Book Description
ఈ కధల్లో భాష కంటే కూడా వాటిలోని పాత్రల చిత్రణే మనను అబ్బురపరుస్తుంది. పెళ్ళి ద్వారా స్వేచ్ఛను కోల్పోయిన వేశ్య లాజ్వంతి వొకవైపు, పెళ్ళి చేసుకోకపోయినా ప్రేమించిన వ్యక్తికే జీవితాంతం విదవగా వుండిపోయిన షంషాద్ బేగం మరోవైపు - భిన్నధ్రువాల్లాంటి యీ పాత్రల్ని స్త్రీ వాది దృక్కోణం నుంచి పరిశీలించినప్పుడు కొత్త పార్శ్వాలు ఆవిష్కతమౌతాయి. లైంగికత, నైతికత గురించి స్త్రీలు పురుషులకంటే పూర్తిగా భిన్నంగా ఆలోచిస్తారని యీ కథలు నిరూపిస్తాయి.