{"title":"Dhanikonda Hanumantha Rao","description":null,"products":[{"product_id":"animuthyalu","title":"Dhanikonda's Animuthyalu","description":"\u003cp\u003eAnimuthyalu by Dhanikonda hanumantha rao\u003c\/p\u003e\n\u003cp\u003eఅర్థరాత్రి దాటుతున్నా లావాలా కుతకుతలాడుతూ నిద్రపట్టనీయని తన పూనర్వివాహపు ఆలోచనలతో సతమతమవుతున్న సీతారామయ్య లేచి చల్లగాలిలో దొడ్లోకి నడిచి పైన మిణుకుమిణుకుమంటున్న నక్షత్రాలవంక చూస్తూ నిలబడ్డాడు. ‘‘ఆ నక్షత్రాలెంత ఆకర్షణీయంగా ఉన్నా ఎంత ఎగిరినా చేతికి అందవు. అలాగే తనూ తన పిల్లలకి సేవచేసే తల్లీ, తన అవసరాలు తీర్చే కొత్త భార్య అనే అందని ద్రాక్ష కోసం అర్రులు చాస్తున్నాడా? తన శ్రేయోభిలాషిగా సుశీల సంబంధం గురించి సోమయాజులు చెప్పడంలో అతని తప్పేమీ లేదు. కానీ కూతురు పెళ్ళి చేయలేని అవధానిగారి దరిద్రాన్ని అవకాశంగా తీసుకుని ఇరవయ్యేళ్ళ కన్నె సుశీలని స్వంతం చేసుకుని తన అవసరాలు తీర్చుకోవాలనుకోవడం ధర్మమేనా, సమంజసమేనా? అది అవకాశవాదం కాదా? సుశీల తన పెద్దకూతురుకన్నా కేవలం ఎనిమిదేళ్ళే పెద్ద. అటువంటి సుశీల తన పిల్లల్ని కన్నతల్లిలా చూడాలనుకోవడం అత్యాశకాదా? అది సాధ్యమా? సుశీలా తనూ ఈడూ జోడూ ఎలా అవుతారు? ఆమెకు తను తగిన భర్త కాగలడా?\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663855698176,"sku":"1G-RLDH-OTDT","price":160.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/88997f1d.jpg?v=1770616421"},{"product_id":"american-jeevitham","title":"American Jeevitham","description":"\u003cp\u003eAmerican Jeevitham by Dhanikonda hanumantha rao\u003c\/p\u003e\n\u003cp\u003eయునైటెడ్ స్టేట్స్లో అమెరికన్ దంపతులకు పుట్టిన బిడ్డను, పసితనంలోనే ఫ్రాన్స్కు తీసుకొనివెళ్ళి ఫ్రెంచి కుటుంబంలో పెంచినట్లయితే - సాంకేతికంగా జాతీయ ఏమైనప్పటికీ - ఫ్రెంచి వారివలెనే ఆ బిడ్డ పెరుగుతాడు. అదేవిధంగా చైనీయుడు చిన్నతనంనుంచీ అమెరికన్ కుటుంబంలో పెంచబడినట్లయితే - అతడు వేషభాషల్లోనూ, ఊహల్లోనూ, ప్రవర్తనలోనూ అమెరికన్ వలెనే సంచరిస్తాడు; అతని ముఖంలో కనిపించే భావాలూ, ఇతర చిహ్నాలూ అతను పెరిగిన కుటుంబీకులను పోలి ఉంటూ - అతను పెరిగిన వాతావరణం, ఆహార విశేషాలూ మొదలైనవి తెగవాగిస్తూండడంలో - అతను అమెరికన్ వలెనే కనిపిస్తాడు; శరీరచ్ఛాయ, మంగోలియన్ వొంపులూ మొదలైనవి అతని కన్న తల్లిదండ్రుల పోలికల్లో ఉన్నా, అతని ధోరణీ, అలవాట్లూ, ఆచార వ్యవహారాలూ మొదలైనవి పెంచిన కుటుంబలోనుంచే వొస్తవి. అమెరికన్ సంస్క•తిని విశదీకరించటం చాలా కష్టం. ఎందుకంటే దానివేళ్లు ఎంతెంతో దూరాలనుంచి వొచ్చినవి; మూలాలకు లెక్కలేదు; సంస్క•తి పెరిగేందుకు సహాపడినవి అనేకం ఉన్నవి. దీన్ని సమన్వయమంటూ ఉన్న నాటకం అనటం కన్న, వివిధ వినోదాలతో కూడినదనటం సమంజసం. దీన్నంతను యీ విధంగా చూసేందుకు మనం ఇష్టపడతాం - అన్నిటిలోనుంచి చిన్న చిన్న భాగాలు శక్తివంతంగానూ, ప్రతిభావంతంగానూ కలుసుకొనిపొయ్యేట్లుగా విసిరివేయబడి, పరిపూర్ణమైన రూపాన్ని దాల్చింది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663860351232,"sku":"5H-9ET8-FWHM","price":160.