Book Description
‘తాతా, ఈ పుస్తకంలో రాతలు, గీతలు అన్నీ నీవేనా?’ ‘అవునమ్మా ఎందుకూ? ‘నీకంటే నేనే బాగా వేస్తాను’ అందరి పిల్లల భవిష్యత్తేనమ్మా, నేను కోరుకునేది. ‘నోరు జారే ముందు వీపు చూసుకోమంటారు. కార్టూనిస్టులకు వీపు వుండదారా’ అన్నాడు అమర్ ఓసారి (డా. కోనేరు అమరేంద్ర ప్రసాద్, ఎన్నారై). ‘వేసేది వీపుతోనే కదా!’ అంటే నవ్వాడు. ఆ సంభాషణ సరదా ఎలా వున్నా, కార్టూన్లలో వాస్తవానికి దగ్గరకంటే దూరమే ఎక్కువగా ఉంటుంది. నవ్వించాలన్న ఉబలాటంలో అతి. అసంకల్పితంగా అతి గతి తప్పితే - నవ్వుతో నవ్వుతూ మన్నించండి. ఎందుకంటే అందరం నవ్వేజనా హాస్యోభవంతు - అనే నోళ్లమే. సర్వేజనా సుఖినోభవంతు - అనేవాళ్లమే.