Book Description
ఈ పుస్తకంలో సూర్యుని లక్షణాలు వివరంగా వున్నాయి. ఇది విశ్వంలోని మిగతా నక్షత్రాల అవగాహనకు వీలవుతుంది. సుదూర నక్షత్రాలను, నక్షత్రాల సమూహాలయిన గాలక్సీల గురించి తెలుసుకోవచ్చు. వీటిని చూడటానికి వాడే టెలిస్కోపుల గురించి వివరించబడ్డది. విశ్వం గురించి తెలుసుకోవటంలో భారీ వస్తువులయిన గాలాక్సీలకు, నక్షత్రాలకు ఎంత ప్రాముఖ్యమున్నదో కంటికి కనిపించని సూక్ష్మాతి సూక్ష్మమయిన భౌతిక కణములకు కూడా అంతే ప్రాబల్యమున్నది. విశ్వం విశాలమవుతున్నదని, అది గడచిన సుదీర్ఘ కాలంలో ఎప్పుడో ఒక బిందువుగా ఏర్పడి ఒక పేలుడు లాంటి సంఘటనతో ప్రస్తుత స్థితికి చేరుకోవటానికి గల క్రమం తెలుసుకోవచ్చు. ఈ క్రమంలో మన సంస్క•తీ సాహిత్యాల అనుసంధానం ఉన్నది.