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/752eb28c.jpg?v=1770616433"},{"product_id":"maguva-manasu","title":"Maguva Manasu","description":"\u003cp\u003e Maguva Manasu by Dhanikonda hanumantha rao\u003c\/p\u003e\n\u003cp\u003eఇంతవరకూ నాకు తెలీని విషయం - ఆమె నాకు అవబొయ్యే ధర్మపత్నా? ముక్కూ మొగమూ ఎరగని మమ్మల్ని దంపతులుగా తయారుచేస్తే, ముందున్న సంసార సాగరాన్ని యిద్దరమూ అన్యోన్యంగా ఈద వద్దా? నా అంగీకారమే అనవసరమనుకొన్నాడే నాన్న - ఆమెతో కాపరం చెయ్యవలసిన బాధ్యత నాక్కాదా? ఒకళ్ళ అభిప్రాయాల్తో ఒకళ్ళవి వీగిపోతూ, ఒకళ్ళను మరొకళ్ళు అర్థంచేసుకోలేక, అయోమయ జీవితానికి గురవుతే ఎవరి తప్పవుతుంది? తీరా దంపతులుగా అతుకుపడ్డ తరువాత - నీడలాగు అంటిపెట్టుకొని వుండే భార్యను వదలించుకోవటం చేతకాక, తప్పనిసరిగా వ్యక్తిత్వాన్నే మరిచిపోయి, కాపరం చెయ్యవలసి ఉంటుందేమో? అప్పుడు పశ్చాత్తాపపడి ఏం ప్రయోజనం? పెళ్ళి చేసుకొన్నాక బాధపడటంకన్నా, చేసుకోకుండానే ఉండటం మంచిదేమో? ఆమె యిష్టాయిష్టాల్తో కూడా పనిలేదా? ఒకే వస్తువు వివిధ వ్యక్తులకు వివిధ విధాలుగా కన్పించటమూ, భేదాభిప్రాయాల్ని యివ్వటమూ ఈనాటికీ కొత్తకాదుగా!\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663868608768,"sku":"CY-NCVB-3Z4E","price":140.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/837d9d8a.jpg?v=1770616449"},{"product_id":"priyuralu","title":"Priyuralu","description":"\u003cp\u003e Priyuralu another 32 Stories by Dhanikonda hanumantha rao\u003c\/p\u003e\n\u003cp\u003eఉన్నవి - రెండు వాక్యాలే అయినా ఆ ప్రేమలేఖ ఎంత బాగుందీ! ప్రేమలేఖల పేరిటా, స్నేహలేఖల పేరిటా దిగుమతయ్యే మన సాహిత్యంలోని చెత్తంతా చదివినా యీ బుల్లి లేఖను చదివినంతగా ఆనందించలేను! ఎంత ధైర్యం చేసింది. ‘రొమాన్సు’ ఇంత తేలిగ్గా దొరుకుతూంటే జీవితంలో ఎంత మాధుర్యం ఏర్పడుతుంది! పురుషుణ్ని - పర స్త్రీని తేరిపార చూసేందుకే నాకు కాళ్లు వొణుకుతయ్! కాని ఆమె ‘సాహసం;’ స్త్రీ మూర్తిలో ప్రతిఫలించిన గుణాల్లో ఒకటేమో? ఇంత సులభంగా ఆమె నాదైపోతుందని కలకన్నానా? నన్ను నేనే నమ్మేందుకు కూడా వీలులేనంత పని జరిగింది! ఇంత అందమైన స్త్రీ తనంతట తను ఎదుట మోకరిస్తే ఏ పురుషుడికి గర్వంగా ఉండదు?\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663872901376,"sku":"GX-UWJY-2MYS","price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/a3b3a39c.jpg?v=1770616457"},{"product_id":"dhutika-vijayam","title":"Dhutika Vijayam","description":"\u003cp\u003eDhutika Vijayam by Dhanikonda hanumantha rao\u003c\/p\u003e\n\u003cp\u003eమాధవీదేవి చప్పున తల కుడివైపుకు తిప్పి పట్టమహిషి వేదిక వైపు దృష్టి సారించింది. ఆమెతో పాటే సరస్వతి చూపులు కూడా అటు తిరిగినవి. పట్టమహిషి తీక్షణ వీక్షనాలను ఉభయులూ గమనించారు. సరస్వతి తన రాణి భావం గ్రహించే నిమిత్తం మాధవీదేవి ముఖంలోకి చూసి ఆశ్చర్యపడింది. తాను ఇరవై ఏళ్ళుగా ఎరిగిన మాధవీదేవి కాదీమె. ఈనాటి ఆమె ప్రవర్తన సరస్వతికి ఎంత ఆలోచించినా అంతుబట్టటం లేదు. రాణి తాను బైటపడకుండా గొప్ప నటనను