Book Description
విశ్వ సాహిత్యంలో ‘‘యుద్ధము - శాంతి’’ అగశ్రేణికి చెందిన నవల. మానవ జీవితాన్ని గురించిన ఆ కాలపు రష్యా దేశాన్ని గురించిన సమగ్ర చిత్రం ఈ నవల. చరిత్రని ప్రతిఫలింపచేసే ‘‘యుద్ధము-శాంతి’’ నవలను రాయడానికి రచయిత లియో టాల్‍స్టాయ్‍కి అయిదేళ్ళు (1863-1868) పట్టింది. మహాభారతం చదివినప్పటి రీతిగానే వివిధ సంఘర్షణలతో కూడిన ఈ కావ్యాన్ని చదివిన తదనంతరం మనస్సు ఒక విధమైన శాంతి సహితమగు ఆనందంలో లీనమౌతుంది. ఈ కావ్యంలోని రమణీయత ఇదే. అందీ అందని అందచందాలే కాక క్లిష్టమైన శిల్ప చాతుర్యం కల సుదీర్ఘమైన ఈ గ్రంథాన్ని ఆంధ్ర పాఠకులు మన్ననతో స్వీకరిస్తారని ఆశిస్తున్నాము. అనువాదకులు రెంటాల గోపాలకృష్ణగారికి మరియు బెల్లంకొండ రామదాసుగారికి ప్రత్యేక కృతజ్ఞతలు.