Book Description
దగ్గు, గొంతులో నసగా ఉన్నట్లయితే తగు మోతాదులో మిరియాల పొడిని తేనెతో కలిపి 5 రోజులు ప్రొద్దున, రాత్రి తింటే దగ్గు తగ్గును. కాకరాకు తింటే కడుపులో పాములన్నీ చస్తాయి. విషపదార్థాలు సేవించిన వారు కాకరాకు తింటే విరుగుడుగా పనిచేస్తుంది. కాకరాకుని వండుకు తింటే సమస్త వ్యాధులకీ మంచిది. తరచూ దీన్ని తినే వారికి రోగాలు దరిచేరవు. వారం వారం మీ ఆహారంలో కాకరాకుని భాగంగా చేసుకుంటే ఆరోగ్యం మీకు చేకూరుతుంది. శరీరానికి బలాన్నిచ్చి పైత్యం, ఎసిడిటి, ప్రేగుల్లో వచ్చే జబ్బులు, అమీబియాసిన్ వ్యాధులకు మెంతికూర ఔషధంలాగా పనిచేస్తుంది.