Book Description
‘‘చంద్రమండలంలో మన రీసెర్చి ప్రాజెక్టులో ఏదో సమస్య వచ్చింది. దాన్ని పరిష్కరించే బాధ్యత నాకు అప్పగించారు. నాకు అవసరమైన టీమ్‍ను నన్ను ఎంచుకోమన్నారు. నేను నిన్ను ఎంచుకున్నాను.’’ ‘‘కానీ అందుకు నా ఇష్టాయిష్టాలు అడగనవసరం లేదా?’’ ‘‘అవసరం లేదు.’’ ‘‘కానీ... నా రీసెర్చి కీలకమైన పరిస్థితిలో ఉంది’’ అంటూ ఏదో అనబోతున్న సంధ్య మాటలకు అడ్డు వచ్చాడు రౌండ్‍ట్రీ. ‘‘సంధ్యా...సామాజిక సంక్షేమం కోసం వ్యక్తిగత స్వార్థాన్ని త్యాగం చేయాలి. నీ రీసెర్చి కీలకమైన పరిస్థితిలో ఉంది. కానీ చంద్రమండలం క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. అందుకే ‘ఇది చేసి తీరాలని ఆజ్ఞాపిస్తే’ నోర్మూసుకుని చచ్చినట్టు ఆ పని చేయాలి నువ్వు. కాబట్టి మనం చంద్రమండలం వెళ్తున్నాం. నీకీ విషయంలో ఎటువంటి స్వేచ్ఛ లేదు’’ నిక్కచ్చిగా చెప్పాడు రౌండ్‍ట్రీ. బాధ్యతాయుతమైన శాస్త్రవేత్త అయిన సంధ్యకు తనకు ఇష్టం లేకపోయినా రౌండ్‍ట్రీ ఆజ్ఞను పాటించవలసిన విపత్కర పరిస్థితులు ఏమిటి? తాను చిక్కుకొన్న విషవలయంలో నుండి సంధయ బయటపడగలిగిందా?