Book Description
చిన్నవారికి, పెద్దవారికి మన దేశంలోనే కాదు. ప్రపంచంలోనే చాలా ఆటలు ఉన్నాయి. వాటిలో శారీరక శ్రమను కలిగించే దేహ ధారుడ్యానికి ఉపయోగపడేవి కొన్ని, ఒకేచోట కూర్చుని మెదడుకి పదునుపెట్టేవి కొన్ని. ఆటలు ఏవైనా వాటిని ఆడినప్పుడు శరీరానికి, మనస్సుకి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగంచటమే వాటి పని. పదవినోదం, పదకేళి, అంకెలతో ఆటలు (సుడోకు) ఇవన్నీ పిల్లలలో మేధాశక్తిని, జ్ఞాపకశక్తిని పెంచగలవు. ప్రపంచ సర్వేల ప్రకారం చదరంగం, పద వినోదం, అంకెల సమస్య పూరింపు వలన పెద్దలు కూడా అల్జీమర్స్ బారిన పడకుండా ఈ ఆటలు కాపాడతాయని తెలిసింది. మనసుకి చికాకు కలిగినప్పుడు నాలుగు గోడల మధ్య మౌనంగా కూర్చోవటం కంటే ఇలాంటి పుస్తకాలతో గడిపితే మనస్సుకి ప్రశాంతత, మెదడుకి మేత రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. చదరంగం లాగానే అంకెలతో ఆటలు కూడా మీ పిల్లల మేథస్సుకు అవసరం. వారిలోని సృజన బయటకు రావాలంటే రోజుకి ఒక గడిని అయినా పూర్తి చెయ్యమనాలి. అలాంటి ఆటలలో ఒకటి అంకెల పూరింపు. వాటిని సేకరించి పుస్తకరూపంలో సరదాగా మీకు అందించటం జరిగింది. వీటికి జవాబులు ఉన్నా, వాటిని చూడకుండా మీకుగా మీరు గానీ, మీ పిల్లలు కానీ ఎన్ని పూరించగలరో మీ మేధస్సుని పరీక్షించుకోండి. మేథోవంతులు కండి