Book Description
వంగ సంవత్సరం 1176. వేసవికాలంలో ఒకరోజు. పదచిహ్న గ్రామం అనే పేరుగల ఆ వూళ్ళో ఎండవేడిమి మిక్కుటంగా వుంది. గ్రామంలో అనేక ఇళ్ళు వున్నాయి. అయితే మనుషులు యెవరూ అగుపించడం లేదు. ‘పదచిహ్న’ గ్రామంలో గణనీయమయిన వ్యక్తి ‘మహేంద్రసింహుడు’. అతడు చాల ఐశ్వర్యవంతుడు. అయినా ఈ కరువు మూలంగా బీదవారు, భాగ్యవంతులు ఒకటే అయిపోయారు. పెద్ద పెద్ద ఇళ్ళూ, భవంతులూ, మేడలు - అన్నీ జనశూన్యంగా వున్నాయి. అందరూ పట్టణం నుంచి పారిపోయారన్నమాట! మహేంద్రుడు తన భార్యను, కుమార్తెను ఒక ఇంటిలోనికి తీసుకువెళ్లాడు. వారిని లోన కూర్చుండజేసి, ఆ ఇంటిలో ఎవరైనా పలుకుతారేమోనని పిలిచాడు. బదులులేదు. తరువాత కళ్యాణితో ‘‘కొద్దిసేపు ధైర్యంగా ఇక్కడే వంటరిగా కూర్చో. నేను బయటకు వెళ్ళి కాసిని పాలు దొరుకుతాయేమో చూచి తీసుకువస్తాను’’ అని మహేంద్రుడు మట్టిపాత్ర తీసుకుని బయటకు వెళ్ళాడు. ఇక చదవండి.