{"title":"Bhuvanachandra","description":null,"products":[{"product_id":"manasu-porallo","title":"Manasu Porallo","description":"\u003cp\u003eManasu Porallo మనసు పోరల్లో BY \u003cspan class=\"Yjhzub\"\u003eBhuvanachandra\u003c\/span\u003e\u003cspan class=\"Yjhzub\"\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan class=\"Yjhzub\"\u003eమద్రాసు నగరం ఓ మహావృక్షం లాంటిది. ఎన్ని ఊడలు దింపుకుని విస్తరించిందో! ఎన్ని జీవితాల్ని తనలో కలుపుకుందో! పేదా-గొప్పా అందర్నీ సమానంగానే చూస్తుందీ నగరం. ఈ గాలిలో ఎందరి ‘నిశ్వాసాలు’ తారల్లా వేలాడుతున్నాయో... సారీ... తారల్లా అంటే ‘పగటి తారల్లా’ తారలు ఉన్నా పగటివేళ కనిపించవు. అలాగే ఈ ‘నిశ్వాసాలూ’ కనిపించవు. కానీ ఆ నిశ్వాసాల్లోని ‘కలల’ శబ్దం మాత్రం గుండెకి వినిపిస్తూనే ఉంటుంది. మెల్లగా అక్కడ్నించి బయలుదేరాను. ఎంత ఇష్టమైన చోటునుంచి అయినా  కదలక తప్పదు. ‘‘బాట నుంచి ఓ బాటకి మజిలీ’’ అదేగా జీవితమంటే..! లక్షలమంది నా చుట్టూ ఉన్నారు. కానీ నిజంగా ‘‘నా’’ వాళ్ళూ? ప్రతి మనిషి గుండెలోనూ ఈ శూన్యం ఉంటుంది. ఆడైనా మగ అయినా. ఈ శూన్యాన్ని నింపేది సృష్టిలో ఒక్కరే. అదీ ఒకసారే. ఏమో! మనసు పరిపరివిధాల ఆలోచించడం మొదలుపెట్టింది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan class=\"Yjhzub\"\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663874572544,"sku":"ID-MQ82-UZQC","price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/MANASU_PORALLO.jpg?v=1782290993"},{"product_id":"vallu-bhuvanachandra","title":"Vallu","description":"\u003ch3\u003eVallu \u003ca href=\"https:\/\/logilitelugubooks.com\/search?search=Bhuvanachandra%20%28Padachari%20Vallu%20Aloukika%20Prapancha%20Darsanam%29\"\u003eBhuvanachandra\u003c\/a\u003e\n\u003c\/h3\u003e\n\u003ch3\u003eవాళ్ళు భువనచంద్ర\u003c\/h3\u003e\n\u003cp\u003eVaallu Bhuvanchandra \u003c\/p\u003e\n\u003cp\u003e‘‘నిత్య జీవితంలో ఏది అన్వేషించాలి?’’ జగమంతా నిండిన ‘‘నేను’’ని. ఈ లౌకిక ప్రపంచంలో అలౌకిక ఆనందాన్ని పొందడం ఎలా? ఆధునిక జీవనంలో అందుకు అనేక మార్గాలున్నాయి. కానీ అవన్నీ తాత్కాలిక సుఖాన్ని అందించేవే. మరి పరిపూర్ణమైన మానసిక సంతృప్తిని పొందడం ఎలా? వాస్తవిక జీవితంలో తమ విధులని సక్రమంగా నిర్వహిస్తూనే ఆ అలౌకిక ప్రపంచాన్ని దర్శించడం సాధ్యమేనా? ఒక దశలో చాలామందిలాగే ఆయన్నీ ఈ ప్రశ్నలు వేధించాయి. అయితే చాలామందిలా కాకుండా ఆయన వీటి సమాధానం కోసం అన్వేషించారు. సమాధానం చెప్పగల గురువుల కోసం వెదికారు. ఏదో తెలుసుకోవాలనే జిజ్ఞాసతో, నడక ప్రారంభించిన ఆ యువకుని అనుభవాలే.... పాఠకునివి కూడ అవుతాయి. అంతగా లీనమయిపోతాము.