Book Description
ఆంధ్రజ్యోతి దినపత్రికలో అనేక విషయాల మీద నేను వ్రాసిన వ్యాసాలను పుస్తకంగా తీసుకొని వస్తే బాగుంటుందని అనుకున్నాను. వ్యాసాలతో పాటు చాలా సంవత్సరాల క్రిందట ఆంధ్రభూమి దినపత్రికలో ‘స(జ)రదా కబుర్లు’ శీర్షికతో నేను వ్రాసిన జరదా మిత్రుడి ఆలోచనలను గూడా కలిపితే పుస్తకం వైవిధ్యతను సంతరించుకుంటుందని భావించాను. రాజకీయ విషయాలకు జరదా కబుర్లు తోడవుతే చదువరికి రిలీఫ్ కదా! ఈ పుస్తకానికి అందుకే ‘అక్షరాలోచనలు’ అనే పేరు సరిపోతుందని తోచింది. నా ఆలోచనలకు అక్షర రూపం యివ్వటమే గదా నేను చేసింది! అక్షరం శాశ్వతం అనేది గూడా మరో భావన. నేను వ్రాసిన వాటిని ప్రచురించిన పత్రికల సంపాదకులకు, యాజమాన్యాలకు కృతజ్ఞుడ్ని. రావులపాటి సీతారాంరావు