Book Description
రష్యన్ కథా రచయిత అంటోన్ చెకోవ్ (జనవరి 29, 1860 - జూలై 15, 1904) ఆధునిక కథాసాహిత్య ప్రపంచం పై వెలిగిన ధ్రువతార• చెకోవ్. డాక్టర్ వృత్తి చేసుకొంటూ మరోప్రక్క నిరంతర సాహితీ కృషి చేసాడు. అయన కథలు ప్రపంచ ఖ్యాతి పొంది ఇప్పటికీ అనేక భాషలలో ప్రచురించబడుతున్నాయి. టె•మ్ మాగజైన్ ఎంపిక చేసిన, ప్రపంచంలో ఎప్పటికీ నిలిచిపోయే పది పుస్తకాలలో ‘చెకోవ్ కథల సంపుటి’ స్థానం పొందింది. మధ్యతరగతి ప్రజల ఊగిసలాటను ఆయన వ్యంగ్యంగా విమర్శించాడు. పేదల దయనీయ పరిస్థితులపై జాలి చూపించాడు. ఉన్నత వర్గాల పటాటోపాన్ని గేలిచేసాడు. అందుకే చెకోవ్ కథలు అజరామరంగా నిలిచిపోయాయి. ఇప్పటివరకూ పుస్తకరూపం పొందని వంద కథల కొత్త అనువాదాన్ని మీ ముందుకు తెస్తున్నాము. చదివి ఆస్వాదించండి. ఆదరించండి