Book Description
మృణాళిని వెంట ఆమె శయనాగారం వరకు నడిచి వెళ్లి హృషీకేశుడు మృణాళినితో- ‘‘మృణాళినీ! నీ చరిత్ర ఏమిటో నాకు చెప్పవూ?’’ అని ప్రశ్నించాడు. ‘‘నా చరిత్రను గురించి చెప్పమంటారా? అంటే?’’ అన్నది మృణాళిని. ‘‘అంటే ఏమీ లేదు. నువ్వెవరి కుమార్తెవో, నీ జీవితవృత్తాంత మేమిటో తెలుసుకోవాలని నాకు కుతూహలంగా వున్నది. ఈ విషయాలేవీ నాకు తెలియవు. తెలుసుకోడానికి ఇదివరలో నేనెప్పుడూ ప్రయత్నించనుకూడా లేదు. గురువుగారు ఆజ్ఞాపించారు. నేను ఆయన ఆజ్ఞను పాటించాను. నువ్వు కులటవని నేను తెలుసుకోలేకపోయాను’’ అన్నాడు హృషీకేశుడు. అలాగే వెళ్ళిపోతాను. మీ ఆజ్ఞను శిరసావహిస్తాను. రేపు ఉదయం మీరు నన్ను కూడా చూడరు’’ అని మృణాళిని సమాధానం చెప్పింది ఎటువంటి తొట్రుపాటూ కన్పించనివ్వకుండ! ఎవరీ మృణాళిని? ఆమెను నిందించిన హృషీకేశుడెవరు? తెలియాలంటే తప్పక చదవండి బంకించంద్ర ఛటర్జీ రచన మృణాళిని.