ప్రదర్శిస్తోందనే సంగతి సరస్వతికి తెలుసు. నిన్న సాయంత్రం వరకూ మామూలుగా ఉన్న రాణిలో ఇంత గొప్ప మార్పు ఒక్క రాత్రిలో ఎలా వచ్చి పడిందో సరస్వతి ఊహకు అందటంలేదు. ఏదో గొప్ప విషమ సమస్య మనసును పీడించి, పిండివేసేదే ఆమెను బాధపెడుతూండి ఉండాలి. తన ఆందోళన బహిర్గతం కాకుండా రాణి ఎంత చాకచక్యంతో సమర్థించగలదో చూడాలి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663875326208,"sku":"IO-S4VR-X195","price":140.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/9e7f7689.jpg?v=1770616461"},{"product_id":"mopasa-kathalu","title":"Mopasa Kathalu","description":"\u003cp\u003eMopasa Kathalu BY Dhanikonda hanumantha rao\u003c\/p\u003e\n\u003cp\u003eచిన్న పిల్లవాడిలాగు వెక్కి వెక్కి ఏడుస్తూ, సున్నితంగా ఆమెను తన చేతుల్లోకి తీసుకొని, తేలిగ్గా ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. యీ రకం ప్రేమను అతను జీవితంలో ఇంతకు ముందెప్పుడూ ప్రకటించి ఉండలేదు. దుఃఖంవల్ల పూడుకుపోయిన గొంతుతో అతను గొణిగాడు: ‘‘... నీకేమీ ఫరవాలేదు. మృత్యువుకు భయపడవొద్దు, క్రమంగా ఆరోగ్యం కలుగుతుంది. అప్పుడు మనమిద్దరమూ జీవితాంతంవరకూ ప్రేమించుకోవచ్చు - జీవితాంతం వరకూ!’’ బలహీనంగా నవ్వుతూ ఆమె అంది : ‘‘ఇదంతా నిజమేనా? నువ్వు నన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నావన్నమాట?’’ ఆమె దురదృష్టతకు జాలిగా అతను ఆ సమయంలో ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఆమె ఆరోగ్యవంతురాలయ్యాక తన ప్రేమను నిరూపించి తీరుతానని నమ్మకం కలిగించాడు. ప్రేమవల్ల కలిగే జాలితో - ఆమెను అనేకసార్లు ముద్దుపెట్టుకున్నాడు. ఉష్ణతాపంవల్ల ఎగిరెగిరిపడే ఆమె హృదయానికి ఎంతో ఆనందాన్ని చేకూర్చాడు. మరునాడు అతను తిరిగి వొచ్చేశాడు.. ఆమెకు మాత్రం యీ ప్రణయం దివ్యౌషధంగా పనిచేసింది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663876014336,"sku":"JA-HGDT-XSWH","price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/8d2970d9.jpg?v=1770616465"},{"product_id":"erra-buttalu","title":"Erra Buttalu","description":"\u003cp\u003eErra Buttalu by Dhanikonda hanumantha rao\u003c\/p\u003e\n\u003cp\u003eహనుమంతరావు రాసిన నాటికల్లో చివర చెప్పదగినది ‘ఎర్రబుట్టలు’. రాఘవయ్య ఇంటికి ఒక దొంగ మంత్రశక్తి గల స్వాములవారి వేషం వేసుకుని వచ్చి, ధనాన్ని నగలను ప్రోగు చేసుకుని, అతని తాలూకు మనుషుల్ని పోలీసులుగా రప్పించి, తనను అరెస్టు చేసి తీసుకుపోతున్నట్లు నటించి అంతా దోచుకుపోతారు. అది తెలుసుకొని తన ఇంట్లో యూనిఫాం దొంగలించబడిందనీ, దాన్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన నిజమైన సర్కిల్ ఇన్స్పెక్టర్ని దొంగ అని పట్టుకొని బంధిస్తారు రాఘవయ్య మనుషులు. మున్సబు వచ్చి సర్కిల్ని గుర్తించి విడిపిస్తాడు... పోలీసు వేషాల్తో సాగే మోసాలను నవ్వు పుట్టించే విధంగా రాసిన నాటిక ఇది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663876604160,"sku":"JX-MUAU-AKMH","price":160.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/1325de46.jpg?v=1770616465"},{"product_id":"dhanikonda-ix-kleyopatra","title":"Kleyopatra","description":"\u003cp\u003eDhanikonda-IX Kleyopatra by dhanikonda hanumantharao\u003c\/p\u003e\n\u003cp\u003eఆమె జగత్ప్రసిద్ధి చెందిన ఈజిప్ట్ యువరాణి క్లియోపాత్రా. ప్రపంచానికి ఆమె ‘‘జగదేక సుందరి’’. ఏంటనీకి ప్రియురాలు. సీజర్కు కూడా ఆమె ప్రేయసే. ప్రపంచాధిపత్యం కోసం అర్రులుచాచి చివరకు రోమన్లచే తరమబడి మిన్నాగు కాటుచే తనకు తానే మరణం కొనితెచ్చుకుని ఈజిప్ట్ మహారాణిగా సకల మర్యాదలతోనూ క్లియోపాత్రా పిరమిడ్లో సమాధి చేయబడింది. ఏంటనీ, క్లియోపాత్రాల ప్రణయ జీవితం ఆచంద్ర తారార్కం నిలవగలదు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663877259520,"sku":"KJ-CMYH-2BFD","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/5f48cee1.jpg?v=1770616464"},{"product_id":"havelock-ellis","title":"Havelock Ellis","description":"\u003cp\u003eHavelock Ellis by Dhanikonda Hanumantha Rao\u003c\/p\u003e\n\u003cp\u003eమనలో చాలామందికి వేరొక దురభిప్రాయం వుంది. ఒకే వ్యక్తి ఒకే సమయంలో ఒకే విధంగా ఇద్దరు వ్యక్తుల్ని ప్రేమించగలడా? ప్రస్తుత నాగరికతలో ఇలాటిది చాలా సులభసాధ్యంగానే కనిపిస్తుంది; ఇది స్త్రీలకూ, పురుషులకూ కూడా సంబంధించిన విషయంగా బ్లోచ్ నిశ్చయించాడు. హిర్త్ అనే ఆయన ‘‘స్త్రీ కానీ, పురుషుడు కానీ ఒకే సమయంలో ఒకేవిధంగా ఇద్దరు వ్యక్తుల్ని ప్రేమించగలరనే అభిప్రాయాన్ని సమర్థించాడు. పురుషుడు తన అహంభావంవల్ల స్త్రీ తనను తప్ప వేరొక వ్యక్తిని ప్రేమించలేదనే గుడ్డినమ్మకాన్ని విశేషంగా ప్రచారం చేశాడు. ఆ స్త్రీ రెండో వ్యక్తినికూడా అదే సమయంలో ప్రేమించటాన్ని పురుషుడు వ్యభిచారంగా గుర్తించి, సామాజికంగా స్త్రీ పతనమైందనే ధోరణిని కనబరిచాడు. నవలాకారులేమి, కవులేమి, చివరకు వైద్యులు, మనస్తత్వవేత్తలు కూడా స్త్రీ ఒకసారి ఒకే పురుషుణ్ణి ప్రేమిస్తుందనే అభిప్రాయాన్ని ఆమోదించారు. వారి దృష్టిలో స్త్రీ ఒక ఆస్తిలాంటిది; ఆ ఆస్తికి హక్కుదారుడు ఒకడే వుండాలి. అలాలేని పక్షంలో ఆ స్త్రీ సామాజికంగా  తన విలువను పోగొట్టుకుంటుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663878504704,"sku":"LT-OIPF-PFKS","price":280.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/b1ad530d.jpg?v=1770616471"},{"product_id":"10mandi-american-aadhunikulu","title":"10 mandi American Aadhunikulu","description":"\u003cp\u003e10 mandi American Aadhunikulu by Dhanikonda hanumantha rao\u003c\/p\u003e\n\u003cp\u003e1) వాల్ట్ డిస్నీ, 2) జె.ఎడ్గార్ హూవర్, 3) హెన్రీ ఆగార్డ్ వాలెస్, 4) జార్జ్ వాషింగ్టన్ కార్వర్, 5) యెహుదీ మేనూయిన్, 6) మేయోలు, 7) వాల్టర్ పెర్సీ క్రిజ్లర్, 8) విలియమ్ ఎల్లెన్ వైట్, 9) విల్ రోజర్స్, 10) ఆలివర్ వెండెల్ హోమ్స్. వీళ్ళ గురించి వివరంగా తెలుపబడింది ఈ పుస్తకంలో. తప్పక చదవండి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663878832384,"sku":"M5-8MWL-VTR3","price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/ce341ecc.jpg?v=1770616471"},{"product_id":"anthima-poratam","title":"Anthima