Book Description
1857 తిరుగుబాటులో హైద్రాబాద్ పాత్రను లోకానికి చాటాలన్న కోరికతో, ఆ అమరవీరులను స్మరించుకోవాలన్న ఆశతో, ఈ తరం వారికి ఆ అమరులను పరిచయం చేయాలన్న సంకల్పంతో ఈ కథల పుస్తకాన్ని మీ ముందుకు తెస్తున్నాను. ఇదేమీ సంపూర్ణమైనది కాదు. జూలై 17 ఉత్సవ సందర్భంగా ఆ రోజే ఆవిష్కరణ జరిపి ఆ అమరులకు నివాళులు అర్పించాలన్న ఆలోచనతో అనేక పరిమితులతో కూడిన ప్రయత్నమిది. బాబ్రీమసీదు దుర్ఘటన తర్వాత మతతత్వ వాదుల పుణ్యమా అని హిందువులు, ముస్లింల మధ్య గోతులు తవ్వి గోడలు లేపుతున్న ఈ సందర్భంలో 1857 తిరుగుబాటులో సాధించిన ‘‘హిందూ ముస్లిం ఐక్యత’’ మళ్లీ ఈనాడు కూడా సాధించాలన్న సంకల్పంతో ఈ కథలను మీ ముందుకు తెస్తున్నాను.