{"title":"Bankim Chandra Chatterjee","description":"\u003cp\u003eBankimbabu\u003c\/p\u003e","products":[{"product_id":"bankimbabu-novel-8-books-set","title":"Bankimbabu Novels 8 Books Set","description":"\u003cp\u003e\u003cb\u003eBankimbabu Novels 8 Books Set\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003eBankim Chandra Chatterjee\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003eబంకించంద్ర ఛటర్జీ\u003c\/b\u003e (\u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/27_%E0%B0%9C%E0%B1%82%E0%B0%A8%E0%B1%8D\" class=\"mw-redirect\" title=\"27 జూన్\"\u003e27 జూన్\u003c\/a\u003e, \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/1838\" title=\"1838\"\u003e1838\u003c\/a\u003e - \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/8_%E0%B0%8F%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D\" class=\"mw-redirect\" title=\"8 ఏప్రిల్\"\u003e8 ఏప్రిల్\u003c\/a\u003e, \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/1894\" title=\"1894\"\u003e1894\u003c\/a\u003e) (బంకించంద్ర ఛటోపాధ్యాయ; బెంగాలీ: ఆంగ్లం: Bankim Chandra Chatterjee), 'ఛటోపాధ్యాయ్' ని \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9F%E0%B0%BF%E0%B0%B7%E0%B1%8D\" class=\"mw-redirect\" title=\"బ్రిటిష్\"\u003eబ్రిటిష్\u003c\/a\u003e వారు పలకలేక 'ఛటర్జీ' అని పిలువసాగారు. బ్రిటిష్ వారిని అనుకరిస్తూ ప్రపంచంకూడా 'ఛటర్జీ' అని పిలవడం ప్రారంభించింది. ఇతను \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%AC%E0%B1%86%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%B2%E0%B1%80\" class=\"mw-redirect\" title=\"బెంగాలీ\"\u003eబెంగాలీ\u003c\/a\u003e కవి, వ్యాసరచయిత, సంపాదకుడు. ఇతని రచన \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%B5%E0%B0%82%E0%B0%A6%E0%B1%87%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A4%E0%B0%B0%E0%B0%82\" title=\"వందేమాతరం\"\u003eవందేమాతరం\u003c\/a\u003e ఇతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇతను వ్రాసిన \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%86%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B0%AE%E0%B0%A0%E0%B1%8D\" title=\"ఆనందమఠ్\"\u003eఆనంద్ మఠ్\u003c\/a\u003e అనే నవలనుండి ఈ గీతాన్ని సంగ్రహించారు. ఈ గీతం భారత స్వతంత్ర సంగ్రామంలో సమరశంఖంగా పనిచేసింది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663870705920,"sku":"F7-9Y87-8FVT","price":350.