Book Description
‘‘పిచ్చిమొద్దా! నవలల మీద ప్రింటయ్యే రచయితల ఫొటోలు వాళ్ళ చిన్నప్పటివి. ఆ ఫోటోల్నే మళ్ళీ మళ్ళీ అచ్చు వేయించుకుంటారు. ముసలైపోయినా గొప్ప గ్లామర్‍బోయ్స్లా, ఎవర్‍గ్రీన్ హీరోల్లా పాఠకులకు పూలు పెడ్తుంటారు. ముఖాముఖీ చూస్తే అప్పుడు బయటపడుతుంది వాళ్ళ బండారం.’’ ‘‘ఫల్గుణ్‍కి ఆ ఖర్మ పట్టలేదు. వెరీ హాండ్‍సమ్. వయసు నలభైవరకూ ఉంటుంది చూస్తే మీ మతులు పోతాయి. అంత హేండ్‍సమ్‍గా ఉన్నారు.’’ ‘‘అయితే తప్పకుండా నీకు పోయే ఉంటుంది’’ ‘‘ఏమిటి పోయేది?’’ ‘‘మతి’’ ‘‘నిన్నూ...’’. అంటూ చెయ్యెత్తింది కొట్టటానికన్నట్లు. కాలేజ్‍గంట గణగణమంది. అందరూ పొలోమన్నారు. త్రిశల రైటర్ ఫల్గుణ్ వలలో చిక్కిందా! అసలు అతని వ్యక్తిత్వం ఎలాంటిదో తెలియాలంటే ప్రేమకు, బంధాలకు నిర్వచనం తెలిపిన ఈ అద్భుత నవల చదవండి.