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663882338560,"sku":"PH-DRNN-B3Q7","price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Vallu_bhuvanachandra.jpg?v=1777023536"},{"product_id":"sri-bodha","title":"Sri Bodha","description":"\u003cp\u003eSRI BODHA \u003cspan\u003eశ్రీ బోధ BY \u003cspan class=\"Yjhzub\"\u003eBhuvanachandra\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cspan class=\"Yjhzub\"\u003eభువన్జీ సొంత ఊరైన చింతలపూడిలోని తన గురుదేవులైన శ్రీబోధానందపురి మహారాజ్గారి ద్వారా తమ మనసులు, విజ్ఞానం ఎలా వికసింప చేసుకున్నారో బోధానందామృతం ద్వారా మనకు తెలియజేసారు. ఆ అమృతానికి కొనసాగింపుగా ఇప్పుడు శ్రీ బోధని మనకు అందించారు.\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cspan class=\"Yjhzub\"\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663884075264,"sku":"QT-AT1S-PGIQ","price":63.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Sri_Bodha_telugubook.jpg?v=1782557487"},{"product_id":"maayanagaram","title":"Maayanagaram","description":"\u003cp\u003eMaayanagaram  \u003cspan class=\"Y2IQFc\" lang=\"te\"\u003eమాయానగరం  BY \u003cspan class=\"Yjhzub\"\u003eBhuvanachandra \u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan class=\"Y2IQFc\" lang=\"te\"\u003e\u003cspan class=\"Yjhzub\"\u003eమాయానగరం అన్నిట్నీ అంతట్నీ గమనిస్తూనే వుంది. అవిశ్రాంతంగా.. ఆత్రంగా ప్రతివ్యక్తి జీవితంలోంచీ మరో వ్యక్తి నేర్చుకోదగింది కొంతే వుంటుంది. ఎందుకంటే మనిషి జీవితంలో అత్యద్భుత క్షణాలు కొన్ని మాత్రమే వుంటాయి. అలాగే మనిషి జీవితం పుట్టుకనుంచి మృత్యువు వరకూ స్థిరమైనది కాదు. ఎప్పటికప్పుడు పరిస్థితులకి అనుగుణంగా మారిపోతూనే వుంటుంది. తనని తాను మార్చుకుంటూనే వుంటుంది. నగరం కూడా మనిషిలాంటిదే. ఏ నగరపు ప్రవృత్తి దానిదే. మనిషి అనేకానేక భావాల్ని తనలో ఇముడ్చుకున్నట్టు నగరం కూడా రకరకాల మనుషుల్ని తనలో ఇముడ్చుకుంటుంది. అవిశ్రాంతంగా తనమీద ఆధారపడ్డవాళ్ళ బ్రతుకుల్ని గమనిస్తూనే వుంటుంది. మౌనంగా... నిర్వికారంగా. అందుకే - ‘మాయానగరం’ కథ ఎప్పటికీ సశేషమే.\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp style=\"text-align: left;\"\u003e\u003cspan class=\"Y2IQFc\" lang=\"te\"\u003e\u003cspan class=\"Yjhzub\"\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663893119232,"sku":"YA-N8HG-0V4B","price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Maayanagaram_BY_Bhuvanachandra_nbsp.jpg?v=1782283210"},{"product_id":"moodo-seetha-katha","title":"Moodo Seetha Katha","description":"\u003cp\u003eMoodo Seetha Katha \u003cspan\u003eమూడో సీతా కథ BY \u003cstrong class=\"Yjhzub\" data-complete=\"true\" aria-owns=\"action-menu-parent-container\"\u003eBhuvanachandra\u003c\/strong\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cstrong class=\"Yjhzub\" data-complete=\"true\" aria-owns=\"action-menu-parent-container\"\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/strong\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663896363264,"sku":"1V-D310-YAB9","price":115.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/moodo_seetha_katha.jpg?v=1782556035"},{"product_id":"the-untold-stories-bhuvanachandra","title":"The Untold Stories","description":"\u003cp\u003eThe Untold Stories \u003cspan\u003e\u003cstrong class=\"Yjhzub\" data-complete=\"true\" aria-owns=\"action-menu-parent-container\"\u003eBhuvanachandra \u003c\/strong\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eది అన్టోల్డ్ స్టోరీస్ భువనచంద్ర\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఇదో రంగుల ప్రపంచం. ఈ బిజినెస్, ‘షో...బిజినెస్’! అందుకే అనంతమైన ఆకర్షణ, డబ్బు, పేరు మాత్రమేగాక చలన చిత్ర పరిశ్రమ ‘అమరత్వాన్ని’ కూడా ప్రసాదిస్తుంది. సక్సెస్ ఎవరిని ఎప్పుడు వరిస్తుందో ఎవరికీ తెలీదు. కానీ, ఆశ  మాత్రం మనసునీ, మనిషినీ వీడదు. కొన్ని వందలమందిని యీ చెన్నైలో చూశాను. వచ్చినప్పుడు కోటికోటి కలల్ని కళ్ళనిండా నింపుకుని వచ్చినవాళ్ళు- సంవత్సరాల తరబడి నిస్సారంగా, నిర్జీవంగా పాండీబజార్ చెట్ల నీడల్లో బ్రతుకు వెళ్ళదీయడాన్ని నా కళ్ళారా చూశాను. యువకులున్నారు... యువతులున్నారు. మధ్య తరగతివాళ్ళూ, నడివయసువారూ కూడా ఓ మాయలో పడి ఇక్కడికొచ్చారు. వారు తిరిగి వెళ్ళడమంటూ జరగదని నాకూ తెలుసు. కారణం ఫాల్స్ ప్రెస్టీజ్. ఈ కథల్లో కలలున్నాయి...కన్నీళ్ళున్నాయి...త్యాగాలూ, స్వార్థాలూ, ప్రేమలూ, ద్వేషాలూ అన్నీ వున్నాయి. మామూలు సగటుమనిషికంటే కళాకారుడి మనసులో ఆటుపోట్లు ఎక్కువుంటాయి. కారణం ‘స్పందించే మనసు’ కలిగి ఉండటం. నిజానికంటే ‘కల్పన’ కీ ‘కల’ కీ ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం. కళాకారులు  ఎంత త్వరగా పొంగిపోతారో, అంత త్వరగానే కృంగిపోతారు. ఓ ‘మెప్పు’ వారిని ఆకాశంలో నిలబెడితే, ఒక్క ‘విమర్శ’ వారిని పాతాళంలోకి తోసేస్తుంది. అంత సున్నితమైనవారు గనకనే ఇన్ని ఆటుపోట్లకి గురి అవుతారు. ఎంతో ఉత్సాహంతో, ఎంతో టేలంట్తో యీ పరిశ్రమకి రావాలనుకునే యువతీయువకుల్ని నిరాశపరచడంకోసం యీ కథలు వ్రాయలేదు. సరైన ‘అవగాహనతో’ రమ్మని చెప్పడానికి మాత్రమే యీ అన్టోల్డ్ స్టోరీస్ రాశాను.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cstrong class=\"Yjhzub\" data-complete=\"true\" aria-owns=\"action-menu-parent-container\"\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/strong\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663898525952,"sku":"4U-UI5E-6MXL","price":115.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/The_Untold_Stories_Bhuvanchandra.jpg?v=1782282879"},{"product_id":"mahathi-bhuvanchandra","title":"Mahathi మహతి Bhuvanchandra","description":"\u003cp class=\"a-size-large a-spacing-none\"\u003e\u003cspan id=\"productTitle\" class=\"a-size-large product-title-word-break\"\u003eMahathi Bhuvanchandra\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp class=\"a-size-large a-spacing-none\"\u003e\u003cspan class=\"a-size-large product-title-word-break\"\u003e\u003cspan id=\"productTitle\" class=\"a-size-large product-title-word-break\"\u003eమహతి