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Bankimbabu_Novels_8_Books_Set.jpg?v=1774940988"},{"product_id":"mathangini-bankimbabu","title":"Mathangini","description":"\u003cp\u003eMathangini మాతంగిని Bankimbabu \u003c\/p\u003e\n\u003cp\u003eకలకత్తా సమీపగ్రామంలో ఒక పేదకాయస్థుడు భగవంతుడు తనకు రూపగుణ లావణ్యములుగల యిద్దరు కుమార్తెల నిచ్చాడని, వాళ్ళిద్దరూ వినయగుణ సంపన్నులనీ, వాళ్ళిద్దరూ భగవంతుడు తనకు ప్రసాదించిన అమూల్య సంపద అని అతడు గొప్పలు చెప్పుకుంటూ వుండేవాడు. అదృష్టదేవత సహజంగా యిలాంటి కోమల హృదయము, అతి సున్నితమైన మనస్సుగల అత్యంత సౌందర్యవతులగు హిందూ బాలికలకు చెడ్డభర్తలనే సమకూరుస్తూ వుంటుంది. ఆ కాయస్థుని పెద్దకుమార్తె మాతంగిని చాలా సహృదయురాలు, అత్యంత లావణ్యవతి. ఈ అదృష్టదేవత అనాగరికుడు రాజమోహనునికి ఆమెను భార్యగా చేసింది. వివాహము జరిగిన తరువాత కూడా మాతంగిని తండ్రికి తన కుమార్తెకు తగిన భర్త లభించాడనే విశ్వాసం వుండేది. పెద్దకుమార్తెకంటె రెండో కుమార్తె హేమాంగిని అదృష్టవంతురాలు. ఆమెను మాధవునకిచ్చి వివాహం చేశారు. ఇక చదవండి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663896264960,"sku":"1O-8O6G-BAI1","price":36.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Mathangini_Bankimbabu.jpg?v=1778925888"},{"product_id":"rajasimha-bankimbabu","title":"Rajasimha","description":"\u003cp\u003eRajasimha రాజసింహ, Bankimbabu\u003c\/p\u003e\n\u003cp\u003eరాజస్థాన్కు చెందిన పర్వతప్రదేశంలో రూపనగర్ అనే పేరుతో చిన్న రాజ్యమొకటి ఉన్నది. రాజ్యం చిన్నదయినా, పెద్దదయినా రాజు అనేవాడు ఉంటాడుగదా! రూపనగర్కు కూడా ఒక రాజున్నాడు. రాజ్యం చిన్నదయినా పేరు గొప్పగా ఉండడంలో అభ్యంతరమేమీ లేదుగదా! రూపనగర్ రాజుపేరు విక్రమసింహుడు రాజ్యం చిన్నది. రాజధాని చిన్నది, నగరం కూడా చిన్నదే! ఆ నగరంలో ఒక భవనము మాత్రం అతి సుందరంగా అలంకరించబడి వున్నది. అది రాకుమారి మందిరం. ఒక వృద్ధురాలు చిత్రాలు అమ్ముకుంటూ ఆ మందిరం వద్దకు వచ్చింది. అక్కడ భువనమోహినియైన సుందరిని చూసి చిత్రాలు తెచ్చిన ఆ వృద్ధురాలు ప్రణామాలాచరించింది. ఆ సుందరి రూపనగర మహారాజు కూతురైన చంచలకుమారి! హాస పరిహాసాలాడుతున్న యువతులందరూ ఆమె చెలికత్తెలు. వాళ్ల పరిహాసాలకు ఆమె చిరునవ్వు నవ్విందేకాని మారు మాట్లాడలేదు. ‘‘ఎవరు నువ్వు?’’ అని ప్రశ్నించింది రాకుమారి చంచలకుమారి ఆ వృద్ధురాలివైపు తిరిగి. ‘‘ఈమె చిత్రాలు అమ్మడానికి వచ్చింది’’ అని చెలికత్తెలు చెప్పారు. రాకుమార్తె ముసలిది తెచ్చిన చిత్రపటాలు చూడాలనే కోర్కె వెళ్ళబుచ్చింది. ముసలిది వరుసగా చూపించడం ప్రారంభించింది. రాజపుత్రిక వాటినన్నింటినీ ముసలిదానికి ఇచ్చివేస్తూ ‘‘ఇవి అక్కరలేదు. వీళ్ళల్లో ఎవరూ హిందువులు లేరు. ముసల్మానులకు బానిసలు వీళ్ళంతా’’ అని అన్నది. ముసలిది మరికొన్ని