{"title":"Arikepudi (Koduri) Kousalya Devi","description":null,"products":[{"product_id":"sudakshina-arikepudi-koduri-kousalya-devi","title":"Sudakshina","description":"\u003cp\u003e\u003ca\u003eSudakshina  BY   Arikepudi (Koduri) Kousalya Devi\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eSudhankshina\u003c\/p\u003e\n\u003cp\u003e”……”\u003c\/p\u003e\n\u003cp\u003e”వారానికి ఒక్కసారి ఇంటికి వస్తాను నేను. వచ్చేటప్పటికి ఇల్లు ప్రశాంతంగా ఉంచలేవూ?”\u003c\/p\u003e\n\u003cp\u003eఅతడు అతి మెల్లగా చెబుతున్నా, మాటల పదును ఆమె గుండెల్లో గుచ్చుకుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eఆదమరచి శయనించి ఉన్నామె ఒక్కసారి లేచి కూర్చున్నది.\u003c\/p\u003e\n\u003cp\u003e”ఇది మీరు నన్ను అనవలసిన మాటేనా? మీ సంతోషం కోసం, సుఖంకోసం నేనేమి చేయగలనో అంతా చేస్తానని మీకు తెలుసు!” అంటున్న సీత కంఠం దుఃఖావేశంతో కంపించింది.\u003c\/p\u003e\n\u003cp\u003eప్రేమనగర్ వంటి అమూల్యమైన నవలను అందించి తెలుగు పాఠకులలో ఓ ప్రత్యేక స్థానాన్ని అలంకరింపచేసుకొని తనదైన బాణీతో పాఠకులకు అందిస్తున్న  శ్రీమతి ఆరెకపూడి(కోడూరి) కౌసల్యాదేవిగారి  సుదక్షిణ\u003cbr\u003eతప్పక చదవండి!!\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663865954560,"sku":"AI-ECUK-2FH5","price":35.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Sudakshina.jpg?v=1782551256"},{"product_id":"satyam-sivam-sundaram-arikepudi-koduri-kousalya-devi","title":"Satyam Sivam Sundaram","description":"\u003cp\u003eSatyam Sivam Sundaram  BY   Arikepudi (Koduri) Kousalya Devi\u003c\/p\u003e\n\u003cp\u003e”అయినా నాకెందుకో అనిపించేది. దైవం మనకు సాయం చేస్తాడనీ, ఎప్పటికైనా మీరు నావారౌతారనీ…” అన్నది సుందరి సత్యంతో. సత్యమూర్తి ఎం.ఏ., ఫస్టుక్లాసులో పాసైనా తల్లికి వైద్యం కూడా చేయించుకోలేని దురదృష్టవంతుడు. విధి చాలా విచిత్రంగా అతన్ని ఒక సంపన్న కుటుంబంతో కలిపింది. ఆ యిల్లు పేరుకు యిల్లేగాని అక్కడ మమతలు, అనురాగాలు, ఆప్యాయతలు యేవీలేవు. తల్లిదొకదారి, తండ్రిదొకదారి, పిల్లలొకదారి. తల్లికి హంగులూ, ఆర్భాటాలూ, పార్టీలూ, పెద్దలనబడేవారితో సాంగత్యం. తండ్రి సౌమ్యుడు కావడంవల్ల మనసులోనే వేదనచెందుతూ నిస్సహాయుడై నిర్లిప్తంగా వుండిపోయాడు. విధి ఆ సంసారంతో యెన్నో ఆటలు ఆడింది. వివిధ వ్యక్తులు ఆ యిల్లాలి బలహీనతను స్వార్థానికి ఉపయోగించుకుని సంఘ వ్యతిరేక కార్యకలాపాలలో, అకృత్యాలలో పాలుపంచుకునేలా చేశారు. ఇంత జరిగినా సత్యమూర్తి – సత్యం… శ్రీరామచంద్రుడిలాగా ఆ యింటినీ, ఇంటిలోని వ్యక్తులనూ కడుపులో పెట్టుకొని కాపాడాడు. అంతా తనవారనుకున్న తండ్రీ కూతుళ్ళకోసం. మచ్చలేని అద్భుతవ్యక్తి సత్యమూర్తి. ఒక కుటుంబాన్ని మునిగిపోకుండా రక్షించిన ధీశాలి – ఉత్తముడు. అరుదైన పాత్రచిత్రణతో, పంచవన్నెల మనోహర వర్ణచిత్రంలా సాగిన నవల ‘సత్యం శివం సుందరం’ రచనలో ఉన్నత ప్రమాణాలకోసం కలలుకనే పాఠకలోకానికి సాహిత్య ఎడారిలో ఒయాసిస్లాంటి అందమైన నవల – సత్యం శివం సుందరం\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663867527424,"sku":"C5-TKN9-QVZF","price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Satyam_Sivam_Sundaram.jpg?v=1781958189"},{"product_id":"surya-mukhi-arikepudi-koduri-kousalya-devi","title":"Suryamukhi","description":"\u003cp\u003eSuryamukhi \u003cspan\u003eArikepudi (Koduri) Kousalya Devi\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eపూర్వం ఒక రాజకన్య సూర్యభగవానుని ప్రేమించి అతడిని చేరుకోవాలనే కోరికతో, రోజూ అతడిని చూస్తూ ఆరాధనతో గడిపేదట.  ఆకసం వైపే చూస్తూ సూర్యుడెటు తిరిగితే అటు తిరుగుతూ గడిపి క్రమంగా ఆ తావుననే పూలచెట్టుగా మారిపోయిందట. అరవింద అతి ముగ్ద అయిన కన్య. తల్లిదండ్రులూ సోదరులూ కనురెప్పగా కాచిపెంచిన సుకుమారి. దౌష్ట్యం అనుభవిస్తూ, కాలం పెట్టిన దారుణ పరీక్షలకు గురి అవుతూ, పల్లెత్తి పలుకక, మూగగా బాధ అనుభవించింది. ఆకసాన ఉన్న ఆదిత్యుడు ఒక్కసారైనా తనను కరుణించకపోతాడా అని ఆశతో నిరీక్షించి, నిరీక్షించి సూర్యముఖిలాగే నేలరాలిపోయింది. స్త్రీ కొక న్యాయము, పురుషుడి కొక న్యాయమూ ఎందుకు రాశావని భగవంతుణ్ణి నిలదీసి అడిగేందుకు వెళ్లిపోయింది. హృదయాలను కరిగించి, సానుభూతితో నింపే ఆర్ద్రమైన కథ, అలరించే కథనధోరణి, అత్యుత్తమ పాత్రచిత్రణతో కన్నీళ్లను దోచుకునే నిండైన నవల ”సూర్యముఖి.”\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663871557888,"sku":"FX-0OCG-XD4S","price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/suryamukhiArikepudi_Koduri_KousalyaDevi.jpg?v=1776422605"},{"product_id":"divya-deepavali","title":"Divya Deepavali","description":"\u003cp\u003eDivya Deepavali BY Arikepudi (Koduri) Kousalya Devi\u003c\/p\u003e\n\u003cp\u003eకట్నం వంటి దురాచారాలంటే పడదు దేవకికి. ఆమెకు కొన్ని ఆదర్శాలున్నాయి. ఆ ఆదర్శాల ప్రకారం జీవించాలన్న కోరిక ఉంది. ప్రయత్నమూ చేసింది. అయితే… ”వివాహాత్పూర్వం ఊహించే స్వర్గధామం వేరు, వివాహానంతరం అనుభవాలు చెప్పే అర్థాలు వేరు. అక్కడ వ్యక్తిత్వాలు నిలవవు. ఆదర్శాలకు ఆస్కారం వుండదు. సంసార తాపత్రయంలో ఎటువంటివారైనా సామాన్యులే అయిపోతారు.” అవునా… ఇప్పుడు దేవకి ఏమనుకుంటూంది? ”కట్నం అనేది వ్యక్తి గౌరవాన్ని పెంచుతుందన్నమాట. నేనే కట్నం తెచ్చుకొనివుంటే ఈనాడు వీళ్ళింత నీచంగా విదిలించగలిగేవాళ్ళేనా? పెళ్ళయి రాగానే పుట్టిల్లు పరాయిదైపోతుంది. ఇక వాళ్ళను ‘ఇది కావాలి అది కావాలి’ అని అడిగే స్వతంత్రం పోతుంది. ఈనాడు పైసా పైసాకు భర్తపై ఆధారపడవలసి వచ్చింది” ఇలా ఎలా జరిగింది? తెలుసుకోవాలంటే ఆరికెపూడి కౌసల్యాదేవి దివ్యదీపావళి చదవండి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663872540928,"sku":"GN-TQOX-WHSM","price":42.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Divya_Deepavali.jpg?v=1782550869"},{"product_id":"margadarshi","title":"Margadarshi","description":"\u003cp\u003eMargadarshi   BY   Arikepudi (Koduri) Kousalya Devi\u003c\/p\u003e\n\u003cp\u003e”ఉమ్మడికుటుంబం అనేది ఒక మంచి ఉద్దేశంతో ఏర్పరచారు పెద్దలు. ఏ బరువుభారాలైనా సాధకబాధకాలైనా ఆ సభ్యులందరూ కలిసి భరించి కలిసికట్టుగా బ్రతుకుతారని. కానీ నేటి పరిస్థితుల్లో ఆ సదుద్దేశం మృగ్యమై భార్యా భర్తలను విడదీయడానికి మాత్రమే ఈ ఉమ్మడి కుటుంబాలు గణతికెక్కుతున్నాయి. అంచేత నేను నా భర్తా నేనూ మాత్రమే చిన్న యింటిలో బ్రతికే ఒప్పందంమీద తిరిగి సంసార జీవితంలో ప్రవేశిస్తాను. నా బంధువులూ తలిదండ్రులైనా, అతడి బంధువులూ తలిదండ్రులైనా కేవలం చుట్టుపుచూపుగా రావచ్చు. కానీ ఇక్కడ తిష్ఠ వేయడానికి వీల్లేదు. నేనుకూడా అంతే. వారింటికి వెళ్ళి వుండేది లేదు. ఎందుకంటే నాకు నా అత్తమామలపై సద్భావం లేకపోగా నన్నెప్పుడు చంపుతారోననే భయం నాకింకా వదలలేదు. నేను వారి ఇంటిమీదా, వారి సంపాదనమీదా ఆధారపడాలనుకోవడం లేదు. అత్తమామలు వారింట్లో వారుంటారు. నేను నా కాళ్ళమీద బ్రతకగలను.” పెళ్ళిపేరుతో ఉమ్మడి కుటుంబంలో కాలు పెట్టి ఎన్నో బాధలు అనుభవించి చెప్పిన సత్యాలు ఇవి. ఆ ఇంటి కోడలే వారికి మార్గదర్శి అయి సంసారాన్ని చక్కదిద్దింది. ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి కలం నుండి వెలువడిన మరో అపూర్వ నవల ”మార్గదర్శి”\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663874015488,"sku":"HW-VVJQ-04IF","price":35.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Margadarshi.jpg?v=1782550953"},{"product_id":"shilalu-shilpalu-arikepudi-koduri-kousalya-devi","title":"Silalu Silpaalu","description":"\u003cp\u003eSilalu Silpaalu  BY  Arikepudi (Koduri) Kousalya Devi\u003c\/p\u003e\n\u003cp\u003eSilalu Silpaalu\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e‘చలపతి హిమాలయ శిఖరాలవలె ఉన్నతుడు. తిరుమలగిరి వలె పూజనీయుడు. మామూలు మానవుల అంచనాలకు అందని మహనీయుడు’ అనుకున్నది శైలజ చాలా ఆలస్యంగా…. చలపతి ఆమెను రెండు పాములనుంచి కాపాడాడు. ఒకటి అసలు పాము… మరొకటి మనిషిరూపంలో ఉన్న కొండచిలువ. చాలా స్వతంత్రమైన అభిప్రాయాలతో, నిండైన వ్యక్తిత్వంతో, ధైర్యశాలిగా పెరిగిన శైలజ వ్యక్తులను అంచనావేయడంలో తప్పులు చేయదు. స్త్రీ పెంపకంలో ఉంది అసలు రహస్యం. మనిషి ఉన్నతుడు కావలెనన్నా, అధముడు కావలెనన్నా స్త్రీ చేతిలోనే వుంది. శిలలను మామూలు బండరాళ్ళగానే ఉంచే తల్లులు కొందరైతే, బండరాళ్లను రమణీయ శిల్పాలుగా మలిచే వజ్రమ్మవంటి స్త్రీలు కొందరు. ఆధునిక స్త్రీ జీవితంలో వస్తున్న మార్పులను, స్త్రీ పెరుగుతున్న తీరును వివరిస్తూ స్త్రీ జీవితానికి దర్పణం పట్టిన అందమైన రచన..\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663881650432,"sku":"OM-IQSQ-E7IH","price":42.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Silalu_Silpalu.jpg?v=1782551164"},{"product_id":"kalpavriksham","title":"KalpaVriksham","description":"\u003cp\u003eKalpaVriksham     BY   Arikepudi (Koduri) Kousalya Devi\u003c\/p\u003e\n\u003cp\u003e”ఆలయానవెలిసిన ఆదేవునిరీతీ ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతీ” అన్నాడో సినీ కవి. అది అక్షరాల నిజమయిన మాట. ధనవంతుల కుటుంబాలలో వ్యక్తి స్వేచ్ఛ ఉంటుంది. ఎవరిబ్రతుకులు వారే స్వతంత్రంగా బ్రతకడానికై ఆరాటపడ్తారు. కాని మధ్య తరగతి బ్రతుకులే పెనుభారమయినవిగా ఉంటాయి. పైగా భర్త ఉద్యోగస్థుడయితే ఆర్థిక అవసరాల కోసం గిరిగీసుకొని బ్రతకాల్సి వస్తుంది. భార్య అభిమానవతియై కుటుంబ బారాన్ని గుట్టుగా మోయగలిగితేనే ఆ సంసారం సాఫీగా సాగుతుంది. ఇక తమ ఆడంబరాలకు విలాసాలకు భర్తతో అప్పులు చేయించి, అవి తీర్చలేక జీవితాన్ని నరకప్రాయంగా మార్చుకొంటారు కొందరు. తన భర్త పరువు ప్రతిష్ఠలను కాపాడటానికై అభిమానవతియైన గృహిణి పడే తాపత్రయం ఈ నవలలో కనిపిస్తుంది. ఆరికెపూడి(కోడూరి)కౌసల్యాదేవిగారి కలం సృష్టి ఈ ‘కల్పవృక్షం’ నవల. ఉద్యోగస్థుడయిన మధ్యతరగతి కుటుంబం శేఖర్ది. మూర్తీ భవించిన భారతీయ నారి ప్రభావతి. వారి అన్యోన్య దాంపత్యంలో చెలరేగిన తుఫాను కష్టాలు కన్నీళ్లు అత్త ఆడబిడ్డల ఆరళ్ళు తరువాత సద్దుమణిగిన తీరుని రచయిత్రి సహజంగా చిత్రీకరించారు. ప్రతి మధ్యతరగతి కుంటుంబం తమ కథగా భావించే నవల ఇది తప్పకుండా చదవాల్సిందే.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663881847040,"sku":"OR-OHWM-78K9","price":35.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/KalpaVriksham.jpg?v=1782550918"},{"product_id":"anirvachaneeyam","title":"Anirvachaneeyam","description":"\u003cp\u003eAnirvachaneeyam BY Arikepudi Kousalyadevi KODURI\u003c\/p\u003e\n\u003cp\u003eమానవయంత్ర నిర్మాణం, దానికొచ్చే జబ్బులూ, బాగోగులూ, జననమరణాలూ, వగైరా వివరాలు అన్నీ తెలిసినా, మళ్ళీ మరణం ఎప్పటికప్పుడే క్రొత్తగా, భయంకరంగా కన్పిస్తుంది. ఏమిటిది?