Poratam","description":"\u003cp\u003eAnthima Poratam BY Dhanikonda HANUMANTHA RAO\u003c\/p\u003e\n\u003cp\u003eఅమెరికాలో వలస రాజ్యాల స్థాపనలో వివిధ పాశ్చాత్య దేశాలవారు మొదట్లో పడ్డ అగచాట్లను విపులంగా అభివర్ణించిన నవల ఇది. మానవుడిలోని సద్గుణాలను ఒక త్రాసులోనూ, దుర్గుణాలను మరొకదాన్లోనూ వేసినప్పుడు, త్రాసు ఎటు మొగ్గుతుందో తూచి, మానవ నైజాన్ని వివిధ దృక్కోణాలనుంచి తెలియజెప్పిన నవలారాజం ఇది. సూర్యరశ్మి జొరబడని మహారణ్యాలలో, క్రూరత్వమే లక్ష్యంగా పెట్టుకొన్న శత్రువులను తప్పించుకొంటూ ప్రయాణం చేయవలసివస్తే, ఎన్ని కష్టనష్టాలను ఎదుర్కోవలసి ఉంటుందో ఊహించవలసిందే! ఇక సాహసం ఒక్కటేగాక, మనోధైర్యం, ఊహించవలసిందే! ఇక సాహసం ఒక్కటేగాక, మనోధైర్యం, అవసరమైతే తన ప్రాణాలను సైతం బలిపెట్టేందుకు సిద్ధపడిన మిత్రుల సహకారం, విధివిలాసాలు మాత్రమే ఆ నిర్భాగ్యులకు తోడునీడలైన తీరుతెన్నులను దీన్లో అభివర్ణించటం జరిగింది. మానవత్వపు చిత్ర విచిత్రానుభూతులన్నీ కుదించబడిన నవరసభరితమైనదీ ‘అంతిమ పోరాటం’.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663879684352,"sku":"MW-7PJ5-FJX1","price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/ccd1d2c9.jpg?v=1770616473"},{"product_id":"desodharakudu","title":"Desodharakudu","description":"\u003cp\u003eDesodharakudu another 31 Stories BY DhanikondA HANUMANTHA RAO\u003c\/p\u003e\n\u003cp\u003eపురుషుల్ని పాపాలకు పురికొల్పటం కోసమే స్త్రీలు జన్మించారనే మూఢ నమ్మకంతో రాజకీయ తపస్సు సాగించి, అందులో తన దేశోద్ధారణ మహా యజ్ఞానికి అమాయకురాలిని యజ్ఞ పశువుగా బలిగొన్న పుణ్యాత్ముడి జీవిత గాథ.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663880470784,"sku":"NL-JPPJ-4FMC","price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/58ca9356.jpg?v=1770616472"},{"product_id":"loka-charitra","title":"Loka Charitra","description":"\u003cp\u003e Loka Charitra by Dhanikonda hanumantha rao\u003c\/p\u003e\n\u003cp\u003eఇంతవరకూ నాకు తెలీని విషయం - ఆమె నాకు అవబొయ్యే ధర్మపత్నా? ముక్కూ మొగమూ ఎరగని మమ్మల్ని దంపతులుగా తయారుచేస్తే, ముందున్న సంసార సాగరాన్ని యిద్దరమూ అన్యోన్యంగా ఈద వద్దా? నా అంగీకారమే అనవసరమనుకొన్నాడే నాన్న - ఆమెతో కాపరం చెయ్యవలసిన బాధ్యత నాక్కాదా? ఒకళ్ళ అభిప్రాయాల్తో ఒకళ్ళవి వీగిపోతూ, ఒకళ్ళను మరొకళ్ళు అర్థంచేసుకోలేక, అయోమయ జీవితానికి గురవుతే ఎవరి తప్పవుతుంది? తీరా దంపతులుగా అతుకుపడ్డ తరువాత - నీడలాగు అంటిపెట్టుకొని వుండే భార్యను వదలించుకోవటం చేతకాక, తప్పనిసరిగా వ్యక్తిత్వాన్నే మరిచిపోయి, కాపరం చెయ్యవలసి ఉంటుందేమో? అప్పుడు పశ్చాత్తాపపడి ఏం ప్రయోజనం? పెళ్ళి చేసుకొన్నాక బాధపడటంకన్నా, చేసుకోకుండానే ఉండటం మంచిదేమో? ఆమె యిష్టాయిష్టాల్తో కూడా పనిలేదా? ఒకే వస్తువు వివిధ వ్యక్తులకు వివిధ విధాలుగా కన్పించటమూ, భేదాభిప్రాయాల్ని యివ్వటమూ ఈనాటికీ కొత్తకాదుగా!\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663885189376,"sku":"RT-2EM8-D82K","price":160.