Book Description
శరీరానికీ భాష వుంది! అది ప్రేమించే మనసుకి మాత్రమే అర్థమవుతుంది. మౌనంగా చూస్తే.... ‘నిన్ను ఎంతగా మిస్ అయ్యానో తెలుసా?’ ‘చెయ్యి మొహాన్ని తడిమితే... నాకోసం ఎంతగా తపించిపోయావో తెలిసిందిలే!’ అతని గుండెలో తలదూరిస్తే... ‘నీ హృదయంలో బాధని నాకు తెలియకూడదని దాస్తున్నావుగా!’ చేతివేళ్ళలోకి చేతివేళ్ళు జొనిపి గట్టిగా బంధిస్తే... ‘ఇంక నిన్ను ప్రాణం పోయినా విడువనుగా!’ అతని చేతివేళ్ళు ఆమె తలని నిమిరితే... ‘నాకు నీ శరీరమే కాదు మనసూ ముఖ్యమే!’ ఆమె చేతివేళ్ళు అతని జుట్టు చెరిపితే... ‘ఒక్కసారి ముద్దుపెట్టుకో. చాలాసేపయింది!’ గాఢంగా ముద్దుపెట్టుకుంటూ వీపుని మధ్యలో కొద్దిగా నొక్కితే... ‘ఐ లవ్ యూ!’ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ నాలిక కొసతో మెత్తగా స్పృశిస్తే... ‘నిన్ను మొదటిచూపులోనే ప్రేమించాను తెలుసా?’ గుండె కొట్టుకునే వేగం పెరిగిపోతే... ‘మనం ఇంక దూరంగా వుండలేము పద!’ కీర్తి కళ్ళు మౌనంగా మాట్లాడ్తూ సిద్దార్థతో అన్నాయి కదా- "Press your lips against mine and try to catch me... I'm falling.... I'm falling."