చిత్రాలను తీసి చూపిస్తూ ఒక చిత్రపటాన్ని చూపించకుండా లోపల దాచిపెట్టింది. ఆ చిత్రం ఎవరిదో చూపించు, చూస్తాను’’ అని రాకుమారి అన్నది. ‘‘రాజా రాజసింహుడిది’’ అని ముసలిది భయపడుతూ చెప్పింది. రాకుమారి చిరునవ్వు నవ్వింది. ‘‘వీరపురుషులెవరూ స్త్రీలకు శతృవులుకాదు. నేనీ చిత్రాన్ని కూడా తీసుకుంటాను’’ అని రాకుమారి అన్నది. చిత్రాన్ని చేతిలోకి తీసుకొని రాకుమారి చాలాసేపు అలాగే దాన్ని చూస్తూ వుండిపోయింది. చూస్తూనే చూస్తూనే ఆమె ముఖం విప్పారింది. నేత్రాలు వికశించాయి. ఇక చదవండి.\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663897542912,"sku":"38-Q8M8-OV5P","price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/bf94c22f.jpg?v=1770616508"},{"product_id":"vishavruksham","title":"Vishavruksham","description":"\u003cp\u003eVishavruksham విషవృక్షం,  BY Bankimbabu\u003c\/p\u003e\n\u003cp\u003eమహాకవి కాళిదాసుకు రోజూ ఒక తోటమాలిని పూలు తీసుకెళ్లి యిస్తూ వుండేదట. కాళిదాసు బీదబ్రాహ్మణుడు. పూలకు డబ్బిచ్చుకునే తాహతు లేదు. డబ్బులు బదులు తాను రచించిన కవిత్వాన్ని ఆమెకు విన్పిస్తూ వుండేవాడట. ఒకరోజున మాలిని సరోవరంలో ఒక అందమైన తామరపూవు వికసించిందట. ఆమె దాన్ని తెచ్చి కాళిదాసుకు బహూకరించింది. కాళిదాసు ఆ బహుమానానికి బదులు ఆమెకు ‘మేఘదూత’ విన్పించడం ప్రారంభించాడు. ‘మేఘదూత’ కవిత్వం ఆ మాలినికి అర్థం కాలేదు. ఆమె వెళ్లిపోవడానికి లేచి నిల్చున్నది. ‘‘లేచావేఁ?’’ అడిగాడు కవి. ‘‘ఏం చేయను మరి! నీ కవిత్వంలో రసం లేనిదే!’’ అన్నది మాలిని. ‘‘అయితే నీకు స్వర్గప్రాప్తి లేదు’’ అన్నాడు కవి. ‘‘ఎందుకని?’’ ‘‘స్వర్గానికి వెళ్లాలంటే కొన్నిమెట్లు ఎక్కాలి. లక్ష యోజనాల వరకు అలా మెట్లమీద ప్రయాణించవలసినదే. ఆ తరువాతగాని స్వర్గం కన్పించేది. అలాగే ప్రారంభంలో నా కవిత్వం కూడా కొంత నీరసంగా వుండవచ్చు. ప్రశాంతంగా ముందు నాలుగైదు మెట్లవరకే వెళ్ళలేకపోతే, ఇక లక్షయోజనాల దూరం నువ్వేం నడుస్తావు?’’ అన్నాడట కవి కాళిదాసు. మాలిని ఈ బ్రాహ్మణుడు తనను శపిస్తాడేమోనని భయపడింది. విధిలేక చివరిదాకా ఆ ‘మేఘదూత’ కావ్యం విన్నది. కావ్యమంతా విని చాలా సంతోషించినదై దానికి ప్రత్యామ్నాయంగా ఆ రెండవరోజున మదనమోహిని అనే పేరుగల అందమైన పూలమాల తెచ్చి ఆయన మెడలో వేసిందట. ఈ పుస్తకాన్ని దానితో పోల్చడానికి వీల్లేదు. ఇందులో స్వర్గమూ లేదు, లక్ష యోజనాలవరకు మెట్లూ లేవు. రసం అంటూ ఏదో కొంత వున్నది. మెట్లుకూడా అట్లే లేవు. పాఠకులలో ఎవరైనా ఆ తోటమాలిని వలె చప్పగా వున్న నోరు చప్పరిస్తే వాళ్ళతో చెప్పదలచినదేమిటంటే ‘ఈ మెట్లు దాటితేగాని రససాగర సందర్శనం లభించదు’’ అని.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663901737216,"sku":"AB-98LA-D55N","price":36.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/f7b123e8.jpg?v=1770616517"},{"product_id":"mrinalini-bankimbabu","title":"Mrinalini","description":"\u003cp\u003eMrunalini మృణాళిని, Bankimbabu novel\u003c\/p\u003e\n\u003cp\u003eమృణాళిని వెంట ఆమె శయనాగారం వరకు నడిచి వెళ్లి హృషీకేశుడు మృణాళినితో- ‘‘మృణాళినీ! నీ చరిత్ర ఏమిటో నాకు చెప్పవూ?’’ అని ప్రశ్నించాడు. ‘‘నా చరిత్రను గురించి చెప్పమంటారా? అంటే?’’ అన్నది మృణాళిని. ‘‘అంటే ఏమీ లేదు. నువ్వెవరి కుమార్తెవో, నీ జీవితవృత్తాంత మేమిటో తెలుసుకోవాలని నాకు కుతూహలంగా వున్నది. ఈ విషయాలేవీ నాకు తెలియవు. తెలుసుకోడానికి ఇదివరలో నేనెప్పుడూ ప్రయత్నించనుకూడా లేదు. గురువుగారు ఆజ్ఞాపించారు. నేను ఆయన ఆజ్ఞను పాటించాను. నువ్వు కులటవని నేను తెలుసుకోలేకపోయాను’’ అన్నాడు హృషీకేశుడు. అలాగే వెళ్ళిపోతాను. మీ ఆజ్ఞను శిరసావహిస్తాను. రేపు ఉదయం మీరు నన్ను కూడా చూడరు’’ అని మృణాళిని సమాధానం చెప్పింది ఎటువంటి తొట్రుపాటూ కన్పించనివ్వకుండ! ఎవరీ మృణాళిని? ఆమెను నిందించిన హృషీకేశుడెవరు? తెలియాలంటే తప్పక చదవండి బంకించంద్ర ఛటర్జీ రచన మృణాళిని.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663903179008,"sku":"D8-MCEV-BRIR","price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/539fe2eb.jpg?v=1770616521"},{"product_id":"krishnakanth","title":"Krishnakanth","description":"\u003cp\u003eKrishnakanth కృష్ణకాంత్ BY, Bankimbabu\u003c\/p\u003e\n\u003cp\u003eకృష్ణకాంతరాయ్ హరిద్రా గ్రామంలోకెల్లా ధనికుడు. జమీందారీ నుంచి ఆయనకు దాదాపు రెండు లక్షలు ఆదాయం వస్తుంది. ఆ ఆస్తంతా ఆయన, ఆయన తమ్ముడు రమాకాంతరాయ్ కలిసి సంపాదించారు. ఇద్దరూ చాలా అన్యోన్యంగా వుండేవారు. రెండోవాడు మోసం చేస్తాడేమోనన్న అనుమానం ఇద్దరిలో ఎవరికీ ఎంతమాత్రం వుండేదికాదు. ఆస్తంతా పెద్దవాడైన కృష్ణకాంతుడి పేరనే వుంది. అన్నదమ్ములిద్దరూ ఉమ్మడిగానే వుండేవారు. కొన్నాళ్ళకి రమాకాంతుడికి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు గోవిందలాల్. ‘ఆస్తిపాస్తులన్నీ ఒకడిపేరనే వున్నాయి. రాతకోతలన్నీ పూర్తిచేసుకుంటే పిల్లవాడి భవిష్యత్తుకు మంచిది’ అనుకున్నాడు రమాకాంతుడు కొడుకు పుట్టాక. అన్న తనని ఎప్పటికీ మోసం చెయ్యడని అతనికి గట్టి నమ్మకమే వుంది. కాని, ఆయన కాస్తా ‘హరీ’ అంటే, అన్న కొడుకులు తనకు న్యాయం కలిగిస్తారనే నమ్మకం మాత్రం లేదు. ఇదంతా ఆలోచించుకుని కూడా ఆస్తి పంచిపెట్టమని అన్నని అడగడానికి సంకోచించేవాడు రమాకాంతుడు. ‘ఇవ్వాళ చెబుదాం! రేపు చెబుదాం’ అనుకుంటూనే ఒకసారి జమీందారీ పనిమీదనే ఎక్కడికో వెళ్లి హఠాత్తుగా మరణించాడు. తమ్ముడి కొడుకుని మోసగించి సంపద సర్వస్వమూ హరించాలనే కోరిక గనుక కృష్ణకాంతుడి కున్నట్లయితే ఇప్పుడతనికి అడ్డేమీ లేదు కాని, కృష్ణకాంతుడి మనస్సులో అలాంటి దుర్బుద్దికి ఎంతమాత్రం చోటులేదు. తన కొడుకులతోపాటు గోవిందలాల్ని కూడా పెంచాడు. న్యాయంగా అతనికి చెందవలసిన ప్రకారం ఆస్తిలో సగభాగం గోవిందలాల్కి వ్రాసి యివ్వడానికి నిశ్చయించుకున్నాడు. ఇక చదవండి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663904653568,"sku":"FG-EEF1-4CYE","price":36.