{"title":"Adivi Baapiraju","description":null,"products":[{"product_id":"konangi-adivi-baapiraju","title":"Konangi","description":"\u003cp\u003e\u003ca\u003eKonangi by \u003c\/a\u003eAdivi Baapiraju \u003ca\u003eకోనంగి \u003c\/a\u003e\u003ca\u003eఅడివి బాపిరాజు\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eతన పెద్ద కళ్ళెత్తి ''నే నందంగా లేనా?'' అని ప్రశ్న వేసింది.\u003cbr\u003e''నువ్వు అందానికే అచ్చుతప్పులు దిద్దేటంత అందంగా ఉన్నావు.''\u003cbr\u003e''నువ్వు కోటు మార్చుకోలేదేమి?''\u003cbr\u003e''మార్చుకొన్నా! అంటే తిరిగి మార్చాను. అంటే మార్చినంతపని చేశాను. ఉన్నది ఒక్కకోటే అవడంచేత, ఒకమాటు విప్పి తొడగడం చేతనే, మార్చినట్లు! సబ్ కలెక్టరును మార్చమని ప్రజలు ప్రభుత్వానికి అర్జీ పెట్టితే, అతన్ని ఆ జిల్లాకే కలెక్టరుగా వేస్తే ఎంతో బాగా మార్చినట్లే గదా!''\u003cbr\u003e''నువ్వు చెప్పింది నిజమే కోనంగిరావ్!''\u003cbr\u003eఇద్దరూ టీ తాగారు. బయలుదేరి వెళ్ళి కారెక్కి సినిమాకు వెళ్ళారు.\u003cbr\u003eఅంతకుముందే సీతాదేవి మూడురూపాయల టిక్కెట్లు రెండు తెప్పించి ఉంచింది. ''నువ్వు నా అతిథివి కోనంగిరావూ!'' అని ఆమె అంది.\u003cbr\u003e''కాకపోరునా మన పర్సు ఖాళీగా, సీతాదేవీ!''\u003cbr\u003e''అన్నీ గమ్మత్తుమాటలే నీవి!''\u003cbr\u003e''నిజం చెబుతున్నాను.''\u003cbr\u003e''నేను నమ్మను.''\u003cbr\u003e''నువ్వు దగ్గిరుంటే నాకూ నమ్మకంలేదు.''\u003cbr\u003e''నువ్వు చాలా ధనవంతుడవని మా డాడీ చెప్పాడు''.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMSCO Books","offers":[{"title":"Default Title","offer_id":47663856124160,"sku":"1X-7S5W-XFOC","price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/konangi_book_in_telugu.jpg?v=1780381860"},{"product_id":"himabindu-adivi-baapiraju","title":"Himabindu","description":"\u003cp\u003eHimabindu by \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Adivi%20Bapiraju\"\u003eAdivi Baapiraju \u003c\/a\u003e\u003cspan style=\"font-size: 0.875rem;\"\u003eహిమబిందు \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E0%B0%85%E0%B0%A1%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BF%20%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%81\"\u003eఅడివి బాపిరాజు\u003c\/a\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan style=\"font-size: 0.875rem;\"\u003eకృష్ణవేణి ప్రవాహమున నీడ చూచుకొనుచున్న శ్రీ ధాన్యకటక దుర్గాధిలక్ష్మికి, వణిక్సార్వభౌముడగు చారుగుప్తుని మహాసౌధము శ్రవణావతంసమై విరాజిల్లుచుండెను. అచట కిన్నూరు ధనువుల దూరమందున్న మహాసంఘారామచైత్యమును, చారుగుప్తుని సౌధమును చక్కదనమున నక్కా సెల్లెండ్రవలె నున్నవి. నున్ననై నిగనిగలాడుచూ పాలరాతిగోడలపై చిత్రించిన బుద్ధదేవ జాతక గాథలతో నలరారు చారుగుప్తప్రాసాదము కనులు చల్లజేయుచూ రూపెత్తిన శిల్పలక్ష్మివలె నున్నది.\u003cbr\u003e\u003cbr\u003eచారుగుప్తుడానాడు వ్యాఘ్రాజినము పఱచిన దంతపుబీటపై నధివసించి, తూలికోపధానములపై నొఱగి, గోష్ఠపాలకుడగు నింద్రగోపునితో సంభాషించుచుండెను.