Book Description
భరతుడు అనగా భారము మోయువాడు అని అర్థము. లక్ష్మణుడు రామునకు వెలుపలి మరియొక ప్రాణమా అనునట్లుండెను. శతృఘ్నుడు భరతునకు అట్లే ఉండెను. భరతుడు వేదములను, స్మ•తి ఇతిహాస పురాణములను అధ్యయనము చేసెను. అతడు ధనుర్వేదమునందు ఆరితేరినవాడై తండ్రిమాటలను పరిపాలించుటలో శ్రద్ధగలవాడై యుండెను. తండ్రి మరణించుట, అన్న అరణ్యవాసము అను రెండు దుర్వార్తలు అతనిని పుండుపై కారము చల్లినట్లాయెను. అతడు కైకేయతో ‘‘ఓసి పాపాత్మురాలా! నీవు అడవికి పొమ్ము. నీకు నరకమున తప్ప వేరొకచోట ఎప్పటికిని స్థానము లేదు. నేను రాజ్యమును నా సోదరుడగు రామునికి సమర్పించి నా సోదరుని వెనుకకు తెచ్చుకొందునని పలికెను. ఆ సమయమున సీతారాములు చిత్రకూట పర్వతపు కొండచరియపై నుండిరి. భరతుడు సైన్యంతో రాముని యొద్దకు చేరి తన తల్లి తప్పిదాన్ని మన్నించి రాజ్యము స్వీకరించమని ప్రాధేయపడినాడు. రాముడు భరతునితో ‘‘భరతా! దైవనిర్ణయము మార్చుటకు అశక్యము. నీవు బుద్ధిమంతుడవు, ధీరుడవు. తండ్రిగారు జితేంద్రియులు. నీవు పట్టణమునకు వెళ్ళి వారి శాసనమును పాలింపుము. నన్ను వారెందులకు నియోగించిరో అది నేను నెరవేర్చెదను. తండ్రిగారి శాసనమును మీరరాదు’’ అని పలికెను. భరతుడు రామ పాదుకలతో అయోధ్యకు తిరిగి వచ్చెను. శ్రీరాముని ధర్మాచరణము, భరతుని త్యాగము మానవజాతికంతకును ఆదర్శము, ఆచరణీయం.