…యేమిటిది? ఈ లోకంలోకి వచ్చిన వెంటనే ఎందుకు తిరిగిపోయినట్టు ఆ పసివాడు? అన్నీ తనకే కావాలంటూ స్వంతంచేసుకొని, అందర్నీ వెళ్ళగొట్టుకున్న జయంతి ఈ బిడ్డ నాకేకావాలి, ‘ఈ భర్తనాదీ-పోవను వీల్లేదు’-అని ఎందుకు పట్టుకోలేకపోయింది, యేమిటీ మరణాల ఆవలితీరం? ”అంతగా యిహంలో అభిమానం విడచి ప్రాకులాడిన భాస్కర్ అంత త్వరగా-యేమీ పూర్తిగా అనుభవించకుండానే పరంలోకి ఎందుకు పారిపోయాడు? యేమిటీ మృత్యువు శక్తి? ”మానవుడు మృత్యువును జయించలేక లొంగిపోవటం సరే. కాని ఎందుకింత మాయాజాలంలో చిక్కుకొని బ్రతుకుతున్నాడు? అశాశ్వతమైన సుఖైశ్వర్యాలకోసం తెలిసీ కొట్టుమిట్టాడుతాడు. తప్పదని తెలిసీ మృత్యువుకు తయారుకాడు….! ఈ మృత్యువే లేకపోతే మానవులు యింకా అన్యాయాల్ని అధికంచేసి, మెత్తటివాళ్ళని బాధించి తామే రాజ్యమేలుదురు! మనిషిని అదుపులోపెట్టి, బంధించి లాక్కుపోయే ఈ మరణమెంత అనిర్వచనీయమైనది! సుప్రసిద్ధ రచయిత్రి  శ్రీమతి ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి రచన\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663883419904,"sku":"QE-FKH3-ALS5","price":40.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Anirvachaneeyam.jpg?v=1782545261"},{"product_id":"dikchakram-arikepudi-koduri-kousalya-devi","title":"Dikchakram","description":"\u003cp\u003e\u003ca\u003eDikchakram Arikepudi (Koduri) Kousalya Devi \u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003ca\u003eదిక్చక్రం \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=%E0%B0%86%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95%E0%B1%86%E0%B0%AA%E0%B1%82%E0%B0%A1%E0%B0%BF%20(%E0%B0%95%E0%B1%8B%E0%B0%A1%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF)%20%E0%B0%95%E0%B1%8C%E0%B0%B8%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B0%BF\"\u003eఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eఆకాశమూ, భూమి కలుస్తున్నట్లు అనిపించే ఆ చోటు – దిక్చక్రం. ఎంత పరుగెత్తినా దూరంగానే వుంటుంది. ప్రేమ వెంట పరుగులు పెట్టడం కూడా అటువంటిదే. మాధవ్, కాంచనలిద్దర్నీ పెద్దలు చిన్నప్పటినుంచీ భార్యాభర్తలన్నారు. కాని మధ్యలో అంతస్తులు మారాయి. మాధవ్ నిరుద్యోగి అయితే, కాంచన సంపన్నురాలైంది. చిన్నప్పటినుంచీ వారిని భార్యాభర్తలన్న పెద్దలే వారు అన్యోన్యంగా వుంటే సహించలేకపోయారు. ఆవేశాలు పెరిగాయి. మాధవ్ ప్రయోజకుడై తిరిగివద్దామని దేశాలవెంట పోయాడు. అతని పని బూరెల గంపలో పడ్డట్టయింది. కోటీశ్వరుడి ఆదరణ సంపాయించాడు. ఇక్కడ కాంచన జీవితంలో మరొక అధ్యాయం మొదలైంది. మాధవ్ను చచ్చినవారిలో జమకట్టి ఆమె మనస్సు విరిచి పెళ్ళిచేశారు. ఆమె భర్త గోపాల్ సార్థకనాముడు. కాంచన వైవాహిక జీవితం కన్నీటిమయమైంది. ఆమె ఓర్పూ, సహనమూ ఏమీ అక్కరకు రాలేదు. ఇటు కాంచన జీవితంలో హాలాహలం! మల్లెపువ్వులాంటి ఆమె జీవితం మాడి మసైపోయింది. ఇంత జీవిత నాటకంలోనూ, ఎన్నో అపోహలు, అనుకోని మలుపులతో ఊపిరాడనీయక ఏకబిగిన చదివించే రచన – దిక్చక్రం\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663890628864,"sku":"WL-15DC-UEJT","price":28.