115.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/bavabandham_dwivedulavisalakshi.jpg?v=1774345533"},{"product_id":"ekha-valasina-railu-by-dwivedula-visalakshi","title":"Ekha Valasina Railu Dwivedula Visalakshi","description":"\u003cp\u003eEkha Valasina Railu by \u003cspan\u003eDwivedula Visalakshi\u003c\/span\u003e ఎక్కవలసిన రైలు\u003c\/p\u003e\n\u003cp\u003eవంద గజాల దూరంలో ఉండిపోయిన సుందరమూర్తి తెలుసుకొన్నాడు.. ఆ వెళ్ళిపోయింది తను ఎక్కవలసిన రైలు.. అది తను ఎక్కకుండానే వెళ్ళిపోయింది. ఇంతదూరం ప్రయాణించి, ఎక్కవలసిన రైలు అందుకోలేక మిగిలిపోయాడు తను. తను చుట్టుదారి పట్టకుండా సూటిదారిన ప్రయాణిస్తే ఈ సరికి ఏ అరగంట కిందటో స్టేషను చేరుకొని ఉండేవాడు. ఎక్కుదామనుకొన్న రైలు ఎక్కి చేరుదామనుకున్న గమ్యం చేరి ఉండేవాడు. కాని, ఇప్పుడింకేం లాభంలేదు. తను ఎక్కవలసిన రైలు వెళ్ళిపోయింది. తిరిగి ఇంకో రైలు వచ్చేదాకా దానికోసం నిరీక్షిస్తూ అలా ఉండవలసిందే... సుందరమూర్తి ఎక్కవలసిన రైలు, అతడు ఎక్కకుండానే వెళ్ళిపోతున్న రైలు వెనక వున్న ఎర్రదీపాలు అతన్ని చూసి వెక్కిరిస్తున్నాయి. కాలం విలువ తెలుసుకోలేని ఓ బుద్ధిహీనుడా... జీవితంలోకి నీకిది ఒక గుణపాఠం, అంటూ హెచ్చరిస్తున్నాయి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48194375188736,"sku":null,"price":55.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/ekavalasinarylu_dwivedulavisalakshi.jpg?v=1774345874"},{"product_id":"entha-dhoorami-payanam-by-dwivedula-visalakshi","title":"Entha Dhoorami Payanam Dwivedula Visalakshi","description":"\u003cp\u003eEntha Dhoorami Payanam by \u003cspan\u003eDwivedula Visalakshi ఎంతదూరమీ పయనం\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఅమాయకపు పల్లెపడుచు సీత పట్నంలో భర్త ఇంట బ్రతుకులో మొదటి పాఠాలు నేర్చుకొంటుంది. అన్నగారి కుటుంబానికి ఏవిధంగానూ సహాయపడలేని తన అశక్తతకి బాధపడుతుంది. హైదరాబాద్ జీవితం, సుందరి సాంగత్యం, వదినగారి అనారోగ్యం ఆమె జీవితాన్ని కొత్త మలుపు తిప్పుతాయి. ఒకనికి కూతురుగా, మరొకనికి భార్యగా, వేరొకనికి తల్లిగా ఆడదాని ఆ హోదాలు తొలగిపోతే చివరికి మిగిలే ఆమె జీవితం ఏమిటి? ఇది ఒక సీత కథ. ఒక రాజమ్మ - ఒక అనసూయ - ఒక సుందరి - ఒక శాంత - తరతరాల తెలుగు ఆడపడుచుల జీవిత కథ. పలాయన వాదానికి దూరంగా, సహజత్వానికి దగ్గరగా రాయబడిన నవల.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48194381807872,"sku":null,"price":85.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/enthadhooramipayanam_dwivedulavisalakshi.jpg?v=1774346103"},{"product_id":"gomathi-by-dwivedula-visalakshi","title":"Gomathi Dwivedula Visalakshi","description":"\u003cp\u003eGomathi by \u003cspan\u003eDwivedula Visalakshi \u003c\/span\u003eగోమతి\u003c\/p\u003e\n\u003cp\u003e...చిన్ననాటి స్నేహం ముప్పేట గొలుసుగా పెనవేసుకున్న ముగ్గురి కథ! తాను ప్రేమిస్తున్న గోపాలానికి కాక తనను ప్రేమిస్తూన్న గోవిందుకి సతి అవుతుంది గోమతి. కలసిరాని మమతలు కరగిపోవాలని తీర్మానించుకుని నష్టజాతకుడి భార్యగా కష్ట జీవనపు కాడి మోస్తూంటుంది. విధి విలాసం! అంతలో ఎడపడతారు ఆత్మీయులు, తిరిగి అనుకోకుండా కలుస్తారు. గోపాలం పెద్ద ఉద్యోస్థుడుగా ఆ ప్రాంతానికి రావడంతో అతనికీ, గోమతికి మధ్య ఆకర్షణ బలీయమవుతుంది... గోవిందుకి విడాకులివ్వటం.. గోమతికి సులభసాధ్యమా?\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48194395177216,"sku":null,"price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/gomathi_dwivedulavisalakshi.jpg?v=1774346962"},{"product_id":"grahanam-vidichindhi-by-dwivedula-visalakshi","title":"Grahanam Vidichindhi Dwivedula Visalakshi","description":"\u003cp\u003eGrahanam Vidichindhi by గ్రహణం విడిచింది \u003c\/p\u003e\n\u003cp\u003eభారతికి జీవితం మీద ఇంకా మమత తీరలేదు. సుఖించాలనే కోరికా పోలేదు. మరి, ఆమెకు డబ్బు ఉంది. ఆమె చుట్టూ ఉన్నవారికి కావలసింది ఆమె డబ్బు, ఆమెకు కావలసింది ఆ డబ్బుతో లంకెలేని ప్రేమ. తనను తననుగా అభిమానించే ఆత్మీయులు కావాలి తనకు. వారు కొరవడటంతో భయాన్నీ, అనుమానాన్నీ చుట్టూ పోగు చేసుకుంది. బెంగతో తన బ్రతుక్కు తాను కాపలా కాసుకొంది. ఎవరికీ చెప్పకుండా ప్రశాంతమైన హృషీకేశానికి పలాయనం చిత్తగించింది. అక్కడ - ఆమె తెలుసుకొన్నదేమిటి? తిరిగి ఆత్మీయుల వద్దకు చేరుకోవడంలో ఆమె సాధించిందేమిటి?\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48194400059648,"sku":null,"price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/grahanamvidichindi_Dwivedulavisalakshi.jpg?v=1774347296"},{"product_id":"hari-villu-by-dwivedula-visalakshi","title":"Hari Villu Dwivedula Visalakshi","description":"\u003cp\u003eHari Villu By \u003cspan\u003eDwivedula Visalakshi \u003c\/span\u003eహరివిల్లు\u003c\/p\u003e\n\u003cp\u003eకృష్ణ మొదట అనసూయని తీసుకుని మంగాపురంలో కాలుపెట్టినప్పుడు  ఏ ఆకర్షణా లేకుండా ఉండేది అక్కడ ఉనికి. అంతలో హరివిల్లులోని రంగుల్లా అతని జీవితంలో ప్రవేశించారు రంగి, మువ్వ, పంకజం, కుముదం. ఎడారిలాంటి అతని బ్రతుకులో మువ్వ ఎన్నో అందాలు వెలయించిది. కాని హరివిల్లులోని రంగులు కరిగిపోక నిలుస్తాయా?\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48194404090112,"sku":null,"price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/harivillu_dwivedulavisalakshi.jpg?v=1774347524"},{"product_id":"jaarudumetlu-by-dwivedula-visalakshi","title":"Jaarudumetlu Dwivedula Visalakshi","description":"\u003cp\u003eJaarudumetlu by \u003cspan\u003eDwivedula Visalakshi \u003c\/span\u003eజారుడు మెట్లు\u003c\/p\u003e\n\u003cp\u003e.....వయసులో ఉండే ఆడపిల్ల, అందరిలాగే ఈ తొలిరేయిని ఎంతో మధురంగా ఊహించుకొంది. మనోహరంగా చిత్రించుకొంది... తన జీవితం పొడుగునా గుర్తుండిపోయేలా మనసులో ముద్ర వేసుకొంటుందనుకొంది... వాస్తవం ఊహలకి ఎంత భిన్నంగా ఉండగలదో ఎత్తిచూపుతోంది ఈ రాత్రి. నిర్ణీతమైన దారితప్పి ఒక్క అడుగు పక్కగా పడితే బ్రతుకు భళ్లున పగిలి ఎలా బద్దలైపోతుందో తెలుపుతోంది... అరిటాకు ముల్లుమీద పడినా, ముల్లు అరిటాకుమీద పడినా మోసం అరిటాకుకే అన్నది నిరూపించే నవల.