Book Description
”భగవాన్! ఈసారైనా దయదలచు. నా మొర ఆలకించు. నా ప్రాణాలు పోయినాసరే, వంశాంకురం నిలబడితే చాలు” మరణయాతనను మించిన ప్రసవవేదన పడుతూ, రొప్పుతూ భగవంతుని వేడుకొంటూన్నది స్వర్ణమంజరీదేవి. ”విూరు గతాన్ని ఇప్పుడేమాత్రమూ తలపెట్టవద్దు తల్లీ, మనస్సును నిర్మలంగా వుంచుకోండి” దాసీ అనునయస్వరంతో హితోక్తులు పలుకుతున్నది. తన గదిలో క్షణమొక యుగంగా గడుపుతున్నాడు మధుసూదనరావు. మెత్తని ముఖమల్ పరుపుతో అలకరింపబడిన అందమైన పాన్పు ఆ సమయాన అతడి దేహానికి అంపశయ్యయైతోచింది. ఎవరొచ్చి ఏం చెపుతారోనన్న ఆత్రంతో క్షణమొక యుగంగా నిరీక్షిస్తూ సతమతమౌతున్నాడు.