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/fe445f6f.jpg?v=1770616487"},{"product_id":"abhisarika-oka-vihanga-veekshanam","title":"Abhisarika - Oka Vihanga Veekshanam","description":"\u003cp\u003eAbhisarika - Oka Vihanga Veekshanam by Dhanikonda hanumanth rao\u003c\/p\u003e\n\u003cp\u003eఉన్నత వంశంలో పుట్టి నీతి నియమాల మధ్య పెరిగిన ఆ యిద్దరు యువతీ యువకులు నీతిపథం నుంచి దిగజారినందుకు కుమిలి కుమిలి బాధపడ్డారు. ఆమె దీనంగా - తన పవిత్రతనంతా కోల్పోయినట్లు బాధపడుతూ - తన గదిలోకి వెళ్ళిపోయింది. తప్పక చదవండి. ధనికొండ హనుమంతరావుగారి ‘అభిసారిక’.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663889088768,"sku":"V5-JXM8-ALZK","price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/a95aa649.jpg?v=1770616493"},{"product_id":"vatsayana-kamasutralu","title":"Vatsayana Kamasutralu","description":"\u003cp\u003eVatsayana Kamasutralu by Dhanikonda hanumantha rao\u003c\/p\u003e\n\u003cp\u003eధర్మ-అర్థ-కామ-మోక్షములు అనబడే నాలుగు పురుషార్ధాలలో మూడవదయిన ‘కామం’ భారతీయ సమాజంలో బాహాటంగా మాట్లాడకూడని అంశంగా ముద్ర పడింది. అయితే దాంపత్య జీవితంలో కామానికి కీలకమైన పాత్ర వుందని నమ్మి, ఈ అంశంపై సమగ్రమైన ఒక శాస్త్రాన్నే రచించిన వారిలో వాత్స్యాయన మహర్షి ప్రముఖుడు. ఈయన క్రీస్తుపూర్వం వాడని కొంతమంది, క్రీస్తు శక ఆరంభంలో జన్మించిన వాడని కొంతమంది వాదిస్తుంటారు. ఎలా తీసుకున్నా, ‘వాత్స్యాయన కామ సూత్రాలు’ దాదాపు 2000 సంవత్సరాల క్రితం సంస్క•తంలో రచించబడిన గ్రంథం. ఈ రచనకు ఆధారమైన కామశాస్త్రం అనేది ఈశ్వరుణ్ణి అంటిపెట్టుకుని వుండే నందీశ్వరుడి నుండి లభించిందని ఈ గ్రంథం పేర్కొంటోంది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663889449216,"sku":"VI-SNNZ-E6F5","price":320.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Vatsayana_Kamasutralu.jpg?v=1775455661"},{"product_id":"gallarumaalu","title":"Gallarumaalu","description":"\u003cp\u003eGallarumaalu another 30 Stories by Dhanikonda hanumantha rao\u003c\/p\u003e\n\u003cp\u003eసాంబమూర్తి ‘‘రేవతీ! ఒక్కమాట’’ అని అరిచాడు. రేవతి డ్రైవింగ్ సీటు పక్కకు వచ్చింది. ‘‘ఇదిగో నీ గళ్ళ రుమాలు...’’ అని సాంబమూర్తి రుమాలు అందించాడు. ‘‘నా జ్ఞాపకార్థం మీ దగ్గిరే ఉంచుకోండి. ఒక సంసారాన్ని కాపాడిన విషయం మీ కీ రుమాలు జ్ఞాపకం చేస్తూ వుంటుంది’’ అన్నది రేవతి. ‘‘థాంక్స్...’’ అని సాంబమూర్తి కారు పోనిచ్చాడు. జానకి రానందుకు వికలమైన మనస్సు యిప్పుడు వికసించిన తామర పువ్వల్లే స్వచ్ఛంగా, పరమ పవిత్రంగా వున్నది. తాను జీవితంలో చేసిన ఘనకార్యానికి బహూకరణగా వచ్చిన గళ్ళ సిల్కు రుమాలు అంతులేని ఆనందాన్నిస్తోంది. రణరంగంలో రొమ్మిచ్చి పోరాడినందుకు ఇవ్వబడే విక్టోరియా క్రాస్ లిటి దీ రుమాలు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663891120384,"sku":"X2-GILB-MDF3","price":160.