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48194407399680,"sku":null,"price":75.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/jarudumetlu_dwivedulavisalakshi.jpg?v=1774347907"},{"product_id":"kala-kaanidhi-by-dwivedula-visalakshi","title":"Kala Kaanidhi Dwivedula Visalakshi","description":"\u003cp\u003eKala Kaanidhi by \u003cspan\u003eDwivedula Visalakshi \u003c\/span\u003eకలకానిది\u003c\/p\u003e\n\u003cp\u003eఎయిర్ ఇండియా విమానం తెల్లని మేఘాల తెరలని తొలగించుకుంటూ కిందకు దిగుతోంది. కింద దట్టమైన అడవులతో, నదులతో, వాగులతో, చిన్నా పెద్దా పట్టణాలతో, పల్లెలతో పరచుకుని వున్న భూ ఖండం మలేసియా ద్వీపకల్పం. కిటికీ అద్దానికి తల ఆనించి అందమైన ఆ దృశ్యాన్ని చూస్తోంది రాధ. అవును. అది తన దేశం. తను పుట్టి పెరిగిన మలయా దేశం. ఐదారేళ్ళ ప్రాయం వరకు ఆడిపాడిన అందాల సుందర నందనవనం. రెండు దశాబ్దాలుగా కాలం తనని తనవారికి దూరం చేసింది. తన బ్రతుకును వారి జీవితాలకు భిన్నంగా మలచింది. ఆ క్షణంలో రాధకు ఇండియా, మలేసియా వేరు వేరు భూఖండాలుగా అనిపించలేదు. జననీ జన్మభూమి. అది ఒక భావన. అనుభవైక వేద్యమైన ఒక సుందర భావన. మనిషి మనిషికీ ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో దర్శనమిచ్చే అలౌకిక అనురాగ సుధామయమైన అమర భావన. అనంతమైన ఈ అనురాగ జగత్సాగరంలో తనొక బిందువు. దానితోపాటు తనూ పయనిస్తూనే వుంటుంది అనంతంగా... అవిరామంగా..\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48194411266304,"sku":null,"price":65.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/kalakanidhi_dwivedulavisalakshi_aa8d779e-78c5-474e-aa67-cc10abf5c06a.jpg?v=1774348609"},{"product_id":"kathalu-dwivedula-visalakshi-dwivedula-visalakshi","title":"Kathalu Dwivedula Visalakshi","description":"\u003cp\u003eKathalu by \u003cspan\u003eDwivedula Visalakshi \u003c\/span\u003eకథలు \u003c\/p\u003e\n\u003cp\u003eద్వివేదుల విశాలాక్షిగారు విజయనగరంలో పుట్టారు. మెట్రిక్ వరకే చదువుకున్నా సమాజాన్ని బాగా చదివారు. ఈవిడ మొత్తం 13 నవలలు, 2 కథా సంకలనాలు రాశారు. దాదాపు 200కి పైగా పుస్తక సమీక్షలు చేశారు. ఈమె నవలలు, కథలు కన్నడ, హిందీ తదితర భారతీయ భాషల్లోకి చాలా అనువాదం అయ్యాయి. ద్వివేదులగారి కలం నుండి జాలువారిన కొన్ని అద్భుతమైన కథలు మీ ముందుకు. తప్పక చదవండి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48194418966784,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/dwivedulavisalakshikathalu.jpg?v=1774348820"},{"product_id":"kovvothi-by-dwivedula-visalakshi","title":"Kovvothi","description":"\u003cp\u003eKovvothi by \u003cspan\u003eDwivedula Visalakshi \u003c\/span\u003eకొవ్వొత్తి\u003c\/p\u003e\n\u003cp\u003eసగంకాలిన కొవ్వొత్తి నుంచి కొవ్వు కారి టేబిలుమీద పడ్తుంది. గాలికి జ్యోతి కదులుతున్నప్పుడల్లా ఆ వెలుగునీడలు గదిగోడలపై నాట్యం చేస్తున్నాయి. తన చుట్టూ ఉన్న వస్తువులకి ప్రకాశం ఇస్తూ, తానుకాలిపోతుంది కొవ్వొత్తి. కొవ్వొత్తి ఆత్మార్పణతో పరిసరాలు వెలుగు