Book Description
‘‘దైవమందిరంలో పెద్దలసాక్షిగా వివాహం జరిగింది. నా భర్తను నేను ప్రేమిస్తున్నాను. నా భర్త నాకు కావాలని కనుపించని దేవతలను మొక్కుకుంటున్నాను. కోటి సంజయ్ లు వచ్చినా నన్ను తీసుకోలేరు’’ అన్నది వీణ. కాని అంతలోనే అనుమానం వచ్చింది. ‘‘రాజీవ్ నన్ను పరిగ్రహిస్తాడా? నాకు క్షమలేదా?’’ అని వాపోయింది. ఎందుకు అంత పరితాపం? తాను చేయని నేరం నెత్తిన వేసుకుని వీణకోసం ఎంత గొప్ప త్యాగం చేశాడు రాజీవ్. అతన్ని అపార్థం చేసుకొన్నది. తన శీలాన్ని పెళ్ళికాకముందే బలితీసుకున్న రాక్షసుడని అపోహపడి రాజీవ్ చేసిన మహత్తర త్యాగం గుర్తించలేక తన జీవితాన్ని నరకప్రాయం చేసుకుని అతని జీవితాన్ని కూడా నరక ప్రాయం చేసింది. తీరా అసలు రహస్యం బయటపడి రాజీవ్ చేసిన అపూర్వమైన త్యాగం తెలిసిన తర్వాత...? అప్పటికే అంతా మించిపోయిందా? లేక కథ సుఖాంతమవుతుందా? ఉదాత్తమైన పాత్రలతో ఊహించలేని మలుపులతో నదీ ప్రవాహంలా సాగిన రచన ‘‘ఉదాత్త చరితులు’’ చదవండి.