Book Description
స్వతంత్ర భారత సంగ్రామంలో తమ ప్రాణాలొడ్డి వీరోచితంగా పోరాడి, తల్లి భారతి దాస్య శృం•లాలను ఛేదించిన మహాసేనానులెందరో ఉన్నారు. ఈ స్వాతంత్య్ర సంగ్రామం నడపటంలోగానీ, ఇందులో పాలు పంచుకొన్న మహావీరులలో గానీ మన ఆంధప్రదేశ్ భాగం తక్కువేమీ కాదు. అయితే ఎందరు వీరులున్నా, ఎందరు ఈ పోరాటంలో పాలుపంచుకున్నా, ప్రజలతో మమేకమై, ప్రజలే తాను, తానే ప్రజలనే విధంగా తమ జీవితాలనే ప్రజాసేవకు అంకితం చేసినవారు కొద్దిమందే. ఆ కొద్దిమంది నాయకులలోనూ మొట్టమొదటగా పేర్కొనవలసిన మహానాయకుడు ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు. ఇంతగా ఆంధప్రజలు మెచ్చిన, ఆరాధించిన ప్రజానాయకుడు మరొకరు లేరు.