Book Description
పది సంవత్సరాలు! మనిషి జీవితంలోనైనా, సంస్థ చరిత్రలో ఐనా, పత్రికా నిర్వహణలో ఐనా పదేళ్ళు సాధారణమైన విషయమేమీ కాదు. కాలం దాటని కబుర్లు శీర్షిక వయసు పదేళ్ళు! నవ్వించడం ఒక్కోసారి అంత కష్టం అనిపించదు కానీ ఆరోగ్యకరంగా నవ్వించడం అంత తేలికేమీ కాదు. నవ్విస్తూ మనసుని సున్నితంగా తట్టి ‘గుండె తడి’ చేయడం రమణి గారి ఈ వ్యాసాల ప్రత్యేకత. ఈ సంపుటిలోని అంశాలన్నీ చదవటం పూర్తయ్యేసరికి రమణి గారి అమ్మగారు, వారి కుటుంబసభ్యులు, వారితోపాటు స్కూల్లో చదువుకున్నవాళ్ళు, వారితో కలిసి పనిచేస్తున్న వాళ్ళు, సినీ నిర్మాతలు, టీవీ సీరియల్ నటీనటులు... అంతా మనకి ఆప్తులైపోయారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని అలరిస్తున్న ఈ నవ్వుల పువ్వుల మూడో సంపుటం ప్రచురణ కావడం ఎంతో ఆనందదాయకం. పేరుకి ‘కాలం దాటని కబుర్లు’ కానీ నిజానికి కాలాన్ని ఎదిరించి నిలిచి ఎప్పటికీ సజీవంగా పలకరించే ఆత్మీయమైన కబుర్లు ఇవి. రమణి గారి కలంనుంచి ఇలాంటి ‘మనసున్న’ రచనలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉండాలని మనసారా ఆశిస్తూ....