Book Description
ఈ సంకలనంలో మొత్తం 42 కథలున్నాయి. 1927లో ప్రచురితమైన కథ మొదలుకొని 2019లో ప్రచురితమైన కథ వరకూ ఈ సంకలనంలో ఉన్నాయి. కథలను ఒక వరుసలో అమర్చటం వెనుక కూడా ఎంతో ఆలోచన, ఎన్నో తర్జన భర్జనలున్నాయి. సంకలనంలో అన్ని కథలు అవి ప్రచురితమైన సంవత్సరం ఆధారంగా •ష్ట్రతీశీఅశీశ్రీశీస్త్రఱ••శ్రీ శీతీ•వతీ లో అమర్చాము. ఇలా అమర్చటం వల్ల రచయితల ఆలోచనలలో మార్పులు, వారి శైలి పరిణామ క్రమం కూడా పరిశీలించే వీలు కలుగుతుంది. అయితే రెండు కథలు కాలం పరిధిలో ఒదగవనిపించింది. ఆ రెండు కథలు కాలానికి అతీతం అనిపించింది. అందుకని ఆ రెండు కథలనూ ఒకదాన్ని మొదటి కథగా, రెండవదాన్ని చివరికథగా ఉంచాం. ఈ నడుమ ఉన్నవి కులం కథలు. మొదటి కథలో అంకురార్పణం జరిగితే చివరి కథలో ఉపసంహారం అన్నమాట.