Book Description
‘‘సింహము, చిట్టెలుక కథలోలాగా మనకి కొన్ని వరాలుంటాయి. అవి సహనం, ఆలోచన, తెగువ ఇవి ఆయుధాలుగా మనం అతడి మీద ప్రయోగించాలి. బ్రతకాలంటే యుద్ధం చెయ్యాలి... ఫైట్..ఫైట్..ఫైట్...’’ అంది అమ్మాయి. ‘‘ప్రేమంటే ఓ మనిషి ఇచ్చే స్ఫూర్తి వల్ల మన పనులు సక్రమంగా నిర్వర్తించడం. అతని తలపులు మన దోసిలిలో వర్షంలా కురుస్తూ వుంటే ఎన్ని రోజులైనా ఇంకా ఇంకా స్థలం మిగుల్తూనే వుండటం’’ అంది ఇంకో అమ్మాయి. ‘‘మగవాడ్ని కాస్త జాగ్రత్తగా డీల్ చేస్తే అతనిలోని స్నేహం, సౌకుమార్యం, దయ బయటికి తీయవచ్చు. కానీ మొదటిగా అతను ప్రకటించే కోర్కెను ఎదుర్కోవాలి. అందుకు చాలా మెళకువ కావాలి. ‘‘హౌటు టేకిల్ ఎ మేన్’’ అని ఇంతవరకు వరూ వ్రాసినట్లు లేదు’’ అనుకుంది మరో అమ్మాయి. ఇంకా ఎందరో అమ్మాయిల మనోభావాలకు రూపకల్పనే ఈ ‘ఆలింగనం’. పెళ్ళికాని అమ్మాయిలకి, పెళ్ళి అయిన అమ్మాయిలకి, వారికి తోడైన అబ్బాయిలకి అందరికీ పనికివచ్చే పుస్తకం.... ‘ఆలింగనం’.