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/dikchakram_koduri_kousalya_devi.jpg?v=1772453120"},{"product_id":"santhinikethan-arikepudi-koduri-kousalya-devi","title":"Santhinikethan","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eShanthinikethan by \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Arikepoodi(Kowdoori)Kowshyalya%20Devi\"\u003eArikepudi (Koduri) Kousalya Devi \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eశాంతినికేతన్ \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=%E0%B0%86%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95%E0%B1%86%E0%B0%AA%E0%B1%82%E0%B0%A1%E0%B0%BF%20(%E0%B0%95%E0%B1%8B%E0%B0%A1%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF)%20%E0%B0%95%E0%B1%8C%E0%B0%B8%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B0%BF\"\u003eఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003esanthiniketan\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eఈ లోకంలో కన్ను విప్పింది మొదలు గారాల పట్టిగా పెరిగి, లోకజ్ఞానం తెలిసీ తెలియని అపరిపక్వ మనస్కయైన ఒక కన్య తొలి ప్రేమానుభవాల దాగుడుమూతల ప్రణయగాథ. సాధారణ కుటుంబాలలోని పిన్నలకూ, పెద్దలకూ, అందరుకూ అన్నిటా ఎదురయ్యే సంయుక్త సమస్యాతోరణం. తన ఓర్పూ విజ్ఞానలతో మనుష్యులలో మార్పును, మంచినీ తేగలిగిన ఆదర్శ మహిళా, జ్ఞానమూర్తి కథానాయకిగా… తన విధ్యుక్త ధర్మాల నెరిగి ప్రవర్తించి, సదా సుధావర్షాలు కురిపించుతూ పాషాణ హృదయులలో కూడా పరివర్తన తీసుకు రాగలిగిన అమృతమూర్తి కథానాయకుడుగా… నెమ్మదిగా, నిదానంగా సాగిన ప్రశాంతి నిర్ఘరిణి, ఇదీ శాంతినికేతన్.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663898198272,"sku":"41-TMWC-7QKT","price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/780faaca.jpg?v=1770616508"},{"product_id":"badanika","title":"Badhanika","description":"\u003cp\u003eBadhanika  BY  Arikepudi (Koduri) Kousalya Devi\u003c\/p\u003e\n\u003cp\u003e”భగవాన్! ఈసారైనా దయదలచు. నా మొర ఆలకించు. నా ప్రాణాలు పోయినాసరే, వంశాంకురం నిలబడితే చాలు” మరణయాతనను మించిన ప్రసవవేదన పడుతూ, రొప్పుతూ భగవంతుని వేడుకొంటూన్నది స్వర్ణమంజరీదేవి. ”విూరు గతాన్ని ఇప్పుడేమాత్రమూ తలపెట్టవద్దు తల్లీ, మనస్సును నిర్మలంగా వుంచుకోండి” దాసీ అనునయస్వరంతో హితోక్తులు పలుకుతున్నది. తన గదిలో క్షణమొక యుగంగా గడుపుతున్నాడు మధుసూదనరావు. మెత్తని ముఖమల్ పరుపుతో అలకరింపబడిన అందమైన పాన్పు ఆ సమయాన అతడి దేహానికి అంపశయ్యయైతోచింది. ఎవరొచ్చి ఏం చెపుతారోనన్న ఆత్రంతో క్షణమొక యుగంగా నిరీక్షిస్తూ సతమతమౌతున్నాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663899771136,"sku":"70-3URB-AFH7","price":32.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Badanika.jpg?v=1782545343"},{"product_id":"shankuteerdham-arikepudi-koduri-kousalya-devi","title":"SHANKUTEERDHAM","description":"\u003cp\u003eSHANKUTEERDHAM   BY  Arikepudi (Koduri) Kousalya Devi\u003c\/p\u003e\n\u003cp\u003eShankuteertham\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eమాతామహుల ఊళ్ళో ఉద్యోగం వచ్చింది అతనికి. ఆ ఊరు వెళ్ళటం అతని తల్లికి సుతరామూ ఇష్టంలేదు. మొదటిసారిగా పోస్టింగ్. ఆ వూరు వెళ్ళక తప్పలేదు వారికి. ఆ ఊళ్ళో వారికి తక్కువ బలగంలేదు. గ్రామపెద్ద, పెత్తందారు చిన్న అన్న. ఆ అన్నకో ముద్దులబంతి కూతురు. సౌందర్యంలో, చలాకీతనంలో ఆమెకు ఆమేసాటి. వాటిని మించిన అతిశయమే ఆమె ఆభరణం. పెద్ద అన్న పరమ సాత్వికుడూ, దైవచింతన కలవాడూనూ. ఆయనకు ఒక్కతే కూతురు. బాహ్యరూపంలో వెలితివున్నా గొప్ప సుగుణాల ఖని. సహజంగా చెడుని ఎదురించే అతని స్వభావానికి, గుళ్ళోలింగంతో సహా స్వాహాజేసే మేనమామకూ ఘర్షణ తప్పలేదు. పదిమందికీ జరిగే ప్రతిమంచిపనికీ ఎన్నో అడ్డంకులు, బలవంతుల పన్నాగాలు, ధనవంతుల దౌర్జన్యాలు. వారి ముందు మంచితనానికి మారు పేరయిన అతను నిలుస్తాడా? అతనిని అమితంగా ప్రేమించే మేనకోడళ్ళలో ఎవరు ఆప్తులవుతారు? గ్రామీణ జీవితాన్ని అతి స్పష్టంగా, సూటిగా చెప్పిన నవల. \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663901802752,"sku":"AQ-B0OS-CS8W","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/SHANKUTEERDHAM.jpg?v=1782551085"},{"product_id":"arikepudi-kouslyadevi-kathalu","title":"Koduri Kathalu","description":"\u003cp\u003eARIKEPUDI KOUSaLYADEVI KATHALU BY ARIKEPUDI KOUSLYADEVI\u003c\/p\u003e\n\u003cp\u003eమాయ, కల్పన, ప్రమిద, 1+1=1, పరిత్యక్త, పంకజం, శోభకృతు, సుప్రభాతం, దేవాలయం, కాత్యాయని, కదంబమాల, ఆశాకిరణాలు, తీయనిబాధ, భవిష్యత్కవిత, తీయనిశాపం, ఆశ్రయబంధం, దూరపుకొండలు, మలయ పవనాలు, శ్రీనివాస కళ్యాణం, గురువిందగింజలు, పిల్లలూదేవుడూ చల్లనివారే, అమ్మమ్మగారూ-ఆపిల్ చెట్టూ మొదలైన కమ్మని కథల సమాహారం ఈ అరికెపూడి కథలు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663902359808,"sku":"C0-771R-JIIV","price":240.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/6b65a2c7.jpg?v=1770616517"},{"product_id":"chakranemi","title":"Chakranemi","description":"\u003cp\u003eChakranemi BY  Arikepudi (Koduri) Kousalya Devi\u003c\/p\u003e\n\u003cp\u003eOne of the most succesful novels of Arikapudi Kausalya about a heart touching love saga of a couple\u003c\/p\u003e\n\u003cp\u003eఅతను కుటుంబ బాధ్యతల్లో తలమునకలయిన వ్యక్తి – ఆనందమయమయిన జీవితానికై అపురూపమయిన కలల్ని మనస్సులో పేర్చుకుంటున్నా – జీవితం ఒక పెద్ద సవాలు అయి అతనిముందు నిలిచింది. దాని నుంచి తప్పించుకొనే మార్గం లేదు - ఆమె ఆగర్భ శ్రీమంతురాలు. బాధ్యతలు, బాదరబందీ లేకుండా స్వచ్ఛమయిన గులాబి పువ్వులాగ ఈ లోకంలో కన్ను విప్పింది. మమతా మాధుర్యాలను కురిపించగల ఆత్మీయుల నీడల్లో అల్లారుముద్దుగా పెరిగింది - అతని తల్లి సనాతన సంప్రదాయల నుండి వేరుపడలేక అదే ప్రపంచమని నమ్మిన పాతకాలపు మనిషి - ఆమె తండ్రి ఆధునిక ప్రపంచానికి ప్రతినిధి. మారే ప్రపంచానికి మారుతున్న కాలానికి అతని జీవితం సజీవ నిదర్శనం - ఈ పాత కొత్తల మేలుకలయికగా, వారి ఇద్దరి జీవితాలూ ముడిపడ్డాయి. వారి ప్రేమానురాగాల విశ్వరూపమే – చక్రనేమి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663903113472,"sku":"D5-PKIG-8IN1","price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Chakranemi.jpg?v=1782545467"},{"product_id":"chakravaakam-by-koduri-koushalya-devi","title":"CHAKRAVAKAM","description":"\u003cp\u003eCHAKRAVAKAM BY Arikepudi (Koduri) Kousalya Devi \u003c\/p\u003e\n\u003cp\u003eఒక మధురాతిమధురమయిన క్షణంలో ఏవో అపూర్వ స్మ ృతుల్ని రేపే చక్రవాకంలాగ అతని జీవితంలో ప్రవేశించింది రాణి. మనస్సును ఆకట్టింది. తన్మయుడిని చేసింది. అతనికి ఒకటే మనస్సు, ఆ మనస్సులో రాణికే తప్ప మరే ఇంద్రాణికీ చోటులేదు. ఉండకూడదు. కాని – అసలు మనసే లేని అతని వదినె… ఇదివరకే అంకితమయిన అతని మనస్సులో ఇంద్రాణిని యిరికించాలని శతథా ప్రయత్నించింది. ఉచ్చులు పన్నింది. ఉద్రేకాలను రెచ్చగొట్టింది. మంచు కమ్మింది. కాని మాటతప్పని, మనస్సువిప్పని అతనిముందు ఆ ప్రయత్నాలన్నీ రిచ్చ వోయాయి. ఆమె మహంకాళి అయింది. అందరి జీవితాలను అస్తవ్యస్తం చేసేసింది. రెండు కుటుంబాలు ఊహించలేని ఆపదల అధఃపాతాళంలోకి జారిపోయాయి. అమృతభాండమయిన అతని మనస్సులో లేశమాత్రంగా అపశృతి పలికింది. మరి రాణి తన అసమానమాధుర్యంతో అతని జీవితాన్ని ఎలా శ్రుతి కలిపింది? ఆమె కన్న తీయనికలలు ‘చక్రవాకం’లాగా గతకాలపు అనుభవాల స్మ ృతులుగానే మిగిలిపోతాయా? – ఈ ప్రశ్నలకు రెచ్చిపోయే కార్చిచ్చులాగా సరసరా సాగుతూ – గుండెల్ని పిండేసే ‘చక్రవాకం’ నవల చక్కటి సమాధానం.