Book Description
సాంబమూర్తి ‘‘రేవతీ! ఒక్కమాట’’ అని అరిచాడు. రేవతి డ్రైవింగ్ సీటు పక్కకు వచ్చింది. ‘‘ఇదిగో నీ గళ్ళ రుమాలు...’’ అని సాంబమూర్తి రుమాలు అందించాడు. ‘‘నా జ్ఞాపకార్థం మీ దగ్గిరే ఉంచుకోండి. ఒక సంసారాన్ని కాపాడిన విషయం మీ కీ రుమాలు జ్ఞాపకం చేస్తూ వుంటుంది’’ అన్నది రేవతి. ‘‘థాంక్స్...’’ అని సాంబమూర్తి కారు పోనిచ్చాడు. జానకి రానందుకు వికలమైన మనస్సు యిప్పుడు వికసించిన తామర పువ్వల్లే స్వచ్ఛంగా, పరమ పవిత్రంగా వున్నది. తాను జీవితంలో చేసిన ఘనకార్యానికి బహూకరణగా వచ్చిన గళ్ళ సిల్కు రుమాలు అంతులేని ఆనందాన్నిస్తోంది. రణరంగంలో రొమ్మిచ్చి పోరాడినందుకు ఇవ్వబడే విక్టోరియా క్రాస్ లిటి దీ రుమాలు.