Book Description
”ఉమ్మడికుటుంబం అనేది ఒక మంచి ఉద్దేశంతో ఏర్పరచారు పెద్దలు. ఏ బరువుభారాలైనా సాధకబాధకాలైనా ఆ సభ్యులందరూ కలిసి భరించి కలిసికట్టుగా బ్రతుకుతారని. కానీ నేటి పరిస్థితుల్లో ఆ సదుద్దేశం మృగ్యమై భార్యా భర్తలను విడదీయడానికి మాత్రమే ఈ ఉమ్మడి కుటుంబాలు గణతికెక్కుతున్నాయి. అంచేత నేను నా భర్తా నేనూ మాత్రమే చిన్న యింటిలో బ్రతికే ఒప్పందంమీద తిరిగి సంసార జీవితంలో ప్రవేశిస్తాను. నా బంధువులూ తలిదండ్రులైనా, అతడి బంధువులూ తలిదండ్రులైనా కేవలం చుట్టుపుచూపుగా రావచ్చు. కానీ ఇక్కడ తిష్ఠ వేయడానికి వీల్లేదు. నేనుకూడా అంతే. వారింటికి వెళ్ళి వుండేది లేదు. ఎందుకంటే నాకు నా అత్తమామలపై సద్భావం లేకపోగా నన్నెప్పుడు చంపుతారోననే భయం నాకింకా వదలలేదు. నేను వారి ఇంటిమీదా, వారి సంపాదనమీదా ఆధారపడాలనుకోవడం లేదు. అత్తమామలు వారింట్లో వారుంటారు. నేను నా కాళ్ళమీద బ్రతకగలను.” పెళ్ళిపేరుతో ఉమ్మడి కుటుంబంలో కాలు పెట్టి ఎన్నో బాధలు అనుభవించి చెప్పిన సత్యాలు ఇవి. ఆ ఇంటి కోడలే వారికి మార్గదర్శి అయి సంసారాన్ని చక్కదిద్దింది. ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి కలం నుండి వెలువడిన మరో అపూర్వ నవల ”మార్గదర్శి”