Book Description
ప్రపంచవ్యాప్తంగా అడవుల నరికివేత వేగం పుంజుకోవడంవల్ల మన ఓషదిసంపదనంతా అనుకోనంతా వేగంగా కోల్పోతున్నాం. ఓషధులను కేవలం ఆయుర్వేదం మరియు హోమియోపతిలోనే వినియోగించడంలేదు మనం. అలోపతిలోనూ అనేకం వినియోగిస్తున్నాం. ఓషధిసంపదను కోల్పోడమంటే మన ఆరోగ్యంపై భస్మాసురహస్తాన్ని మోపినట్లే. అందువల్ల ప్రజానీకంలో ఓషధుల ప్రాశస్త్యాన్ని గురించి మనం మరింత విజ్ఞానం జొప్పించవలసి వుంటుంది. వనాలు మన జీవనానికి అమృతవనాలు. వనాలు (అడవులు) లేనిదే జీవజాలమే లేదు. జీవజాలం లేని భూమిని ఎడారి అంటారు. పర్యావరణ పరిజ్ఞానం ప్రజానీకంలో లోపిస్తే మనం మన నాశనాన్ని కోరితెచ్చుకున్నట్లే- అందువల్ల పర్యావరణం యందలి అత్యాధిక ప్రాధిన్యం గల బయోస్ఫియర్ (జీవజాలం)ను గురించిన పలు అంశాలను ఎప్పటికప్పుడు మ నం సమాజానికందజేయడం ప్రస్తుత తరం విధి.