సముపార్జించుకొంటున్నాయి. కాని తన్ను తాను కరిగించుకొంటూ ఇతరులకు వెలుగు పంచిపెడ్తున్న కొవ్వొత్తి చుట్టూ మిగిలింది చీకటి మాత్రమే. చిన్ననాటి నుంచి తనకోసం కాక, ఇతరుల కోసమే బ్రతకడం నేర్చుకొన్న లలిత... స్త్రీ సహజమైన ఒకే ఒక చిన్న కోరిక తీర్చుకోలేని లలిత... ఎదురుగా కాలుతున్న కొవ్వొత్తికి, పక్కమంచం మీద నివ్చలంగా నిద్రపోతున్న లలితకి ఏదో పోలిక ఉన్నట్లు అనిపించింది ప్రకాశానికి. ప్రపంచంలో కొందరు మనుషులు తమకోసమే తాము బ్రతుకుతారు, తమ మనుగడకోసమే ఇతరుల్ని బ్రతకనిస్తారు. మరికొంత మంది ఇతరుల కోసమే తాము బ్రతుకుతారు. వారి బ్రతుకుల సాఫల్యంతోనే తమ జీవితాలు నింపుకొంటారు. గడియారం పదకొండు గంటలు కొట్టింది. కొవ్వొత్తి ఇంకా వెలుగుతూనే ఉంది. ప్రకాశించే శక్తి తనలో మిగిలి ఉన్నంతవరకు అది చాలా తన్ను తాను కరగించుకొంటూ వెలుగుతూనే ఉంటుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48194435809536,"sku":null,"price":55.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/kovvothidwivedulavisalakshi.jpg?v=1774349826"},{"product_id":"marina-viluvalu-by-dwivedula-visalakshi","title":"Marina Viluvalu Dwivedula Visalakshi","description":"\u003cp\u003eMarina Viluvalu by మారినవిలువలు \u003c\/p\u003e\n\u003cp\u003eవీధి లోంచి ఒక్క పరుగున వచ్చిన అక్కను కౌగిలించుకుంది శాంత. చేతిలో పుస్తకాన్ని పక్కనపెట్టి ‘‘ఏమిటే శాంతా ఈ హడావిడి?’’ అని ప్రశ్నించింది జానకి. శాంత నవ్వుతూ న్యూస్పేపర్ని అక్క కళ్ళ ముందు ఆడించింది. ‘‘ఓ! ఇదా సంగతి! అమ్మాయిగారి రిజల్టస్ వచ్చాయన్నమాట! ఏదీ చూడనీ’’ అంటూ పేపరు పేజీలు తిరగేస్తూ ‘‘అమ్మా! అమ్మా! శాంత రిజల్టస్ వచ్చాయ్’’ అని కేకేసింది. పొయ్యి కింద మంట కిందికి లాగి ఆత్రంగా వరండాలోకి వచ్చింది సుందరమ్మ. ఆడపిల్ల. దాని పరీక్ష మాటకేంగాని ప్రకాశంది ఏమయింది? ఈ ఏడైనా గట్టెక్కాడా? అని ఆత్రంగా ప్రశ్నించింది సుందరమ్మ. ఎంతసేపు కొడుకుల చదువులు, వాళ్ళ మంచి చెడ్డలే కాని కూతుళ్ల సంగతి అక్కర్లేదా? ఎందుకీ వివక్ష? తప్పక చదవండి ‘మారిన విలువలు’.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48194442363136,"sku":null,"price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/marinaviluvalu_dwivedulavisalakshi.jpg?v=1774350273"},{"product_id":"pariharam-dwivedula-visalakshi","title":"Pariharam Dwivedula Visalakshi","description":"\u003cp\u003ePariharam by \u003cspan\u003eDwivedula Visalakshi \u003c\/span\u003eపరిహారం\u003c\/p\u003e\n\u003cp\u003eబయట ఈదురుగలి, వర్షం. నవంబరు నెల ఇంకా అప్పుడే ప్రవేశించినా 3 రోజులుగా మొదలైన తుఫాను గాలుల మూలంగా బాగా చలిగా వుంది. కేంటీన్లో వున్న టేబుల్ ముందు కూర్చుని వున్నారు ఒక జంట. ఆ అమ్మాయి నవ వధువులా వుంది. పుట్టింటి నుండి అత్తారింటికో, అత్తారింటి నుండి పుట్టింటికో ప్రయాణం చేస్తున్నట్టు వుంది. లేత నీలం రంగు కాశ్మీర్ సిల్క్ చీర కట్టుకుంది. జడలో పువ్వుల దండ తురుముకుంది. టేబుల్ కింద నుండి ఆమె కాలుకి తన కాలు తాకిస్తూ గిలిగింతలు పెడుతున్నాడు ఆ యువకుడు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని ఆప్యాయంగా ఒత్తుతున్నాడు. బెదిరే