Book Description
అమెరికాలో వలస రాజ్యాల స్థాపనలో వివిధ పాశ్చాత్య దేశాలవారు మొదట్లో పడ్డ అగచాట్లను విపులంగా అభివర్ణించిన నవల ఇది. మానవుడిలోని సద్గుణాలను ఒక త్రాసులోనూ, దుర్గుణాలను మరొకదాన్లోనూ వేసినప్పుడు, త్రాసు ఎటు మొగ్గుతుందో తూచి, మానవ నైజాన్ని వివిధ దృక్కోణాలనుంచి తెలియజెప్పిన నవలారాజం ఇది. సూర్యరశ్మి జొరబడని మహారణ్యాలలో, క్రూరత్వమే లక్ష్యంగా పెట్టుకొన్న శత్రువులను తప్పించుకొంటూ ప్రయాణం చేయవలసివస్తే, ఎన్ని కష్టనష్టాలను ఎదుర్కోవలసి ఉంటుందో ఊహించవలసిందే! ఇక సాహసం ఒక్కటేగాక, మనోధైర్యం, ఊహించవలసిందే! ఇక సాహసం ఒక్కటేగాక, మనోధైర్యం, అవసరమైతే తన ప్రాణాలను సైతం బలిపెట్టేందుకు సిద్ధపడిన మిత్రుల సహకారం, విధివిలాసాలు మాత్రమే ఆ నిర్భాగ్యులకు తోడునీడలైన తీరుతెన్నులను దీన్లో అభివర్ణించటం జరిగింది. మానవత్వపు చిత్ర విచిత్రానుభూతులన్నీ కుదించబడిన నవరసభరితమైనదీ ‘అంతిమ పోరాటం’.