Book Description
ఇవాళ ఇంద్రాణి తన స్థిరత్వాన్ని కోల్పోయింది. ఆమె హృదయం పగిలిపోతోంది. విచ్చిపోయిన నల్లని మేఘాలవంటి ఆమె పెద్ద నేత్రాలు వేరైపోయినై. వాటిల్లో మెరుపు మెరుస్తోంది. ‘నా భర్తనేనా అవమానపరచింది! విశ్వాసానికి, కృతజ్ఞతకు పరిణామం యిదేనా?’ ‘ఆదర్శప్రేమ’కు ప్రతీకయైన ఇంద్రాణి ఎందుకలా చేసింది? ‘హా! దురదృష్టమా! ఆకలితో గలగిల తన్నుకుంటున్న ఆ స్త్రీ వెంటనున్న బిడ్డ బైజనాథుడి పుత్రుడే. వందలకొలది బలసిన బ్రాహ్మణులు, సాధువులు, సన్యాసులు, పుతప్రాప్తి యాశ కల్పించి హల్వా, లడ్డూలు భుజించి పొట్టలు నింపుకుంటున్నారు. కాని ఆయన స్వంతబిడ్డకు ఒక రొట్టెముక్క కూడా లభించలేదు.’ తండ్రి చేస్తున్న ‘పుత్రకామేష్ఠి’ యాగంలో తన పుత్రుడే ఒక రొట్టెముక్కకు కూడా నోచుకోనంత మహౄపాపం ఏం చేశారు ఆ తల్లీకొడుకులు? ‘‘కుమూ! నేను మూఢుడ్ని, డాంభికుడ్ని కాదు. నిన్ను గుడ్డిదాన్ని చేసిందే కాకుండా నిన్నీ అంథకారకూపంలో వదలి మళ్ళీ పెళ్ళి చేసుకోను. ఆ కృష్ణభగవానుని మీద ఒట్టువేసి చెబుతున్నాను. ఒట్టు మారితే నేను బ్రహ్మహత్యా, పితృహత్యా ఘోరనరకాల ననుభవిస్తాను.’’ అంటూ ‘శుభదృష్టి’తో తన భార్యకు ఒట్టు వేసిన అవినాశ్ మళ్ళీ పెళ్ళికి సిద్ధపడేలా చేసిన పరిస్థితులేమిటి?