Book Description
గంగ, యమున, సరస్వతి అనే ముగ్గురు అభంశుభం తెలియని అక్కచెల్లెళ్ళ జీవితాల్లో ఒడిదుడుకులు ఏర్పడ్డాయి. మేనమామ శేషయ్య బారినుండి తప్పించుకోడానికి ఇంటినీ, ఆస్థినీ వదిలి హైదరాబాదుకి పారిపోయి వచ్చేశారు. రకరకాల, వింతవింత మనస్తత్వాలు కలిగిన ‘రాజభవనం’లో కాపరంపెట్టిన అక్కచెల్లెళ్ళకు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. మేనమామ శేషయ్య పసిగట్టి తిరిగి తీసుకుపోతాడేమోనన్న భయం ఒకపక్కా, బ్రతుకు ఎలా వెళ్ళమార్చాలోనన్న సమస్య మరోపక్కా వేధిస్తూంటే చెన్నారెడ్డి, మూర్తివంటి మంచిమనుషులు వాళ్ళకి చేదోడయ్యారు. ఇంతలో శేషయ్య హటాత్తుగా వూడిపడి గంగపై హత్యా ప్రయత్నం చేయించాడు. ఆ హంతకుల బారినుండి తప్పించుకుని, చెల్లెళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి గంగ చేసిన సాహసమే - యీ ‘రాజభవనం’.