Book Description
ఉన్నవి - రెండు వాక్యాలే అయినా ఆ ప్రేమలేఖ ఎంత బాగుందీ! ప్రేమలేఖల పేరిటా, స్నేహలేఖల పేరిటా దిగుమతయ్యే మన సాహిత్యంలోని చెత్తంతా చదివినా యీ బుల్లి లేఖను చదివినంతగా ఆనందించలేను! ఎంత ధైర్యం చేసింది. ‘రొమాన్సు’ ఇంత తేలిగ్గా దొరుకుతూంటే జీవితంలో ఎంత మాధుర్యం ఏర్పడుతుంది! పురుషుణ్ని - పర స్త్రీని తేరిపార చూసేందుకే నాకు కాళ్లు వొణుకుతయ్! కాని ఆమె ‘సాహసం;’ స్త్రీ మూర్తిలో ప్రతిఫలించిన గుణాల్లో ఒకటేమో? ఇంత సులభంగా ఆమె నాదైపోతుందని కలకన్నానా? నన్ను నేనే నమ్మేందుకు కూడా వీలులేనంత పని జరిగింది! ఇంత అందమైన స్త్రీ తనంతట తను ఎదుట మోకరిస్తే ఏ పురుషుడికి గర్వంగా ఉండదు?