Sahithi Prachuranalu

Lakshmanudu

Lakshmanudu
Lakshmanudu

Lakshmanudu

Rs. 20.00 Rs. 25.00
  • SKU: 23179165

Category : Children Books

Publisher : Sahithi Prachuranalu

Author : Smt. RK Karuna

Language : TELUGU

Book Description

లక్ష్మణుడు అనగా లక్ష్మీ సంపన్నుడు అని అర్థము. లక్ష్మణుడు బాల్యమునుండి రామునకు మిగుల ప్రీతిపాత్రుడైయుండెను. లక్ష్మణుడు లేనిదే రాముడు నిద్రించుట కాని, ఆహారము తీసుకొనుట కాని చేసెడివాడు కాడు. లక్ష్మణునకు రామునిపై ఎంత ప్రీతి వుండెడిదో రామునకును లక్ష్మణునిపై అంతకంటెను ఎక్కువ ప్రీతి ఉండెడిది. విశ్వామిత్రమహర్షి యజ్ఞసంరక్షణార్థమై రాముని పంపుమని దశరథుని అడుగగ దశరథుడు లక్ష్మణుని కూడ రాముని వెంట పంపెను. విశ్వామిత్రుడు రామునికి ఉపదేశించిన మంత్రములను, అస్త్రములను అన్నింటిని శ్రీరాముడు ఆ ముని అనుమతితో లక్ష్మణునికి ఉపదేశించగల లక్ష్మణుడును సర్వ అస్త్ర, శస్త్ర పారంగతుడాయెను. విశ్వామిత్రుని అనుసరించిన రామలక్ష్మణులు శివధనుస్సును చూచుటకై మిథిలకు వెళ్ళిరి. అచట రాముడు శివ ధనుర్భంగము కావించి సీతను పరిణయమాడినపుడు జనకమహారాజు తన రెండవ కుమార్తెయైన ఊర్మిళను లక్ష్మణునకు యిచ్చి వివాహము జరిపెను. శ్రీరాముడు అరణ్యవాసమునకేగుచుండగా తాను కూడ నారవస్త్రములు ధరించి వనవాసమునకేగుచు కౌసల్యకు తన తల్లి సుమిత్రకు పాదములంటి నమస్కారము చేసెను. దశరధునిచే తపస్విని అని శ్లాఘించబడు సుమిత్ర అతని శిరసు ముద్దాడి. నాయనా! రాముని నీ తండ్రి దశరథునిగను, జానకిని తల్లినైన నన్నుగాను, అడవిని అయోధ్యగను భావించి సుఖముగ ఉండుము. ‘‘వెళ్ళుము, వెళ్ళుము’’ అని త్వరపెట్టెను. తరువాత ప్రయాగచేరి అచట భరద్వాజ మునిని దర్శించి అచటినుండి చిత్రకూటముచేరిరి. రాముడు లక్ష్మణునితో అక్కడ పర్ణశాలను నిర్మించమనగ లక్ష్మణుడును రాముడు కోరిన విధముగ అందమైన పర్ణశాలను నిర్మించెను. సీతారామ లక్ష్మణులు జితేంద్రియులై మనోహరమైన ఆ పర్ణశాలయందు సుఖముగనుండిరి. మారీచుని మాయచే రావణుడు సీతను అపహరించెను. సుగ్రీవుడు యిచ్చిన సీత ఆబరణములను గుర్తింపుమని రాముడు కోరగా లక్ష్మణుడు - ‘‘ఈ నూపురములను మాత్రము గుర్తించుచున్నాను. సీతమ్మ పాదములకు నిత్యము నమస్కరించుట వలన నాకు ఇవి పరిచితములు’’ అని పలికెను. ఇది అతని శీలవైభవము. రావణుని కుమారుడు ఇంద్రజిత్తుని వధించినవాడు. రామాజ్ఞ ప్రకారం సీతను వాల్మీకి ఆశ్రమంలో విడచినవాడు. చివరకు సరయూ నదీ తీరమునకు వెడలి యోగ సమాధినొందగా దేవతలు అతనిపై పుష్ప వృష్టి కురిపించిరి.

Additional information
Code SPBK-165
SKU 23179165
Category Children Books
Publisher Sahithi Prachuranalu
Author Smt. RK Karuna
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter