Book Description
ఫీలయ్యేవాళ్ళకి ఈ ప్రపంచం ట్రాజెడీ. ఆలోచించేవాళ్ళకి కామెడీ. శ్రీమతి బలభద్రపాత్రుని రమణి ఈ రెంటి కలయిక. తెలుగులో కామెడీ రాసేవారు తక్కువ. శ్రీ పురాణం సుబ్రహ్మణ్యశర్మ, శ్రీ ఆదివిష్ణు, శ్రీ యర్రంసెట్టి సాయి, ముళ్ళపూడి వెంకటరమణ మొదలగు రచయితలే కామెడీని రాశారు. తెలుగు రచయిత్రులలో శ్రీ యుతులు భానుమతీ రామకృష్ణ, పొత్తూరి విజయలక్ష్మి ఇప్పుడీ బలభద్రపాత్రుని రమణి గారు కామెడీ రాసేవారిగా కనిపిస్తున్నారు. ఈ వ్యాసాల్లో రమణి గారు తనకి పరిచయం వున్న వ్యక్తుల పేర్లని, వారి మధ్య జరిగిన హాస్య సంఘటనలని అనేకం పేర్కొన్నారు. రమణి గారి కుటుంబ సభ్యులందరూ హాస్యప్రియులే. కాబట్టి ఆమెకి హాస్యం రాయడం నల్లేరు మీద నడకే. ఈ వ్యాసాల్లో మనం అనేకమంది ప్రముఖులని కూడా కలుసుకోవచ్చు. ఈ పుస్తకం చదవడానికి ఓ సూచన. నవలలా ఏకబిగిన చదవకండి - చాక్లెట్స్ చప్పరించినట్లు ప్రతిదానికీ మధ్య విరామం ఇచ్చి చదివితే చక్కగా ఎంజాయ్ చేయగలరు.