Book Description
తెలుగునాట విశేష ప్రచారం పొందిన భక్తి శతకములలో దాశరథి శతకం ఒకటి. ఈ శతకమును రచించినది ‘రామదాసు’గా ప్రసిద్ధి పొందిన కంచెర్ల గోపన్న. ‘‘దాశరథీ! కరుణాపయోనిథీ!’’ అనే మకుటంతో ఉత్పలమాల, చంపకమాలలో రచింపబడిన ఈ శతకంలో 103 పద్యాలున్నాయి. ‘‘దాశరథీ శతకము శ్రీకాళహస్తీశ్వర శతకమువలెనే తెలుగున గల భక్తి శతకములలో మిక్కిలి ఉత్తమమైనది. ఇందలి ప్రతి పద్యమును భక్తిరసవాహిని. ఇందలి అర్థ శబ్దాలంకార చమత్కారమును, వైరాగ్య సంపదయు, ధారాశుద్ధియు’’ చిక్కని పాలపై మిసిమి జెందిన మీగడ పంచదారలో’’ గలిసిన భంగి మధురమైన పద ప్రయోగమును అనన్య సామాన్యములు.’’ దాశరథీ శతకంలోని పద్యాలు సరళంగా, సాలంకారికంగా, భక్తిప్రబోదితంగా, ధారాశుద్ధి కలిగి ఆబాలగోపాలాన్నీ అలరిస్తున్నాయి.