Book Description
రామాయణ ఇతిహాసాన్ని పురాణమనీ, కల్పనా కథ అనీ భ్రమించే వారికి కాదు. ఇది చరిత్ర. ఇది జరిగింది. శ్రీరాముడు మహోన్నత మానవుడై దైవమైనాడు. భారత సామ్రాజి సీత రాజకీయ పీటముళ్ళలో ఇరుక్కుని ఒట్టి అబలగా అగ్ని ప్రవేశించిన అమాయకురాలుగా చిత్రింపబడ్డది. ఇలాంటి అతి మామూలు అందమైన స్ర్తీ పాత్ర కొన్ని వేల సంవత్సరాలు చలామణియై సీతమ్మ కష్టాలు అనే నానుడికి మూలమయ్యింది. లోకంలోని రామాయణాల్లో సీత కథ - స్వర్ణసీత కథ. సీత జగద్ధాత్రి. శ్రీరాముని కులపాలిక - రాజ్యసభ అధ్యక్షురాలు - న్యాయాధికారి - మహారాణి. అదీగాక ఏ రామాయణంలోనూ శ్రీరాముని నిత్యజీవితం గురించి వివరణ లేదు. అన్ని సంవత్సరాలు పాలించిన ప్రభువు ఏం తిన్నాడో, ఏం మాట్లాడాడో, ఆయన అనుభూతులేమిటో చెప్పటానికి లత గారికి వదలివైచిన ముందటి రామాయణకర్తలకు వందనాలర్పిస్తూ య స్వర్ణసీత మీ ముందు ఉంచుతున్నాంఔ