భువనచంద్ర\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eఈ నవలలో గంభీరంగా ప్రవహించే ‘మహతి’ అనే నదిలో - ఎన్నో అలలు, వాగులు, ఉపనదులు కలిసిపోతూ, నవరసాలు నిండిన జీవిత సారంలా, చిక్కనైన పాటలా, తెలుగు నవలా లోకంలో మెరిసే మణిపూసలా ఈ కథ పాఠకుల హృదయాల్లో నిలిచిపోతుంది. పెద్ద పుల్లేటికుర్రులో పుట్టిన పెంకి పిల్ల ‘సీత’ కథని, ఆమెలోని నిర్భీతిని, నిజాయితీని, హిపోక్రసీ లేని అందమైన అల్లరిని ‘‘మూడో సీత’’ నవలగా అందించిన భువనచంద్ర ఆమె ఎస్సెల్సీ పాసవ్వడంతో ముగించారు. ఆ సీత ఎదిగి మహతిగా మారి, కాలేజీలో చేరి, ఇంటర్ చదువుతున్నప్పటి విశేషాలతో ఈ నవల ప్రారంభించారా అనిపించింది. అదే చిలిపితనం, అదే వ్యక్తిత్వం, అదే సేవాభావం, అదే నిబద్ధత. దేనికీ తొణకని బెణకని దృఢత్వం\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663898886400,"sku":"5C-TH7C-3A2V","price":270.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Mahathi_Bhuvanchandra.jpg?v=1782282491"},{"product_id":"bhuvanachandra-kathalu-1","title":"Bhuvanachandra Kathalu - 1","description":"\u003cp\u003eBhuvanachandra Kathalu - 1 \u003cspan class=\"Y2IQFc\" lang=\"te\"\u003eభువనచంద్ర కథలు - 1 BY Bhuvanachandra\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eబీ - ఇండియన్ ఒక మంచికథ... బ్రాండెడ్ భూతం ఆవహించిన మనం ఆలోచించడం మానేసి మనమేలు, దేశంమేలు కూడా మర్చిపోతున్నామని మనని ‘‘కుదిపి’’ చెప్పేకథ ఇది... జాతిని నిర్వీర్యం చేసేవాళ్ళు, దేశాన్ని ఆర్థికంగా ఆక్రమించాలన్న ప్రణాళిక ఉన్నవాళ్ళు, అడ్వర్టైజ్మెంట్స్ను వాడుకుని జనాన్ని హిప్నటైజ్ చేస్తారు. ఎర్రటి అట్టమీద తెల్లది అక్షరాలపేరు పదేపదే చూపిస్తే కొట్టుకువెళ్ళి ఒద్దనుకున్నా అదే కొంటాము. ఆ పద్ధతి ఉపయోగించే మనమీద ‘‘బ్రాండ్’’ను ఆవహింపజేస్తున్నారు వ్యాపారవేత్తలు. ఒకప్పుడు హైద్రాబాద్ బాలానగర్లో అమెరికాలో ఒక ప్రముఖవ్యక్తి వేసుకునే బ్రాండెడ్ షర్టస్ కుడుతున్నారని తెలిసింది కుర్రకారుకు... అతను కుట్టిచ్చిన షర్టస్కు బ్రాండ్నేమ్ ట్యాగ్తో అమ్ముతాడు దళారి. ఇంకేం ఆ టైలర్ కోటీశ్వరుడైపోతాడు. టైలర్ దగ్గర గుడ్డ, టైలరింగ్ బిల్లు కలిసి నాలుగువందలు. కానీ బ్రాండ్ టాగ్ వేస్తే షర్ట్ఖరీదు పద్దెనిమిది వందలు.. కానీ బ్రాండ్ కోసం, ఆ చిన్న ...లేబుల్కోసం నాలుగువందల వస్తువు పద్దెనిమిది వందలకు కొంటున్నారట జనం... ఇట్లాంటి విషయాలు సహేతుకంగా చెప్తూ భునవచంద్రగారు ఈ కథలో ఒక ట్రిక్ చేశారు. పొలం నుంచి వచ్చిన తాజా కూరల్ని, సరుకుల్ని, పళ్ళను అమ్మే చిల్లర  వ్యాపారస్థులతో సామాన్యమానవుడికి ఉండే సత్సంబంధాలను ఆ తాజా సరుకులతో చేసే వంటకాలను వర్ణిస్తూ తెగనోరు ఊరింపజేసి ‘‘ఛీ! పాడు బ్రాండ్లు.. ఎప్పటి నిలవున్న సరుకులో’’ అనిపించేట్లు చేసేశారు. ఇది నిజంగా దేశసేవే.