Book Description
ఆయుర్వేద విద్యలో నాగార్జున యూనివర్శిటి నుండి పట్టభద్రులు. యోగా, తత్వశాస్త్రాలు ఆంధ్రా యూనివర్శిటి నుండి పి.జి. డా।। పి.చిరంజీవిరాజుగారి వద్ద 10 సంవత్సరాలు అసిస్టెంట్ డాక్టర్‍గా పనిచేశారు. విశాఖ - శాంతి ఆశ్రమంలోను. యోగా, ఆయుర్వేద విషయాలకు పూర్తికాలం పనిచేయడం ప్రారంభించారు. విజయవాడ డా।। రమేష్ సిటీ కార్డియాక్ సెంటర్‍లోను కన్సల్టెంట్‍గా పనిచేశారు. వత్తిడిని తగ్గించే యోగ నిద్ర టెక్నిక్‍ను బాగా అభివృద్ధి చేశారు. అనేక సామాజిక చైతన్య కార్యక్రమాలలో పాల్గొనటం, అందులో భాగంగా విజయవాడ క్లబ్, వాకర్స్ క్లబ్, రోటరీక్లబ్, లయన్స్ క్లబ్‍లు, హైదరాబాద్ జూబ్లీహిల్స్ క్లబ్‍లతోపాటు అనేక ఇతర ప్రాంతాలలో అనేక ప్రసంగాలు చేస్తూ సామాజికసేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. 20కి పైగా పుస్తకాలను రచించి ముద్రించారు. యోగాటుడే, ఆయుర్వేదటుడే, ఆరోగ్యసంహిత, యోగాధెరపి వంటి పుస్తకాలను ప్రజలు ఎంతగానో ఆదరించారు. ఊబకాయం, మధుమేహం, యోగాటుడే, ధ్యానం, యోగా వంటి విషయాలపై సి.డిలను విడుదల చేశారు.