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663910420736,"sku":"PB-8D0O-UTCX","price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/CHAKRAVAKAM_Koduri_Koushalya_Devi.jpg?v=1782539986"},{"product_id":"dharma-chakram","title":"Dharmachakram","description":"\u003cp\u003eDharmachakram BY Arikepudi (Koduri) Kousalya Devi\u003c\/p\u003e\n\u003cp\u003e”ఈ ప్రపంచమే ఒక పెద్ద బందిఖానా. భూమిపైపడిన దగ్గర నుండి ఎదురయ్యే కష్టసుఖాలన్నిటినీ మౌనంగా అనుభవించడమే కాని, ‘మనము ఏం చేసి ఇలా అనుభవిస్తున్నాము’ అని ప్రశ్నించుకుంటే ఎవరికీ జవాబు దొరకదు. కాని అందువల్ల మనసు పాడుచేసుకొని రాటుదేలిపోయి కక్షా, క్రౌర్యాలతో రాక్షసత్వం అలవరచుకోకుండా, మనం ఎంతవరకు మన విధినిర్వహణ చేస్తున్నాము, ధర్మమార్గాన నడుస్తున్నామా? అని ఆలోచించుకొని, ముందు వెనకల యోచనతో ప్రవర్తించడంలో మనకూ, మన చుట్టుపట్లవారికీ కూడా సుఖం వుంటుంది.” నీతి, ధర్మం, న్యాయమంటూ బ్రతికిన ఈ మనుషులకు చివరికి ‘ధర్మచక్రం’ ఎలా లభించింది? తెలుసుకోవాలంటే ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి కలం నుంచి వెలువడిన మరో అద్భుతకావ్యం ‘ధర్మచక్రం’\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663913042176,"sku":"UL-KRCR-G4YZ","price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Dharma_Chakram.jpg?v=1782550482"},{"product_id":"premanagar-premanagar-arikepudi-koduri-kousalya-devi-nbsp","title":"Premnagar","description":"\u003cp\u003e\u003ca\u003ePremnagar Arikepudi (Koduri) Kousalya Devi \u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003ca\u003eప్రేమనగర్ \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=%E0%B0%86%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95%E0%B1%86%E0%B0%AA%E0%B1%82%E0%B0%A1%E0%B0%BF%20(%E0%B0%95%E0%B1%8B%E0%B0%A1%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF)%20%E0%B0%95%E0%B1%8C%E0%B0%B8%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B0%BF\"\u003eఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003ePremnagar\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eఆకాశంలో అనూహ్యమయిన పరిస్థితుల్లో త్రాగుబోతుగా పరిచయమయిన అతనికి సేవలుచేసి భూమికి దింపింది ఆమె. ఆపదలో దురూహ్యమయిన యిబ్బందులలో ఇరుక్కున్నప్పుడు ఆమెకు ఆపద్బాంధవుడయి రక్షణ కల్పించి యింటికి చేర్చాడు. మంచి చెడుల సమ్మేళనంగా కనిపించే ఆ వ్యక్తికి అనుకోనివిధంగా కార్యదర్శి అయింది ఆమె. కార్యదర్శి మాత్రమే కాకుండా క్రమంగా అతని జీవన మార్గదర్శి కూడా అయింది. అతని తల్లి సానుభూతిని సంపాదించుకొంది. అతని అన్న చేసిన అన్యాయం ఫలితంగా సంక్రమించిన ఆస్తిపాస్తుల్ని సంస్కరించి పాడుపడిన అతని ఎస్టేటుకి ఒకరూపం కల్పించింది. అతని జీవితాన్నే ఒక పవిత్రమయిన దేవాలయంగా మలచింది. కాని – పెళ్ళి ప్రసక్తి వచ్చేసరికి ఆమె అంతస్థు చాలలేదు. ఆత్మాభిమానంతో అతని జీవితంలోంచి ఆనందంగా శలవు తీసుకొన్న ఆమె నిశ్చయానికి ఖిన్నుడయిపోయాడు అతడు. తియ్యని ఆమె జ్ఞాపకాలకు చిహ్నంగా, ఆమె ప్రేమాభిమానాలకు ప్రతీకగా ‘ప్రేమనగర్’ను నిర్మించాడు. బాధల, బాధ్యతల మధ్య అతలాకుతలమయిన ఆమె ‘ప్రేమనగర్’ ఎలా చేరుకుంటుంది? విడిపోయిన జీవితాల పర్యవసానమేమిటి? అంతస్థు – అభిమానాల