\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan class=\"Y2IQFc\" lang=\"te\"\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663899443456,"sku":"6O-WQ38-OWCS","price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Bhuvanachandra_Kathalu_-_1.jpg?v=1782284545"},{"product_id":"bhuvanachandra-kathalu-2","title":"Bhuvanachandra Kathalu - 2","description":"\u003cp\u003eBhuvanachandra Kathalu - 2 \u003cspan class=\"Y2IQFc\" lang=\"te\"\u003eభువనచంద్ర కథలు - 2 BY Bhuvanachandra\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan class=\"Y2IQFc\" lang=\"te\"\u003eఆయన కథలు చదివితే చింతలపూడి అమ్మవారిని దర్శించినట్టే. ఆయన కథలు వింటే ‘పారేసుకున్న జ్ఞాపకాలన్నీ’ వెతుక్కుంటూ వచ్చి చుట్టుకున్నట్లే. ఆయన కథలు అమ్మ పెట్టే గోరుముద్దలు. ఆయన కథలు మామ్మ పాడే జోడలపాటలు. ఆయన కథలు నాన్న తెచ్చే తాయిలాలు. ఆయన కథలు చిన్ననాటి ‘కాకి ఎంగిళ్ళు’. ఆయన కథలు భావితరాలకి తరగని నిధులు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan class=\"Y2IQFc\" lang=\"te\"\u003eSold b\u003c\/span\u003e\u003cspan class=\"Y2IQFc\" lang=\"te\"\u003ey Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book\u003c\/span\u003e\u003cspan class=\"Y2IQFc\" lang=\"te\"\u003e Store\u003c\/span\u003e\u003cspan class=\"Y2IQFc\" lang=\"te\"\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663913140480,"sku":"UL-SLWT-ZT2Q","price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Bhuvanachandra_Kathalu_-_2.jpg?v=1782285691"},{"product_id":"vallu-2-bhuvanachandra","title":"Vallu-2","description":"\u003cp\u003eVallu-2 by Bhuvanachandra\u003c\/p\u003e\n\u003cp\u003eBhuvanchandra\u003c\/p\u003e\n\u003cp\u003e‘‘సర్వం సమృద్ధిగా వున్నా ‘కర్మ చెయ్యకా తప్పదు` కర్మఫలం అనుభవించకా తప్పదు. ఉత్తరంవారు సంపాదిస్తారు, తింటారు, ఖర్చు పెడతారు, ఇతరులకి తినిపిస్తారు కూడా. దక్షిణంలో అది చాలా తక్కువ. ఎంతసేపూ కుటుంబంకోసమో, పిల్లలూ, మనవలూ, మునిమనవలకోసమో పొదుపుచేస్తూ జీవించడం తప్ప. ఎంత సంపాదించినా తమ ఆనందం కోసం ఖర్చుపెట్టుకోరు’’ తేల్చేశాడు సాధూ మహారాజ్. కురుక్షేత్రపు చుట్టుపక్కల నగరాల్ని చూసినప్పుడూ, ప్రజల జీవన విధానాన్ని గమనించినప్పుడూ నాకూ అదే అనిపించింది. ‘నీకోసం నువ్వు’ ` ఫస్ట్ ప్రిఫరెన్స్. నీవాళ్ళకోసం నువ్వు’ ` సెకండ్ ప్రిఫరెన్స్ ` ఇది నార్త్ అయితే. ‘నావాళ్ళకోసం నేను’ ` ఫస్ట్ ప్రిఫరెన్స్. ‘నా తరువాత తరాల భవిష్యత్తుకోసం నేను’ ` సెకండ్ ప్రిఫరెన్స్ ‘నాకోసం నేను’ ` ఇది థర్డ్ ప్రిఫరెన్స్ ` ఇది సౌత్. కాలం కొన్ని మార్పులను తెస్తుంది. ప్రతి యుగానికీ తనదైన ధర్మమూ వుంటుంది. కాలాన్ని బట్టి న్యాయమూ మారుతుంది, ధర్మమూ మారుతుంది. మారనిది ‘సత్యం’ ఒక్కటే. అది కాలానికి అతీతమైనది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663916220672,"sku":"ZE-FV4Q-DDCV","price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Vallu_2.jpg?v=1772628736"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/collections\/images.jpg?v=1785229191","url":"https:\/\/www.sahithibooks.com\/collections\/bhuvanachandra.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}