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan style=\"font-size: 0.875rem;\"\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663866773760,"sku":"BK-DUZ9-USBS","price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/himabindu.jpg?v=1780381454"},{"product_id":"jajimalli-adivi-baapiraju","title":"Jajimalli","description":"\u003cp\u003eJajimalli by \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Adivi%20Bapiraju\"\u003eAdivi Baapiraju \u003c\/a\u003eజాజిమల్లి \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E0%B0%85%E0%B0%A1%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BF%20%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%81\"\u003eఅడివి బాపిరాజు\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eపువ్వులను చూస్తే ఆనందపడని బాలిక ఎవరు? పువ్వులు జన్మ చాలించి పూబోడులై పుడతాయో, పూబోడులే అవతారాలు చాలించి పూవులై పుడతారో! పద్దాలు చిన్న బాలిక. వాళ్ళింటి దగ్గరవున్న నాగమల్లి చెట్టు పువ్వులు వానాకాలంలో జల్లులు జల్లులుగా రాలుతూన్నప్పుడు, తెల్లవారుతూనే లేచి, ఆ చిరిగిపోరున తాటాకు బుట్టలో పోగుచేసి ఏవేవో అర్థంకాని, అర్థానికి అతీతమైన చిన్న బిడ్డల వెర్రిపాటలు పాడుకుంటూ పోగుచేసేది. 'అమ్మా! రుయాళ ఎన్ని పూవులు దొరికాయో! ఏంటనుకున్నావు. ఈయేళ ఈ పువ్వులన్నీ ఎట్టి జడేసుకుంటానమ్మా!' అని వాళ్ళ పూరిగుడిసెలో గంతులు వేసేది.\u003cbr\u003e'మల్లెలు మల్లెలు కాడల మల్లెలు\u003cbr\u003eజల్లులు జల్లులు తెల్లని మల్లెలు'\u003cbr\u003eఅని ఓ పాట సంపూర్ణమైన యాసతో పాడుతూ ఆ బుట్టను తన హృదయానికి అదుముకొని 'ఓ లమ్మా! జడయెయ్యవంటే?' అని తల్లిని ప్రశ్నించింది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663875162368,"sku":"IO-9TMY-9YHE","price":50.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/jajimalli.jpg?v=1780382206"},{"product_id":"gona-gannareddy-adivi-baapiraju","title":"Gona Gannareddy","description":"\u003cp\u003eGona Gannareddy By \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Adivi%20Bapiraju\"\u003eAdivi Baapiraju\u003c\/a\u003e  గోనగన్నారెడ్డి \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E0%B0%85%E0%B0%A1%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BF%20%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%81\"\u003eఅడివి బాపిరాజు\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eఆదవోని రాజ్య పరిపాలకుడు ప్రతాపాదిత్య, ప్రచండవిక్రమ, పరగండ భైరవ, అశ్వసాహిణి శ్రీకోటారెడ్డి దేవర మహామండలేశ్వరుడు శ్రీ విశాలాక్షి దేవీపూజానిరతురాలగు తన కుమార్తె అన్నమదేవిని, వర్ధమాన మండలేశ్వరుల కుమారునికి వివాహముచేస్తూ ఉన్నారు. ఈ రెండు రాజ్యాలనూ ఏకం చేసే ఈ శుభలగ్నానికి అప్పుడే త్రైలింగ మహా సామ్రాజ్యానికి సార్వభౌములైన శ్రీశ్రీ రుద్రదేవచక్రవర్తియు, మహామంత్రులైన శ్రీ శివదేవయ్య దేశికులును, సర్వసైన్యాధ్యక్షులైన శ్రీ జన్నిగదేవ మహారాజులుంగారును బహుమతులు, ఆశీర్వాదాలు సేనాధికారుల ద్వారా పంపించియున్నారు.\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663882830080,"sku":"PV-73Z5-M5J2","price":190.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Gona_Gannareddy.jpg?v=1777723905"},{"product_id":"narayanarao-adivi-baapiraju","title":"Narayanarao","description":"\u003cp\u003eNarayanarao by \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Adivi%20Bapiraju\"\u003eAdivi Baapiraju  \u003cb\u003eఅడివి బాపిరాజు \u003c\/b\u003e\u003c\/a\u003e\u003cspan style=\"font-size: 0.875rem;\"\u003eనారాయణరావు\u003c\/span\u003e\u003cspan style=\"font-size: 0.875rem;\"\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e'ఓరీ, వెర్రివాడా! వాంఛా? మన యీ అల్పజీవితములలో సరియైన మార్గాన్ని