Sahithi Prachuranalu

SHAHARNAMA

SHAHARNAMA
SHAHARNAMA

SHAHARNAMA

Rs. 100.00 Rs. 110.00
  • SKU: 13183210

Category : General Books

Publisher : Sahithi Prachuranalu

Author : Paravastu Lokeshwar

Language : TELUGU

Book Description

కూచుంటే ఒక కథ. లేస్తే మరో కథ. ఇట్లా నాలుగు పాతిక సంవత్సరాల పురాతన హైద్రాబాద్‍ నగరం కథలకు పుట్టినిల్లు. కథలకు కార్ఖానా. ఇక్కడ ప్రతి బస్తి బస్తీకి, గల్లి గల్లీకి, ప్రతి మంజిల్‍కు, ప్రతి మహల్‍కు, ప్రతి హవేలీకి, ప్రతి దేవుడికి, ప్రతి బాడాకు, ప్రతి వాడకు ఒక కమ్మని కథనో లేక కన్నీటి కథ వెనుక ఒక వెతనో ఉంటుంది. ఒకోసారి కథ వెనక కథ కూడా ఉంటుంది. ఈ కథలు ఒక కంట మనల్ని నవ్వించి మరో కంట కన్నీరు పెట్టిస్తాయి. ఈ కథలలోకి తొంగి చూస్తే మనకు నాలుగు వంద సంవత్సరాల నగర చరిత్రేగాక ప్రజల జనజీవన జగన్నాటకం కూడా కనబడుతుంది. మతకల్లోలాలతో, మారణహోమాలతో పాతనగరం ప్రజల అభివృద్ధి నిర్లక్ష్యానికి గురి అయ్యింది. అంతేగాక అసాంఘీక శక్తులకు, గుండాలకు, రౌడీలకు పాత నగరం ఒక అడ్డా అని చరిత్ర చెక్కిలి మీద లేని మసిపూసి బద్నాం చేశారు. ఆ అప్రపధను తొలగించి మన హైద్రాబాద్‍ గత వైభవోజ్వల చరిత్ర పునరావిష్కరణకే ఈ ‘‘షహర్‍ నామా’’ కథలు. ‘‘పట్నంలో శాలిబండా, పేరైనా గోలుకొండా’’ అని ఢంకాబజాయించి చెప్పటానికే మన బస్తీల కథలు. గల్లిగల్లీకి ‘‘కహాఁనియాలు’’. ఇగ మన కథలను మనమే చెప్పుకుందాం. మన చరిత్రను మనమే రాసుకుందాం. అందుకే ఈ ‘‘షహర్‍ నామా’’ మీ ముందుకు వస్తుంది.

Additional information
Code SPBK-208
SKU 13183210
Category General Books
Publisher Sahithi Prachuranalu
Author Paravastu Lokeshwar
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter