Book Description
మనలో చాలామందికి వేరొక దురభిప్రాయం వుంది. ఒకే వ్యక్తి ఒకే సమయంలో ఒకే విధంగా ఇద్దరు వ్యక్తుల్ని ప్రేమించగలడా? ప్రస్తుత నాగరికతలో ఇలాటిది చాలా సులభసాధ్యంగానే కనిపిస్తుంది; ఇది స్త్రీలకూ, పురుషులకూ కూడా సంబంధించిన విషయంగా బ్లోచ్ నిశ్చయించాడు. హిర్త్ అనే ఆయన ‘‘స్త్రీ కానీ, పురుషుడు కానీ ఒకే సమయంలో ఒకేవిధంగా ఇద్దరు వ్యక్తుల్ని ప్రేమించగలరనే అభిప్రాయాన్ని సమర్థించాడు. పురుషుడు తన అహంభావంవల్ల స్త్రీ తనను తప్ప వేరొక వ్యక్తిని ప్రేమించలేదనే గుడ్డినమ్మకాన్ని విశేషంగా ప్రచారం చేశాడు. ఆ స్త్రీ రెండో వ్యక్తినికూడా అదే సమయంలో ప్రేమించటాన్ని పురుషుడు వ్యభిచారంగా గుర్తించి, సామాజికంగా స్త్రీ పతనమైందనే ధోరణిని కనబరిచాడు. నవలాకారులేమి, కవులేమి, చివరకు వైద్యులు, మనస్తత్వవేత్తలు కూడా స్త్రీ ఒకసారి ఒకే పురుషుణ్ణి ప్రేమిస్తుందనే అభిప్రాయాన్ని ఆమోదించారు. వారి దృష్టిలో స్త్రీ ఒక ఆస్తిలాంటిది; ఆ ఆస్తికి హక్కుదారుడు ఒకడే వుండాలి. అలాలేని పక్షంలో ఆ స్త్రీ సామాజికంగా తన విలువను పోగొట్టుకుంటుంది.