Book Description
భయానక కథలు అనగానే దయ్యాల కథలు, దయ్యాలు పీక్కుతినటం, రక్తమాంసాలు వెదజల్లటం, చివరికి ‘అంతా కల’ అని తేలటం లాంటి మూసకథలు కావివి. ప్రతి కథనూ ప్రత్యేక పక్రియకు ప్రతీకగా తీర్చిదిద్దటం జరిగింది. పాటకులు ఈ కథలను ఆదరిస్తారన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి కథలో ఒక చమత్కారం, ఒక జలదరింపు, ఒక ఆలోచన కలిగేటట్టు కథను సృజించటం జరిగింది. అందుకే కొన్ని కథలు చదువుతుంటే అవి భయానక కథల కన్నా ‘సస్పెన్స్’ కథలుగా అనిపిస్తాయి. కానీ కథ పూర్తయిన తరువాత ఒక్కసారి కళ్లు మూసుకుని కథను ఊహిస్తే, కథలోని సంఘటనలను తలచుకుంటే అప్పుడు జలదరింపు కలుగుతుంది. ‘ఆమె’ కథ ఇందుకు ఉదాహరణ.