Book Description
వీధి లోంచి ఒక్క పరుగున వచ్చిన అక్కను కౌగిలించుకుంది శాంత. చేతిలో పుస్తకాన్ని పక్కనపెట్టి ‘‘ఏమిటే శాంతా ఈ హడావిడి?’’ అని ప్రశ్నించింది జానకి. శాంత నవ్వుతూ న్యూస్‍పేపర్ని అక్క కళ్ళ ముందు ఆడించింది. ‘‘ఓ! ఇదా సంగతి! అమ్మాయిగారి రిజల్టస్ వచ్చాయన్నమాట! ఏదీ చూడనీ’’ అంటూ పేపరు పేజీలు తిరగేస్తూ ‘‘అమ్మా! అమ్మా! శాంత రిజల్టస్ వచ్చాయ్’’ అని కేకేసింది. పొయ్యి కింద మంట కిందికి లాగి ఆత్రంగా వరండాలోకి వచ్చింది సుందరమ్మ. ఆడపిల్ల. దాని పరీక్ష మాటకేంగాని ప్రకాశంది ఏమయింది? ఈ ఏడైనా గట్టెక్కాడా? అని ఆత్రంగా ప్రశ్నించింది సుందరమ్మ. ఎంతసేపు కొడుకుల చదువులు, వాళ్ళ మంచి చెడ్డలే కాని కూతుళ్ల సంగతి అక్కర్లేదా? ఎందుకీ వివక్ష? తప్పక చదవండి ‘మారిన విలువలు’.