నడచినట్లయితే వాంఛే ఉన్నతమైంది అవుతుంది. నీ భార్య కానున్న యామెను వాంఛించుట ఎలాటి తప్పు? సరే యిష్టపడ్డావు. నీకు ప్రేమ, సంతోషం మాటలచేగాక చేతలచే చూపిస్తే సిగ్గు. అయినా నిన్ను కౌగిలించుకుంటున్నా!'' యనెను. నారాయణరావు హృదయం వేయి పాలసముద్రముల మునిగినట్లయినది. తత్క్షణమే యాతడు శ్యామసుందరీదేవికి బెద్దయుత్తరము వ్రాసినాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663884009728,"sku":"QQ-V0YX-ZP5F","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/012f43a9.jpg?v=1770616481"},{"product_id":"tupanu-adivi-baapiraju","title":"Tupanu","description":"\u003cp\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Adivi%20Bapiraju\"\u003eTupanu By Adivi Baapiraju \u003cb\u003eతుపాను\u003c\/b\u003e \u003cb\u003eఅడివి బాపిరాజు\u003c\/b\u003e\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cdiv\u003e\n\u003cdiv\u003eఇంత మహాశక్తి అతనికి ఉన్నా, అతనిలో ఒక పెద్ద లోటు ఉన్నది. నిశాపతిరావు పౌరుషంలో మార్దవం లేదు. అతనికి స్త్రీలు భోగవస్తువులు మాత్రం అనుకుంటాడు. 'ఎలాంటి కౌశల్యము గలిగిన స్త్రీ అరునా, ఎలాంటి విజ్ఞానవతి అరునా, ఎంతటి విద్యావంతురాలైనా అలాంటి స్త్రీ మరింత ఉత్తమమైన భోగవస్తువుగా మాత్రమే అవుతుంది' అని అతని వాదం. ఇట్టి తుచ్ఛపశుత్వభావం కలిగి ఉండడంచేతనే పురుషుడరున నిశాపతికిన్నీ, గానమూర్తియైన నిశాపతికిన్నీ సగమెరుక. స్త్రీని ముట్టుకుని గొంతుక యెత్తలేడు. గొంతుక సారించి స్త్రీని ముట్టుకోలేడు. స్త్రీ స్పర్శమాత్రాన అతను పశువైపోతాడు. ఒళ్ళు వణికిపోతుంది. మధుపానమత్తునిలా కళ్ళు కెంపులెక్కి తూలిపోతాడు. కొంకర్లుపోయే అతని వేళ్ళు వనితావక్షాలపైకి, ఊరువులపైకి వాలబోతారు.\u003c\/div\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663885811968,"sku":"SD-A7IO-F3IP","price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/tupanu.jpg?v=1780381743"},{"product_id":"narudu-adivi-bapiraju","title":"Narudu","description":"\u003cp\u003e\u003ca\u003eNarudu by \u003c\/a\u003eAdivi Baapiraju\u003c\/p\u003e\n\u003cp\u003e\u003ca\u003eనరుడు \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E0%B0%85%E0%B0%A1%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BF%20%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%81\"\u003eఅడివి బాపిరాజు\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e''సంసారం సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త! జాగ్రత్త!''\u003cbr\u003e''విద్య యొసగును వినయంబు! వినయమునను బడయుఁ బాత్రత!''\u003cbr\u003e''జీవితం ఒక స్వప్నం వంటిదయ్యా!''\u003cbr\u003e''జ్ఞానం లేని మనుష్యుడు పశువుతో సమానం!''\u003cbr\u003eఈలాంటి రత్నాలు అవధాన్లుగారి నోట ఎన్ని వస్తూ ఉండేవో! ఇవన్నీ మాదిగ చంద్రయ్య జీవితంలో అంకితమరుపోయారు.\u003cbr\u003eఅందుకనే చంద్రయ్య కొడుకును ఊళ్ళో ఉన్న కిరస్తానీ బడికి పంపాడు. కిరస్తానీ బడుల ముఖ్యోద్దేశము కిరస్తానీ మతాన్ని లోకంపై చల్లడమే. ఏది ఉద్దేశమరుతేనేమి విద్య ఏదోరకంగా ప్రవహిస్తోంది. ఆ ప్రవాహం నీరు స్పష్టమరున జలం కానేకాదు. ఏ పాఠశాలలోనరునా నిర్మల విద్యానీరాలు ప్రవహిస్తున్నారు గనుకనా! స్థానిక ప్రభుత్వసంస్థలు నెలకొల్పిన ప్రాథమిక పాఠశాలలోనూ అంతే, వీథులలోనూ అంతే!\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47689628680448,"sku":null,"price":50.