Book Description
‘పది రూపాయల మంత్రం’ ప్రజాస్వామ్యం అంటే ప్రజలే ప్రభువులు అనేగా అర్థం. ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసేవారిని పబ్లిక్ సర్వెంట్స్ అంటారు. మరి ‘ప్రభువు’కి ప్రజాపాలనలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా! 2005లో సమాచార హక్కు చట్టం వచ్చిన తరువాత ప్రజలకు సమాచారం గురించి అడిగే హక్కు వచ్చింది. ఈ హక్కు గురించి అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఈ హక్కు సమాచారం తెలుసుకోవడానికే కాదు ప్రజాపాలనలో పారదర్శకత కోసం కూడా వాడవచ్చు. ఈ హక్కు సక్రమంగా వాడితే అవినీతిని అరికట్టవచ్చు. ఈ ‘అడుగు’ ఇది చిన్నదైనా గొప్ప ఉద్యమానికి నాంది కాగలదని ఆశిస్తూ...