Book Description
ఇది రెండువేల అయిదువందల సంవత్సరాల క్రిందటి కథ. మాఘమాసంలో ఒకరోజు రాత్రిపూట, యాత్రికుల నౌక ఒకటి గంగానదిలో ప్రయాణం చేస్తోంది. ఆ రోజులలో దొంగలభయం ఎక్కువ. అంతేగాక పోర్చుగీసువారి భయం కూడా వుంది. అందుచేత యాత్రికుల పడవలు అయితేనేం, ఇతర పడవలు అయితేనేం ఒంటరిగా ప్రయాణం చేయడానికి జంకుతూ వుండేవి. కొన్ని పడవలు కలసి జట్టుగా ప్రయాణం చేసేవి. కాని యీ పడవ మాత్రం యిప్పుడు వంటరిగానే వస్తోంది. దీనికీ కారణం వుంది. అదేమిటంటే, ఈ రాత్రి చివరిజాములో తుఫాను బయలుదేరింది. దిక్కులు తెలియకుండా గందరగోళం యేర్పడుతుంది. ఈ గందరగోళంలో యెక్కడ వున్నదీ, ఎటువైపు పోతున్నదీ తెలియకుండా ఈ పడవ యిటువైపు ప్రయాణం సాగించింది. అంతవరకు వున్న పడవల జట్టునుండి యీ పడవ వేరు అయిపోయింది. ఈ సమయంలో ఈ పడవ యెటుపోతుందో ఎవరూ చెప్పలేరు. పడవలో వున్నవారిలో చాలమంది నిద్రపోతున్నారు. ఒక వృద్ధుడు, ఒక యువకుడు మాత్రం మెలుకువగా వున్నారు. వృద్ధుడు యువకునితో సంభాషణ సాగిస్తున్నాడు. ఇక చదవండి.