అపూర్వసంఘర్షణలతో చక్కటి చిక్కటి కథాగమనంతో సాగిన మ¬న్నత నవల ‘ప్రేమనగర్’\u003c\/p\u003e\n\u003c\/div\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48096898056448,"sku":null,"price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/PremaNagar_k_kousalya_devi_Telugu_books.jpg?v=1773317740"},{"product_id":"bhagyachakram-arikepudi-koduri-kousalya-devi","title":"Bhagyachakram","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eBhagyachakram Arikepudi (Koduri) Kousalya Devi \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eభాగ్యచక్రం \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=%E0%B0%86%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95%E0%B1%86%E0%B0%AA%E0%B1%82%E0%B0%A1%E0%B0%BF%20(%E0%B0%95%E0%B1%8B%E0%B0%A1%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF)%20%E0%B0%95%E0%B1%8C%E0%B0%B8%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B0%BF\"\u003eఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003e”నాకు కట్నంయిచ్చి వివాహం చేయ నిశ్చయించారా నాన్నా? అది నా ఆదర్శానికి వ్యతిరేకమని తెలిసీ, ఎందుకీ పనిచేశారు? పైగా అది నా నుండి రహస్యంగా దాచిపెట్టారా?” ”హుఁ! ఎంతటి బ్రతుకు బ్రతికినా, ఎంతటి ఉద్యోగాలు చేసి ఊళ్ళేలినా, ఆడపిల్లను కనడంతో తండ్రులిలా దిగజారిపోతారు కాబోలు!” స్వగతంగా అన్నట్లే అన్నది శ్రీలక్ష్మి పైకి అందరికీ విన్పించేట్లుగానే. ”నేను చదువుకుంటున్నాను. త్వరలోనే డాక్టర్నై ప్రయోజకురాల్ని కాబోతున్నాను. నా నీడనే పదిమందిని బ్రతికింపజేయ గలదాననౌతున్నాను. రూపానికి లోటులేదు, గుణానికి లోటు లేదు. మరి మారని వస్తువులాగా నెత్తిన యింత సొమ్మువుంచి మరీ శనిని వదిలించుకున్నట్టు వదిలించుకో జూస్తున్నారంటే ఏమనుకోను? లేక నా నీతి నిగ్రహాలపై మీకు నమ్మకం లేదా?” చదువు, అందం, తెలివితేటలు అన్నీ వున్న యువతి శ్రీలక్ష్మి. ధనదాహం గల శ్రీపతి కుమారునితో పెళ్ళి నిశ్చయమై ‘కట్నం’ వద్ద వచ్చిన పేచీ వలన ఆత్మాభిమానంతో ఆ సంబంధం వదులుకుంది. తరువాత ఆమె జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? ఆమె జీవిత ‘భాగ్యచక్రాన్ని’ ఎలా అందిపుచ్చుకుంది. తెలియాలంటే ఆరికెపూడి(కోడూరి) కౌసల్యాదేవి కలం నుంచి వెలువడిన ‘భాగ్యచక్రం’ నవలని - తప్పక చదవండి!\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e\n\u003c\/div\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48096900972800,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Bhagyachakram.jpg?v=1772453627"},{"product_id":"chakrabramanam-arikepudi-koduri-kousalya-devi","title":"Chakrabramanam","description":"\u003cp\u003eChakrabramanam by Arikepudi (Koduri) Kousalya Devi \u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=%E0%B0%86%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95%E0%B1%86%E0%B0%AA%E0%B1%82%E0%B0%A1%E0%B0%BF%20(%E0%B0%95%E0%B1%8B%E0%B0%A1%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF)%20%E0%B0%95%E0%B1%8C%E0%B0%B8%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B0%BF\"\u003eచ్రకభ్రమణం ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48096905691392,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/chakrabrahmanam.jpg?v=1772453957"}],"url":"https:\/\/www.sahithibooks.com\/collections\/arikepudi-koduri-kousalya-devi.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}