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Narudu.jpg?v=1780382865"},{"product_id":"amsumathi-adivi-baapiraju","title":"Amsumathi","description":"\u003cp\u003e\u003ca\u003eAmsumathi by \u003c\/a\u003eAdivi Baapiraju\u003c\/p\u003e\n\u003cp\u003eఅంశుమతి \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E0%B0%85%E0%B0%A1%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BF%20%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%81\"\u003eఅడివి బాపిరాజు\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eశ్రీ ఆంధ్ర సామ్రాట్టు వేంగీమహానగర స్వామి, మహారాజు మంచన భట్టారకదేవుని ఏకైక పుత్రిక అంశుమతీ కుమారి గోవూరు గోపాద క్షేత్రమునందు స్నానము చేయుచున్నది. ఆ బాలికతో పాటుగ నామె చెలి మాధవీలతా కుమారియు నదియందు గ్రుంకులిడుచున్నది. రాజపురోహితుడు 'అఖండ గౌతమీస్నాన మహం కరిష్యే' అని ప్రారంభించి, 'దశాపరేషాం దశపూర్వేషాం' అను మంత్రములతో రాజకుమారికను గోదావరీ స్నానము పూర్తి చేరుంచెను.\u003cbr\u003e\u003cbr\u003eగట్టుపైన తనకై నిర్మించిన శిబిరములోనికి బోరు, యా బాలిక యుచిత వేషము ధరించి చెలులు కొలుచుచుండ నీవలికివచ్చి, అక్కడచేరిన భూదేవు లందరకు సంభావనలు సమర్పించినది. ఆ వెనుక స్యందనమెక్కి, విడిది చేసియున్న మహాభవనమున బ్రవేశించినది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47689639133440,"sku":null,"price":36.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Amsumathi.jpg?v=1780382912"},{"product_id":"adavi-shanthi-sri-adivi-baapiraju","title":"Adavi Shanthi Sri","description":"\u003cp\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Adivi%20Bapiraju\"\u003eAdavi Shanthi Sri by Adivi Baapiraju \u003cb\u003eఅడవి శాంతిశ్రీ\u003c\/b\u003e \u003cb\u003eఅడివి బాపిరాజు\u003c\/b\u003e\u003c\/a\u003e\u003cb\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003e\u003cspan\u003eఏనాటి కాంతవు! యుగయుగాల నుండి గంభీరంగా ప్రవహిస్తున్నావు నువ్వు. గంగా సింధు యమునాబ్రహ్మపుత్రలు నీకు కడగొట్టు చెల్లెళ్ళు. నీవూ, గోదావరి కవల పిల్లలు. నీవే జంబూనదివి. నీ ఇసుకలో బంగారు కణికలు, బంగారు రజను మిలమిల మెరసిపోయేది. ఈనాటికి నీ తీరాన స్వర్ణగిరి నిలిచి ఉంది. బంగారు గనులు నీ యొడ్డుల తలదాచుకొన్నవి. నీ గంభీరగర్భములో జగమెరుగని వజ్రాలు రత్నాలు నిదురిస్తున్నవి. నీది రతనాలబొజ్జ.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eకృష్ణవేణీ! నీలనదీ! ప్రేమమరూ! అనేకాంధ్ర సార్వభౌమ సహచరీ! ఆంధ్రాంగనా! నీవు నీలవవుషవై, లోకానికి నిత్యత్వాన్ని ఉపదేశిస్తూ ఉంటావు. నీవు నిర్మలాంగివై, నిత్యసృష్టిని లోకానికి పాటపాడి వినిపిస్తూ ఉంటావు. ప్రతియామినీ నీరవఘటికలలో నీ అక్క గోదావరితో హృదయమార వాకోవాక్యాలు పలుకుతూ ఉంటావు. నీవు ఆంధ్ర వసుంధరానీలమేఖలవు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003e-----\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eచారిత్రకమైనా, సాంఘికమైనా, ఏ నవలకు అదేసాటి. తన బహుముఖీన ప్రజ్ఞను ప్రతినవలలోనూ ప్రదర్శించి తన్మయులను చేసిన బాపిరాజు సార్థకజన్ముడు. అడివి బాపిరాజు గొప్ప భావుకుడు. బాపిరాజు రచనలన్నీ అవి నవలలైనా, కథలైనా, కవిత్వమైనా భావుకతకు పట్టం కట్టాయి. కాల్పనికత మూర్తీభవించిన రచయిత బాపిరాజు.\u003c\/span\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47689670131968,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/AdaviShanthiSri-1.jpg?v=1770986588"}],"url":"https:\/\/www.sahithibooks.com\/collections\/adivi-baapiraju.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}