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/6d6c65f6.jpg?v=1770616525"},{"product_id":"anandamatham-indira","title":"Anandamatham \u0026 Indira","description":"\u003cp\u003eAnandamatham \u0026amp; Indira ఆనందమఠం \u0026amp; ఇందిర, BY  Bankimbabu \u003c\/p\u003e\n\u003cp\u003eవంగ సంవత్సరం 1176. వేసవికాలంలో ఒకరోజు. పదచిహ్న గ్రామం అనే పేరుగల ఆ వూళ్ళో ఎండవేడిమి మిక్కుటంగా వుంది. గ్రామంలో అనేక ఇళ్ళు వున్నాయి. అయితే మనుషులు యెవరూ అగుపించడం లేదు. ‘పదచిహ్న’ గ్రామంలో గణనీయమయిన వ్యక్తి ‘మహేంద్రసింహుడు’. అతడు చాల ఐశ్వర్యవంతుడు. అయినా ఈ కరువు మూలంగా బీదవారు, భాగ్యవంతులు ఒకటే అయిపోయారు. పెద్ద పెద్ద ఇళ్ళూ, భవంతులూ, మేడలు - అన్నీ జనశూన్యంగా వున్నాయి. అందరూ పట్టణం నుంచి పారిపోయారన్నమాట! మహేంద్రుడు తన భార్యను, కుమార్తెను ఒక ఇంటిలోనికి తీసుకువెళ్లాడు. వారిని లోన కూర్చుండజేసి, ఆ ఇంటిలో ఎవరైనా పలుకుతారేమోనని పిలిచాడు. బదులులేదు. తరువాత కళ్యాణితో ‘‘కొద్దిసేపు ధైర్యంగా ఇక్కడే వంటరిగా కూర్చో. నేను బయటకు వెళ్ళి కాసిని పాలు దొరుకుతాయేమో చూచి తీసుకువస్తాను’’ అని మహేంద్రుడు మట్టిపాత్ర తీసుకుని బయటకు వెళ్ళాడు. ఇక చదవండి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663904719104,"sku":"FG-MCIL-5FE8","price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/c5ca078d.jpg?v=1770616525"},{"product_id":"durgesanandhini-seetharam","title":"Durgesanandhini \u0026 Seetharam","description":"\u003cp\u003eDurgesanandhini \u0026amp; Seetharam దుర్గేశనందిని, సీతారామ్ BY Bankimbabu\u003c\/p\u003e\n\u003cp\u003eచాలాకాలంనాటి సంగతి. ఒకరోజు సాయం సమయాన అశ్వారూఢుడైన అందమైన యువకుడొకడు విష్ణుపురం నుంచి మందారన్ వెళ్ళే మార్గంలో ఒంటరిగా వెడుతున్నాడు. సూర్యాస్తమయం కాబోతున్నది. పైగా తుఫాను వచ్చే సూచనలుకూడా కనిపిస్తున్నాయి. ఇదిచూచి అతడు గుర్రాన్ని కొంచెం వేగంగా పరిగెత్తించాడు. కొంతదూరం వెళ్ళేటప్పటికి బాగా చీకటి పడిపోయింది. ముందుదారి కన్పించటం మహా దుర్భరంగా వున్నది. మరికొంతదూరం వెళ్ళేప్పటికి మరల ఆకాశం మెరిసింది. ఆ వెలుతురులో అతనికి పాలరాతితో నిర్మితమైన దేవాలయం కనిపించింది. మెట్లెక్కి నెమ్మదిగా దేవాలయ ద్వారంవద్దకు వెళ్లాడు. కాని ద్వారాలు మూసి వున్నాయి. పరీక్షించి చూడగా అవి లోపలనుంచి మూసివేయబడినట్లు తెలిసింది. ఈ అడవిలో