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/de6188c6.jpg?v=1770616497"},{"product_id":"abisarika-sampadhakeeyalu","title":"Abisarika Sampadhakeeyalu","description":"\u003cp\u003eAbisarika Sampadhakeeyalu by Dhanikonda hanumantha rao\u003c\/p\u003e\n\u003cp\u003e‘అభిసారిక’ పేరు బాగుంది కానీ అసలు అర్థమేమిటి? అని రాసినవాళ్ళు చాలామంది వున్నారు. ‘అభిసారిక’ అంటే ప్రియుని గూర్చి సంకేతస్థలానికి పోయెడి నాయిక. ఐతే యీ పేరు యీ పత్రికకు ఎలా సరపిడుతుందనే సందేహం మీకు రావొచ్చు. ప్రియుడు, ప్రియురాలు అనేప్పటికి లైంగిక జీవితపు సంఘటనలు జ్ఞాపకానికి వొస్తవి. లైంగికజీవనానికీ అందువల్ల ఏర్పడే సాంఘిక జీవనానికీ చాలా దగ్గిరి సంబంధం వుంది. ప్రబంధాలు కేవల శృంగారకాండ మాత్రమే. లైంగిక జీవనం కాదు. దానికి శాస్త్రీయ దృక్పధం వుంది. ఎన్నో జీవితాలు నాశనమయేందుకూ, ఎన్నో జీవితాలు స్వర్గసౌఖ్యాన్ని అనుభవించేందుకూ లైంగిక జీవనం కారణభూతమని చెప్పవొచ్చు. ఇది ప్రియురాలి నుంచి ప్రియుడు నేర్చుకోనీండి, ప్రియునినుంచి ప్రియురాలు నేర్చుకోనీండి - ఇద్దరూ భాగస్వాములే! నిర్ణీత ప్రదేశం వలెనే, నిర్ణీతకాలంలో యీ ‘అభిసారిక’ లైంగికజీవన ప్రాధాన్యతను చర్చిస్తూ లైంగిక విజ్ఞానాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663893446912,"sku":"YL-ZBTD-13M3","price":70.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/e3708672.jpg?v=1770616503"},{"product_id":"athanu-aame-eeme","title":"Athanu Aame Eeme","description":"\u003cp\u003eAthanu Aame Eeme another 35 Stories BY Dhanikonda HANUMANTHA RAO\u003c\/p\u003e\n\u003cp\u003eముగ్గురూ మూడు రకాల మనుష్యులు. దరిద్రంతో చావలేక, సముద్రంలో పడి చావలేక ఛస్తూన్న వాడికి, అకస్మాత్తుగా ఒక సుందరి సౌందర్య ధనం, ధనం దొరుకుతుంది. సౌందర్య ధనాన్ని, ధనాన్ని కొల్లగొంటాడతను. ఆమె : అంతకన్నను! దరిద్రము ముసలితనమూ ముందున్నప్పుడూ, డబ్బున్న ముసలితనం చేత పుస్తె కట్టించుకుని, దరిద్రంతో కుములుతూన్న పడుచుదనంచే శారీరకానందాన్ని పొందజూచిన వగలాడి. ఈమె : భర్త ప్రయోజకుడైన ఆనందంతో అసలు వ్యవహారం తెలిసీ తెలియనట్లు నటించి, సమయం కనిపెట్టి ఖళేరావ్ అన్నది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663893774592,"sku":"YQ-O4B2-S8AQ","price":160.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/ba0a6c74.jpg?v=1770616503"},{"product_id":"charitarthudu-george-washington","title":"Charitarthudu (George Washington)","description":"\u003cp\u003e Charitarthudu George Washington BY Dhanikonda Hanmantha rao\u003c\/p\u003e\n\u003cp\u003eవాషింగ్టన్ బొడ్డులో బంగారంతో జన్మించలేదు; కేవలం బంగారుపూతతో మాత్రమే జన్మించారు. త్వరలోనే ఆయనకు పితృవియోగం సంభవించటంతో అదీ పోయింది. ఆ తరువాత ఆయన బంధుమిత్రులనుంచి దూరం చేయబడటం, అత్యంతాధికారంలో ఉన్న ఫెయిర్ ఫాక్స్ కుటుంబం నుండి విడిపోవడం కూడా జరిగినవి. పోతే ఆయన ఆశయాలు రూపురేఖలు దిద్దుకొని, మిలిటరీలో చేరటంతో ఎంతో ఎత్తుకు ఎగసినవి. కాని బ్రిటిష్ రెగ్యులర్స్లో ఆయనకు స్థానం లభించకపోవటంతో ఆయన దిగజారారు; ఆ తరువాత మంచి సంబంధం దొరికి వివాహం చేసుకున్నారు. వాషింగ్టన్ అభిరుచులు జమీందారుగారి అభిరుచుల్లో నాణ్యమైనవిగా ఉండేవి. ఆయన హాస్యాన్ని ఆస్వాదించగల సమర్థుడు. ఆయన అనుభూతులు అప్పుడప్పుడు ఎంతో లోతులకుపోయి, ఆయన కంటినుంచి నీరు తెప్పించేవి. ఆయన ధైర్యశాలి; ఐతే అడివిపిల్లి మాత్రం కాదు. ఆయనకు సరిహద్దు ప్రాంతం తెలుసు. అవసరమైన పరిస్థితుల్లో రక్షణదళంలో ఉండటంవల్ల, కలిగే లాభాలు ఆయన ఎరుగను. కాని, ఆయనమాత్రం డేవిడ్ క్రానెట్ కాదు. బ్రిటిష్వారి దృష్టిలో ఆయనొక తిరుగుబాటుదారుడు;\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663894659328,"sku":"ZL-L7G7-99OU","price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/bbea236a.jpg?v=1770616505"},{"product_id":"kleopatra","title":"Kleopatra","description":"\u003cp\u003eKleopatra by danikonda hanumantharao\u003c\/p\u003e\n\u003cp\u003eజగదేక సుందరి క్లియో పాత్ర గురించిన అద్భుత నవల.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663912452352,"sku":"T2-7Z78-BCOG","price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/79521780.jpg?v=1770616541"},{"product_id":"guddivadu","title":"Guddivadu","description":"\u003cp\u003eGuddivadu by Dhanikonda Hanumantha Rao\u003c\/p\u003e\n\u003cp\u003eఅంధత్వం! శాశ్వత అంధత్వం! పుట్టుకనుంచీ గుడ్డివాడైన వాడికి భేదం తెలియదుకాని, తానీ కళ్ళతో చూసిన అనేక ప్రకృతిసౌందర్య దృశ్యాలు - వినీలాకాశం, లయతో వొచ్చిపడే సముద్రపుటలలు, అందమైన పువ్వులు, ఆహ్లాదకరమైన ప్రకృతిశోభ సూర్యోదయ సూర్యాస్తమయాల రంగులు, ఇంద్ర ధనుస్సులోని ఛాయలు, చల్లని చందమామ, వింత వింత రంగుల మేఘాలు, మానవ నిర్మితాలైన భవనాలు, ప్రశాంతంగా పారే నదులకు అడ్డంగా కట్టిన ఆనకట్టలు, మహాసముద్రాన్ని కూడా దాటేందుకు నిర్మించిన నౌకలు - అబ్బ ఎన్నని! వీటన్నిటినీ చూస్తూనే తనుకూడా ఒక నిర్మాత ఐతే బాగుండునని, తన అభిరుచుల ప్రకారం నిర్మించి ఆనందించవొచ్చని తలిచి, నిజజీవితంలో అది కుదరక, ఎన్ని కలల్ని సృష్టించుకున్నాడు! చూపులకందని అనేక దృశ్యాలు మనోవీధిలో పరుగెత్త గలిగినవంటే, వాటి పునాదులన్నీ యథార్థజీవితంలోనే ఉన్నవి. జీవితంలోని యీ యథార్ధమే దూరమవటంతో ఆ కలలుకూడా కరిగిపోతవి. త నింకేమీ చూడలేడు. ‘ఆహా! ఎంతబాగుంది!’ అని ఎవరైనా అనటం వింటే, అది నిజంగా ఎంత బాగుందో తెలియక, ఊహసాగక కొట్టుమిట్టాడుతాడు. ఏమైతేనేం గడిచిన తన పాతికేళ్ళ వయస్సూ యథార్థంగానూ, బతకాల్సిన ఆ భావిజీవితం, అది ఎంత తక్కువదైనాసరే, అది ఒక భ్రమగానూ, మిథ్యగానూ పరిణమిస్తుందేమో?\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48084910702848,"sku":null,"price":160.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/71aWnRAONnL._SY425.jpg?v=1772085035"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/collections\/images_d67a6e1a-8121-4e60-87f4-390e381cdeb7.jpg?v=1785234923","url":"https:\/\/www.sahithibooks.com\/collections\/dhanikonda-hanumantha-rao.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}