కళ్ళతో ఆ పిల్ల అటూ ఇటూ చూస్తోంది. భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధం, సాన్నిహిత్యంలో వుండే సరసం అందరికీ తెలిసిందే. కానీ అది చూపుకోడానికి ముఖ్యంగా మన దేశంలో, మన సంస్క•తిలో కొన్ని వేళలు, హద్దులు, స్థలాలు కేటాయించి వదిలిపెట్టారు మన పెద్దలు. ఆ భయంతోటే ఆ పిల్ల అతన్ని మృదువుగా వారిస్తోంది. ఆ సమయంలో వారిద్దరి మనసుల్లో తిరుగాడే కోరిక అద్దంలో బొమ్మంత స్పష్టంగా వారి కళ్ళలో దోగాడుతోంది. ద్వివేదుల విశాలాక్షిగారి మరో అద్భుత రస సృష్టి ‘పరిహారం’. తప్పక చదవండి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48194443936000,"sku":null,"price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/pariharamdwivedulavisalakshi.jpg?v=1774350419"},{"product_id":"repati-velugu-dwivedula-visalakshi","title":"Repati Velugu Dwivedula Visalakshi","description":"\u003cp\u003eRepati Velugu by  \u003cspan\u003eDwivedula Visalakshi \u003c\/span\u003eరేపటివెలుగు\u003c\/p\u003e\n\u003cp\u003e‘‘ఇలా ఇదంతా రాసి నిన్నేదో ఒత్తిడి చేస్తున్నానుకోకు. నువ్వు ఇతరుల ఒత్తిడికి, అధికారానికి తల ఒగ్గేదానివి కావన్న సంగతి నాకు తెలుసు. అందుకే నువ్వంటే నాకింత గౌరవం, ఇష్టం, ఆరాధన... ‘‘ఆరోజు అరగని భోజనం అన్నావు. బహుశా అనిల్ని మనసులో పెట్టుకొని ఆ మాట అని ఉంటావు. అనిల్కి ప్రేమించే హృదయం ఉంది. కాని, ఆ ప్రేమని నిలుపుకొనే శక్తిలేకపోయింది. అతడు ఇమోషనల్ క్రీచర్. నేను కార్యవాదిని. నా ఆరోగ్యం దివ్యంగా ఉంది. నేను ఏది తిన్నా అరిగించుకోగలను. ‘‘నా గురించి నేను నీతో చెప్పుకోవడం ఏమిటి? శారూ. నన్ను నన్నుగా ఇంత పిల్లడి నుంచి ఎరిగి ఉన్న నీతో నా గురించి నేనేం చెప్పుకోను? నా మనసంతా నిండి ఉన్న నీ గురించి ఏం అడిగి తెలుసుకోను? \u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48194447671552,"sku":null,"price":55.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/repativelugudwivedulavisalakshi.jpg?v=1774350669"},{"product_id":"varadhi-by-dwivedula-visalakshi","title":"Varadhi Dwivedula Visalakshi","description":"\u003cp\u003eVaradhi by \u003cspan\u003eDwivedula Visalakshi \u003c\/span\u003eవారధి\u003c\/p\u003e\n\u003cp\u003eరెండు రోడ్లని కలుపుతున్న వంతెన ఇంక చూస్తున్నాడు వరదరాజు. అటు తను పుట్టి పెరిగిన పల్లెటూరు. ఇటు తనను మనిషిగా మలిచిన పట్నవాసం - తను తను దేనికి చెందుతాడు? తను శివయ్య తమ్ముడా? రాఘవయ్య అల్లుడా? తన విధేయత ఎవరిపట్ల ఉండాలి? తను జీవితంలో దేనికి హెచ్చు ప్రాధాన్యం ఇవ్వాలి? రక్తసంబంధానికా? జీవిత పురోభివృద్ధికా?\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48194449703168,"sku":null,"price":55.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/varadhi_dwivedulavisalakshi.jpg?v=1774350934"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/collections\/images_31091f2c-d3a4-4d97-9ad4-7c1283ce4ef0.jpg?v=1785235071","url":"https:\/\/www.sahithibooks.com\/collections\/dwivedula-visalakshi.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}