ఈ సమయాన, లోపల ఎవరో వున్నందుకు అతనికి ఆశ్చర్యమేసింది. తలుపులు తట్టాడు. కాని తెరవబడలేదు. అదేపనిగా బాదటం మొదలుపెట్టాడు. అప్పటికీ లాభం లేకపోయింది. అప్పుడు బాగా బలం వుపయోగించి ద్వారాలను గట్టిగా తోశాడు. దాంతో లోపలి గడియ వూడిపోయి తలుపులు తెరుచుకోబడ్డాయి. దేవాలయంలో ఏ దేవుని విగ్రహం వున్నదో, అక్కడ వున్న మనుషులెవరో, ఆ అంధకారంలో ఏమీ బోధపడలేదు. ఆ కన్పించని దేవుని విగ్రహానికి నమస్కారం చేసి లేచి నిలబడి ‘‘ఎవరక్కడ? దేవాలయంలో వున్నదెవరు?’’ అని బిగ్గరగా కేకవేసి అడిగాడు. కాని సమాధానం రాలేదు. ప్రతిధ్వని మాత్రం విన్పించింది. కాలాన్ని వ్యర్థం చేయడం అతనికిష్టంలేక వెళ్లి తలుపులు మూసి గడియకు బదులు తానే వీపును వాటికి ఆనించి అక్కడే చతికిలపడ్డాడు. ఇక చదవండి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663908552960,"sku":"LJ-ZQVD-DF9I","price":63.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/1b674245.jpg?v=1770616533"},{"product_id":"kapalkundala-rajani-కపాలకుండ-రజని-bankimbabu-novel","title":"Kapalkundala \u0026 Rajani","description":"\u003cp\u003eKapalkundala \u0026amp; Rajani కపాలకుండ \u0026amp; రజని, BY Bankimbabu\u003c\/p\u003e\n\u003cp\u003eఇది రెండువేల అయిదువందల సంవత్సరాల క్రిందటి కథ. మాఘమాసంలో ఒకరోజు రాత్రిపూట, యాత్రికుల నౌక ఒకటి గంగానదిలో ప్రయాణం చేస్తోంది. ఆ రోజులలో దొంగలభయం ఎక్కువ. అంతేగాక పోర్చుగీసువారి భయం కూడా వుంది. అందుచేత యాత్రికుల పడవలు అయితేనేం, ఇతర పడవలు అయితేనేం ఒంటరిగా ప్రయాణం చేయడానికి జంకుతూ వుండేవి. కొన్ని పడవలు కలసి జట్టుగా ప్రయాణం చేసేవి. కాని యీ పడవ మాత్రం యిప్పుడు వంటరిగానే వస్తోంది. దీనికీ కారణం వుంది. అదేమిటంటే, ఈ రాత్రి చివరిజాములో తుఫాను బయలుదేరింది. దిక్కులు తెలియకుండా గందరగోళం యేర్పడుతుంది. ఈ గందరగోళంలో యెక్కడ వున్నదీ, ఎటువైపు పోతున్నదీ తెలియకుండా ఈ పడవ యిటువైపు ప్రయాణం సాగించింది. అంతవరకు వున్న పడవల జట్టునుండి యీ పడవ వేరు అయిపోయింది. ఈ సమయంలో ఈ పడవ యెటుపోతుందో ఎవరూ చెప్పలేరు. పడవలో వున్నవారిలో చాలమంది నిద్రపోతున్నారు. ఒక వృద్ధుడు, ఒక యువకుడు మాత్రం మెలుకువగా వున్నారు. వృద్ధుడు యువకునితో సంభాషణ సాగిస్తున్నాడు. ఇక చదవండి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663914451200,"sku":"X4-IP80-QKLQ","price":54.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/b8846cf8.jpg?v=1770616547"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/collections\/images_fe5deba6-5033-4e92-b5db-810edcc4c92a.jpg?v=1785234993","url":"https:\/\/www.sahithibooks.com\/collections\/bankim-chandra-chatterjee.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}