Book Description
నీలిమ చదువుకు దరిద్రం అడ్డు తగిలింది. బ్రతుకు పందెంలో తెగిన గాలిపటం అయింది. నీలిమకు దరిద్రం అంటే భయం. దరిద్రుడైన ప్రియుణ్ణి పెళ్ళిచేసుకోడం భయం. ప్రేమించిన ప్రియుణ్ణి వదులుకోలేదు. డబ్బుగల విఠల్రావు డబ్బునూ వదులుకోలేదు. స్వార్థపరుడైన శేషగిరినినుండి రక్షణ కావాలి. ఇంతమంది వ్యక్తుల మధ్య నలిగే నీలిమకు నరసింహం తీసుకున్న నిర్ణయం ఎంతవరకు లాభించింది?