Book Description
ఆకాశమూ, భూమి కలుస్తున్నట్లు అనిపించే ఆ చోటు – దిక్చక్రం. ఎంత పరుగెత్తినా దూరంగానే వుంటుంది. ప్రేమ వెంట పరుగులు పెట్టడం కూడా అటువంటిదే. మాధవ్, కాంచనలిద్దర్నీ పెద్దలు చిన్నప్పటినుంచీ భార్యాభర్తలన్నారు. కాని మధ్యలో అంతస్తులు మారాయి. మాధవ్ నిరుద్యోగి అయితే, కాంచన సంపన్నురాలైంది. చిన్నప్పటినుంచీ వారిని భార్యాభర్తలన్న పెద్దలే వారు అన్యోన్యంగా వుంటే సహించలేకపోయారు. ఆవేశాలు పెరిగాయి. మాధవ్ ప్రయోజకుడై తిరిగివద్దామని దేశాలవెంట పోయాడు. అతని పని బూరెల గంపలో పడ్డట్టయింది. కోటీశ్వరుడి ఆదరణ సంపాయించాడు. ఇక్కడ కాంచన జీవితంలో మరొక అధ్యాయం మొదలైంది. మాధవ్‌ను చచ్చినవారిలో జమకట్టి ఆమె మనస్సు విరిచి పెళ్ళిచేశారు. ఆమె భర్త గోపాల్ సార్థకనాముడు. కాంచన వైవాహిక జీవితం కన్నీటిమయమైంది. ఆమె ఓర్పూ, సహనమూ ఏమీ అక్కరకు రాలేదు. ఇటు కాంచన జీవితంలో హాలాహలం! మల్లెపువ్వులాంటి ఆమె జీవితం మాడి మసైపోయింది. ఇంత జీవిత నాటకంలోనూ, ఎన్నో అపోహలు, అనుకోని మలుపులతో ఊపిరాడనీయక ఏకబిగిన చదివించే రచన – దిక్చక్రం