Book Description
ఆ రోజు సూర్యగ్రహణం. అది మిట్టమధ్యాహ్నం. నలువైపులా అంథకారం. ఆకాశంలో నక్షత్రాలు. లోకంలో జీవితం స్తంభించిపోయినట్లే వుంది. గాలి ఆగిపోయింది. అది త్రివేణీ సంగమం. అసంఖ్యాకంగా వున్న యాత్రీకులంతా హిందువుల. వారి హృదయాలలో భక్తిశ్రద్ధలు, ధర్మంపట్ల అనురాగం. భారతదేశంలో ప్రతి భాగంనుండి వచ్చారు. అది వారికి పవిత్రమైన సమయం. పవిత్రమైన త్రివేణి స్రవంతిలో పాపాలను ప్రక్షాళించుకొనడానికి వచ్చారు. యాత్రీకులు తమ పాపపు మూటలను త్రివేణిలో పారవేసిపోతున్నారు. సాయంత్రమయ్యేసరికి రేపు అంతటా నిశ్శబ్దంగా వుంది. గాయపడినవాళ్ళు, సగం చచ్చినవాళ్ళు కొందరు అక్కడక్కడ మూలుగుతూ వున్నారు. ఎత్తుగా వున్న ఒడ్డుకు కొంచెం దూరంగా ఒక చిన్నకాలువలో పడి మూడు నాలుగు సంవత్సరాల బాలిక అరుస్తూ, యేడుస్తూ వుంది. హఠాత్తుగా ఆ బాలిక యేడ్పు ఓ యువకుని చెవిన పడింది. అతడు తన స్నేహితునితో అన్నాడు - ‘‘యశోదా, అటుగా యెవరో పసివాడు యేడుస్తున్నాడు.’’ యశోదా ‘‘అవును, వినిపిస్తున్నది. ఇది పిల్లలను తీసికొని రావలసిన చోటు కాదని యీ మూర్ఖులకు యెందుకు తెలియదో అర్థం కాకుండా వుంది. పద, చూద్దాం.’’ మిత్రులిద్దరూ బాలికను తీసికొని క్యాంప్ దగ్గరకు వచ్చారు. ‘‘ఈ పాప యెవరిదీ? యెవరి పాప అయినా తప్పిపోయిందా?’’ ఈ కేకలు విని ఎంతోమంది యాత్రీకులు ‘‘ఆఁ ఆఁ యే పాపా? యెక్కడా, యెక్కడా?’’ అంటూ పరుగెత్తుకొంటూ వచ్చి చూశారు, నిరాశతో వెళ్లిపోయారు. ఇక చదవండి.