Book Description
గత నూరు, నూటయాభై సంవత్సరాల కాలంలో ఎంతోమంది మహామహులు జన్మించి జాతికి పథనిర్దేశం చేశారు. మానవత్వపు విలువలను జాగృతం చేశారు. తరతరాలుగా గౌరవం పొందుతున్న జాతి చరిత్రను, సంస్కృతిని, దేశభక్తిని పునరుద్దీపితం చేశారు. వారిలో తోమంది కృష్ణాజిల్లా వారూ ఉన్నారు. వారు కూడా తాము పుట్టిన జాతికి, భాషకు ప్రాంతానికి గొప్ప పేరు తీసుకువచ్చారు. అటువంటి మహామహులను, జాతిరత్నాలను సంగ్రహంగా పరిచయం చేయాలనేదే ఈ గ్రంథం ధ్యేయం. నూరుగురు విశిష్ట వ్యక్తుల జీవిత చిత్రణ సంపుటి ఈ పుస్తకం. ఎందరో సాహితీ ప్రియులు వివిధ పత్రికలలో వ్రాసిన వ్యాసాలను సేకరించి ఈ పుస్తకానికి అనుకూలంగా కొద్దిపాటి మార్పులు, చేర్పులు చేసి కూర్చటమైనది. ఇందులో ఆయా ప్రముఖులు, ఆయా కాలాలలో తమ విశిష్టతను తమ ప్రత్యేకతను ఏ విధంగా వెల్లడించింది, చరిత్ర, భాష, సంస్కృతి, మతం, ఆథ్యాత్మిక సేవ, స్వాతంత్రోద్యమం, సమసమాజ స్థాపనకు పోరాటాలు, ఉద్యమాలు, సంఘ సంస్కరణకు ఉద్యమాలు.... ఇలా వివిధ రంగాలలో వారు చేసిన కృషి రేఖామాత్రంగా విశ్లేషించడమైనది.