Book Description
మల్లిక్ అంటే నవ్వుల హరివిల్లు. మంచి కార్టూనో, జోకో చెప్పేసి నవ్వితే నవ్వండి అనటం అతని స్ట్టెలు. నవ్వొస్తే మాత్రం మనం మాత్రం నవ్వకుండా ఉంటామా? అందుకే మనసారా నవ్వేసుకుంటాం. జోకులో, కార్టూనులో చాలావన్నట్టు మధ్యమధ్యలో నవల్సు కూడా రాసేసి మనమీద వదిలేస్తాడాయన. నవ్వులంటే మనకు ఇష్టం. అందుకే మనం ఆయన నవల్సు కూడా చదివేస్తాం. ఆ అలుసుతో మళ్ళీ ఈ నవలతో నవ్వులదాడి చేస్తున్నాడు మల్లిక్. అందుకే మనం వీలున్నంతవరకు నవ్వకుండ ఉందాం. పొరపాటున మనకు నవ్వొచ్చిందా అంతే మళ్ళీ కొన్ని జోకులోతోనో, మరో నవలతోనో దాడి చేస్తాడాయన. తస్మాత్ జాగ్రత్త.